అమిత్‌షా గురి
నగరానికి చేరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నేడు రాష్ట్ర పదాధికారులు, కార్యకర్తలతో సమావేశం
విజయవాడ : నూతన రాష్ట్రంపై బీజేపీ దృష్టిసారించింది. పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వరుస కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోభాగంగానే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం రాత్రి నగరానికి వచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులతో సమావేశం కాను న్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ నగరంతోపాటు జిల్లాకు చెందిన ప్రముఖులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. జిల్లా సభ్యత్వ ప్రముఖులతోనూ మాట్లాడతారు. పార్టీ సభ్యత్వంపై ఆయన చర్చించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇటీవల పార్టీలో చేరిన నాయకులను అమిత్‌షాకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరిచయం చేసే అవకాశం ఉంది. గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు కంభంపాటి హరిబాబు, అఖిల భారత సభ్యత్వ సహప్రముఖ్ రవి, పార్టీ ముఖ్య నాయకులు నగరానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం వస్తారు.
ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
గన్నవరం : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు గురువారం రాత్రి స్థానిక ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ఆయనకు మహిళా నేతలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో స్వాగతం పలికినవారిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎంపీ గోకరాజు గంగరాజు, రాష్ర్ట మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.శాంతారెడ్డి, సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి, నాయకులు వి.శ్రీనివాసరాజు, కుమారస్వామి, లక్ష్మీపతి, వి.రంగప్రసాద్, జిల్లా అధ్యక్షడు ఆర్.వెంకటకృష్ణ, నగర అధ్యక్షుడు దానం ఉమామహేశ్వరరాజు ఉన్నారు. అనంతరం అమిత్ షా కృష్ణా కరకట్ట పక్కన ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. నగరంలో కేంద్ర మాజీ మంత్రి పురందే శ్వరి, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు.