తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సహేతుకచర్య కాదని వైసీపీ నేత, అమలాపురం నిమోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జీ అన్నారు. నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్చార్జ్ వంక రవీంద్రతో కలసి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ పాలన సరిగ్గా సాగాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. ప్రజల్లో జగన్‌పై అభిమానం ఉందని, టీడీపీ ఎన్నికలకు వస్తే అది రుజువు అవుతుందని వ్యాఖ్యానించారు.