సాక్షి, పశ్చిమ గోదావరి: తాడేపల్లి గూడెంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. పోలీసులు అనుమతి లేకుండా టీడీపీ శ్రేణులు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. టీడీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో, వారు మరింత రెచ్చిపోయారు.
వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. అనుమతి లేకుండా పాదయాత్ర చేపట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా పోలీసులు.. జిల్లాలో సెక్షన్30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని, సెక్షన్ 144 అమలులో ఉండటంతో పాదయాత్రను నిరాకరించినట్టు తెలిపారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment