
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం అనకాలపల్లి చీడికాడ మండలం వరహాపురం స్కూల్ కమిటీ ఎన్నికలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీకి బలం లేకపోవడంతో అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికలో చేతులెత్తే విధానానికి స్వస్తి పలికి సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్కూల్ హెచ్ఎంపై టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో వరహపురం స్కూల్ కమిటీ ఎన్నిక గందరగోళంగా మారింది.