ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొబ్బరిపాకలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దాంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.