ఏపీ నిట్ ఫస్టియర్ రెండో సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.
తాడేపల్లిగూడెం : ఏపీ నిట్ ఫస్టియర్ రెండో సెమిస్టర్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. రెండు సెమిస్టర్లలో 9.87 గ్రేడ్ పాయింట్లతో బెంగళూరుకు చెందిన శ్రేయ శశిధర్ కుడారి ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్కు చెందిన సత్యవిజయ వాగ్దేవి ద్వితీయ స్థొనం పొందింది. మొత్తం 416 మంది విద్యార్థులు నిట్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 327 మంది అన్ని సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాలను వైబ్‌సైట్‌లో ఉంచామని, విద్యార్థులు తమ లాగిన్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని ప్రొఫెసర్ రమేష్ పేర్కొన్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో హాజరు తగ్గిన 42 మంది విద్యార్థులను డిటెయిన్ చేశామని, వారితోపాటు సెమిస్టర్ తప్పిన విద్యార్థులకు ఈనెల 30 నుంచి సమ్మర్ క్వార్టర్ నిర్వహిస్తామని తెలిపారు. వారికి జూలైలో తిరిగి పరీక్షలు ఉంటాయన్నారు.