కిరాణా దుకాణంపై విజిలెన్స్ దాడులు | Vigilance raid on grocery shop | Sakshi
Sakshi News home page

కిరాణా దుకాణంపై విజిలెన్స్ దాడులు

Published Fri, Oct 30 2015 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

Vigilance raid on grocery shop

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : అక్రమంగా నిల్వ చేసిన పప్పు ధాన్యాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ కిరాణ షాపులో కంది పప్పు, మినపప్పు అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ అధికారులు ఆ షాపుపై దాడి చేసి 23లక్షల 15వేల 700 ల రూపాయల విలువ చేసే కంది పప్పు, మినపప్పు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అనిల్, సీఐ వెంకటేశ్వరరావు, ఏజీపీవో సత్యనారాయణ, డీసీపీ శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా ఆహారధాన్యాలు నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement