కట్న రక్కసికి వివాహిత బలి
Published Mon, Aug 22 2016 12:52 AM | Last Updated on Sat, Aug 11 2018 9:10 PM
తాడేపల్లిగూడెం రూరల్ : అదనపు కట్నం కోసం ఓ వివాహితను ఆమె భర్త హత్యచేశాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తాడేపల్లిగూడెం కొబ్బరితోట ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని కొబ్బరితోట కాశీవిశ్వేశ్వరస్వామి వీధిలో నివాసముంటున్న ఉర్రింకల గంగాధరరావుకు కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన జానకి (32)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో రెండెకరాల పొలం, లాంఛనాలు అందజేశారు. గంగాధరరావు ఓ ప్రైవేట్ సంస్థలో అటెం డర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నా రు. మూడేళ్లుగా అదనపు కట్నం కోసం జానకిని గంగాధరరావు వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టింట్లో నే ఉంటోంది. ఇటీవల పెద్దల సమక్షంలో వీరు గొడవ లు సర్దుబాటు చేసుకున్నారు. శనివారం సాయంత్రం జానకిని పుట్టింటి నుంచి తాడేపల్లిగూడెంలోని తన ఇం టికి గంగాధరరావు తీసుకువచ్చాడు. తర్వాత జానకి తల్లి పరమేశ్వరి కుమార్తె క్షేమ సమాచారం కోసం గంగాధరరావుకు ఫోన్ చేయగా స్విచాఫ్ చేసి ఉంది. దీంతో కంగారుపడిన ఆమె ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం చేరుకుంది. అప్పటికే జానకి మృతి చెంది ఉండటా న్ని చూసి తట్టుకోలేకపోయింది. అదనపు కట్నం కోసం తన కుమార్తెను గంగాధరరావు హత్య చేసి ఉంటాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి, ఎ స్సై ఎం.సూర్యభగవాన్ మృతదేహాన్ని పరిశీలించి పో స్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement