
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : మీడియా ముసుగులో మాఫియా దందా చేస్తున్న నలుగురు జర్నలిస్టులపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రముఖ చానళ్లలో జర్నలిస్టులుగా చలామణీ అవుతూ బ్లాక్ మెయిల్, దందాలకు పాల్పడుతున్నారని క్వారీ వ్యాపారి గోపొసెట్టి రమేష్ ఇటీవల తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మైనింగ్ స్క్వాడ్ ఏలూరు నుంచి వచ్చింది. వారంతా ఓ హోటల్లో ఉన్నారు’అంటూ బెదిరించి నగదు వసూళ్లు చేశారని రమేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తమ్మిసెట్టి రంగసురేష్(స్టూడియో.ఎన్), వానపల్లి పుండరీకాక్షుడు(స్టూడియో.ఎన్), మెర్జా. రమేష్(టీవీ9), పెర్దోజు మురళి(ఎన్ టీవీ)లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment