ఏటీఎంలలో ఉంచేందుకు బ్యాంకులకు నగదు కొరత
ఆర్‌బీఐ నుంచి తగ్గిన నగదు విడుదల
కాల్‌మనీ ఘటనా ఓ కారణం!
సొమ్ము డ్రా చేసుకునేందకు ఖాతాదారుల అవస్థలు
తాడేపల్లిగూడెం : ఏటీఎంలకు వాడుకలో ఉన్న పేరు ఎనీ టైం మనీ అని. వాస్తవానికి ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్. ప్రస్తుతం ఏటీఎంల పరిస్థితి ఎనీ టైం మూత అన్న విధంగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావటంతో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ త్రైమాసకానికి(జనవరి నుంచి మార్చి వరకు) బ్యాంకులకు విడుదల చేసే నగదుపై నియంత్రణ విధించారు. ఫలితంగా బ్యాంకుల్లో లిక్విడ్ క్యాష్ నిల్వలు తగ్గాయి. ఆ ప్రభావం ఏటీఎంలపై పడింది. ఆయా బ్యాంకులు రోజు వారీ లావాదేవీలకు అనుగుణంగా ఏటీఏంలలో నగదును ఉంచుతాయి.
బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నట్టయితే ఏటీఎంలనుంచి నగదు విత్ డ్రా చేసుకునేవారికి అసౌకర్యం కలగకుండా ముందు పనిదినాన ఎక్కువ సొమ్మును ఏటీఎంలలో ఉంచుతారు. సుమారు 15 రోజులుగా చాలా ఏటీఎంలలో సంబంధిత బ్యాంకులు నగదు పెట్టలేక వాటికి తాళాలు వేసి ఉంచుతున్నాయి. జిల్లాలో సుమారు 440 బ్యాంకు శాఖల ద్వారా రోజుకు వెయ్యి కోట్ల రూపాయల వరకు నగదు లావాదేవీలు జరుగుతున్నట్టు అంచనా. సంబంధిత బ్యాంకు బ్రాంచి ఉన్న పట్టణాలు అయితే ఆ బ్యాంకుకు చెందిన ఒకటి నుంచి నాలుగు వరకు ఏటీఎంలు ఉంటున్నాయి. బ్యాంకు బ్రాంచిలు లేని గ్రామాలు, పట్టణాల్లో కూడా ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆర్థిక లావాదే వీలకు ఏటీఎంలపై ఆధారపడటం ఎక్కువైంది. ఎవ్వరికైనా సొమ్ములు ఇవ్వాలంటే ఏటీఎం దగ్గరకు రా.. డ్రా చేసి ఇస్తాను అనే పరిస్థితి ఉంది.
ఆర్‌బీఐ నుంచి తగ్గిన నగదు కేటాయింపులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల లావాదేవీలకు నుగుణంగా రిజర్వుబ్యాంకు నుంచి నగదును సంబంధిత బ్యాంకులకు కేటాయిస్తారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరాంతం వచ్చే సరికి ఈ కేటాయింపులను రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో బ్యాంకులకు నగదు కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. దీంతో అన్ని ఏటీఎంలలో సొమ్ములు ఉంచలేని పరిస్థితి కొన్ని రోజులుగా జిల్లాలో ఏర్పడింది. ఈ కారణంగా కొన్ని ఏటీఎంలను చాలా రోజలపాటు మూసేస్తున్నారు కూడా.
ఏటీఎం.. ఎనీ టైం మూత
Published Sun, Mar 13 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement
Advertisement