
సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెంలో వింత ఘటన చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంకు చెందిన చెల్లు నాగ సూర్యకుమారి అనే గర్భిణీ మహిళకు సీరియస్‌గా ఉండటంతో మదర్ వన్నిని హాస్పిటల్‌కు తరలించారు. మహిళ పరిస్థితి దృష్ట్యా అక్కడి వైద్యులు ఆమెకు ఆరో నెలలోనే ప్రసవం చేశారు. అయితే గుండె బయటి వైపు ఉండేలా పాప జన్మించింది. గుండె బయటకు కనబడేలాగా కొట్టుకోవడంతో ఆస్పత్రి వైద్యులు ఆందోళన చెందారు. శిశువు ఆరోగ్యంగానే ఉందని తెలిపిన వైద్యులు.. సర్జరీ చేసేందుకు మెరుగైన ఆస్పత్రికి పంపించేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఆ పాప పుట్టిన 30 నిమిషాల తర్వాత మృతి చెందడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment