నిట్ ఏర్పాటు చారిత్రక పరిణామం: సుజనా | Union Ministers To Lay Foundation Stone For NIT at Tadepalligudem | Sakshi
Sakshi News home page

నిట్ ఏర్పాటు చారిత్రక పరిణామం: సుజనా

Published Thu, Aug 20 2015 11:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం ఓ చారిత్రక పరిణామం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయడం ఓ చారిత్రక పరిణామం అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. గురువారం తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా కేంద్రానికి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడులు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడైనా నిట్ ఏర్పాటు చేస్తే 120 సీట్లే ఇస్తారని... కానీ తాడేపల్లిగూడెంలో నిట్ విద్యా సంస్థకు 420 సీట్లు వచ్చాయని తెలిపారు.

తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటుకు స్థలం ఏర్పాటులో కొంత జాప్యం జరిగిందని ఈ సందర్భంగా సుజనా చౌదరి గుర్తు చేశారు. ఏలూరులో కూడా విద్యా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement