సీఎం చెంతకు ‘గూడెం’ పంచాయితీ
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగు తమ్ముళ్ల పంచాయితీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది. బుధవారం సాయంత్రం చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు తాడేపల్లిగూడెం టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ లభించింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో మిత్రపక్షాల విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంత్రి మాణిక్యాలరావు తమను లెక్కచేయట్లేదంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
విమానాశ్రయ భూముల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మూడేళ్లగా టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నాపట్టించుకోవటం లేదంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లు మూడు రోజులుగా దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కలుగుజేసుకుని వారితో మాట్లాడనున్నారు.