సాక్షి, విశాఖప్నటం: చంద్రంపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి తెగపడింది. ఈ ఎన్నికల్లో మొదట ముగ్గురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గెలవడంతో ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికల వాయిదా వేయడానికి స్యూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకొలేదు. అక్కడితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్కూల్లోకి ప్రవేశించారు.
దీంతో అవుటర్స్‌ను ఎలా స్కూల్లోకి అనుమతిస్తారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలిదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఎన్నికల నిర్వహించకుండానే టీడీపీ సానుభూతిపరులు గెలిచినట్లు ప్రకటించారు. స్కూల్‌లోకి టీడీపీ కార్యర్తలు దూసుకురావటంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment