సాక్షి, తాడేపల్లిగూడెం: టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదు రూలింగ్ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మిత్రపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇసుక, ఎన్ఆర్జీఎస్, ఎర్ర చందనం, గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు టీడీపీ వక్రభాష్యం చెబుతోందని వాపోయారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీకి కేటాయించిన సీట్లకు పోటీ చేసిందని తెలిపారు. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కనీస గౌరవం ఇవ్వటంలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వీర్రాజు మంగళవారం వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తమ పార్టీ మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు పగలి కలలు కనడం మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు.
టీడీపీ వక్రభాష్యం
Published Wed, Dec 20 2017 4:09 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment