28న జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు | aug 28th national cultural programmes | Sakshi
Sakshi News home page

28న జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు

Published Wed, Aug 3 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): తాడేపల్లిగూడెం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి అండ్‌ టీఆర్‌ త్యాగరాజు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్నట్టు పరిషత్‌ వ్యవస్థాపకుడు కోపల్లె శ్రీనివాస్‌ తెలిపారు.

తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్‌ సెంటర్‌): తాడేపల్లిగూడెం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో పద్మశ్రీ రేలంగి అండ్‌ టీఆర్‌ త్యాగరాజు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్నట్టు పరిషత్‌ వ్యవస్థాపకుడు కోపల్లె శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీలు తాడేపల్లిగూడెంలోని బీవీఆర్‌ కళాకేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీలోపు వచ్చిన పౌరాణిక–జానపద విభాగంలో 15 ఎంట్రీలు, చారిత్రక–సాంఘిక విభాగంలో 10 ఎంట్రీలు స్వీకరిస్తామని తెలిపారు. వివరాలకు పరిషత్‌ వ్యవస్థాపకుడు కోపల్లె శ్రీనివాస్, ఎస్‌వీవీ నికేతన్, కె.పెంటపాడు, తాడేపల్లిగూడెం, సెల్‌ 92474 51856 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 
  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement