సీఎం జగన్‌ మార్గదర్శకత్వంలో ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలు | APNRTS Services For NRI's | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ మార్గదర్శకత్వంలో ప్రవాసాంధ్రులకు మెరుగైన సేవలు: APNRTS

Published Wed, Jan 31 2024 5:59 PM | Last Updated on Wed, Jan 31 2024 6:32 PM

APNRTS Services For NRI's - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏపీ రాష్ట్రవాసులకు అనేక ఉచిత సేవలు అందిస్తూ, వారికోసం నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీఎన్ఆర్‌టీఎస్‌ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ పి. హేమలత రాణి .. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో “మీట్ ది ప్రెస్” చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

వెంకట్ ఎస్. మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్‌టీఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులకు వివరించారు.మేడపాటి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీఎస్‌) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మార్గదర్శకత్వంలో ముందుకేల్తోందని అన్నారు.

 

ఏపీఎన్ఆర్‌టీఎస్‌ 24/7 హెల్ప్ లైన్, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఉచిత అంబులెన్సు సర్వీస్, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా, అడ్వాన్స్డ్ ఐటి కోర్సులలో శిక్షణ, అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్థానిక, విదేశీ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడం, రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు తగు సలహాలు, సూచనలు అందించడం, ఏపీ పోలీస్ఎన్నారై సెల్ ద్వారా ప్రవాసాంధ్రులకు స్వరాష్ట్రంలో  స్థిర, చర ఆస్తి వివాదాలు, వివాహ సమస్యలు-మోసాలు పరిష్కరించడం, అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఎంబసీలతో సమన్వయం చేస్తూ వ్యక్తులను స్వదేశం తీసుకురావడం, ఆయా దేశాలు ఆమ్నెస్టీ ప్రకటించినప్పుడు రాష్ట్రవాసులను ఉచితంగా స్వస్థలాలకు తీసుకురావడం వంటి అనేక సేవలను అందిస్తోంది.

విద్యావాహిని ద్వారా విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఉచిత కౌన్సెలింగ్ & జగనన్న విదేశీ విద్యా దీవెన (JVVD) గురించి వివరించడం,  ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ ద్వారా ప్రవాసాంధ్రులు వారి గ్రామాలు, పట్టణాలలో పాఠశాలల్లో విద్యార్థుల కొరకు లైబ్రరీలు ఏర్పాటు చేయడం, ప్రవాసాంధ్రుల పల్లెలలో వారు కోరిన “నాడు-నేడు” లో పొందుపరచని అవసరాలను పాఠశాలల్లో సమకూర్చడం, ఆసుపత్రులు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు చేయడం వాటిని ఏపీఎన్ఆర్టీ ట్రస్ట్ సంబంధిత శాఖలు, అధికారులతో సమన్వయము చేయడం, పాస్పోర్ట్, పిసిసి లలో డాక్యుమెంటేషన్ సహాయం, పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడంలో సహాయం, రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలలో విఐపీ దర్శనం తదితర సేవలను కూడా ఏపీఎన్ఆర్‌టీఎస్‌ అందిస్తోంది.

అంతేకాకుండా  ఉపాధి, ఉద్యోగ నిమిత్తం ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారికోసం సక్రమ వలసల పై పలు జిల్లాల్లో  ముందస్తు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ప్రతి ఒక్కరూ ఏపీఎన్ఆర్‌టీఎస్‌ లో రిజిస్టర్ చేసుకొని,  ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఎన్ఆర్‌టీఎస్‌ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఏపీఎన్ఆర్‌టీఎస్‌ ప్రాంతీయ కార్యాలయమైన రాజంపేటలోని వైఎస్సార్ ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ద్వారా చుట్టుపక్కల ఉన్న వారు నేరుగా వెళ్లి విదేశీ వలస గురించి, అక్కడ జీవన విధానం గురించి  సమాచారాన్ని తెలుసుకొని, వారికున్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.

గత  నాలుగున్నర సంవత్సరాలలో ఏపీఎన్ఆర్‌టీఎస్‌ అందించిన సేవలు, ఎంతమంది లబ్ది పొందారో వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయని శ్రీ వెంకట్ మేడపాటి పేర్కొన్నారు.

# ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి సొసైటీలో రిజిస్టర్ చేసుకున్న సభ్యుల సంఖ్య: 2,20,000 కి పైగా

# ఏ‌పి‌ఎన్‌ఆర్‌టిఎస్ అందిస్తున్న వివిధ సేవలు: 28 కి పైగా

# ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి సొసైటీ ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య:  2,55,000 కి పైగా

# వివిధ దేశాలలో  కో ఆర్డినేటర్లు:  200 మంది పైగా

# వివిధ దేశాలలో సమన్వయము చేసుకుంటున్న  ఎంబసీ, సిజిఐలు : 30 కి పైగా

# ప్రవాసాంధ్రుల నుండి 24/7 హెల్ప్ లైన్ రిసీవ్ చేసుకున్న,చేసిన కాల్స్:   2,02,093

# విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రుడి పై ఆధారపడిన కుటుంబానికి ఆర్ధిక ఆసరాగా ఇస్తున్న ఎక్స్ గ్రేషియా పొందిన వారి సంఖ్య: 489, విడుదల చేసిన  మొత్తం: రూ. 2 కోట్ల 44 లక్షలు 

# విదేశాల్లో మరణించిన వారి భౌతికకాయాల్ని విమానాశ్రయాల నుండి వారి స్వగ్రామాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్సుల సంఖ్య:  1,077,  ఖర్చు: రూ. 1 కోటి 93 లక్షలు 

# కువైట్, ఉక్రెయిన్, సుడాన్ & ఇజ్రాయిల్ దేశాలలో నెలకొన్న గడ్డు పరిస్థితులలో  ఉద్యోగులు, విద్యార్థులు, వలసకార్మికులు, పర్యటనలకు వెళ్ళిన వారిని స్వదేశానికి తీసుకువచ్చిన (రీపాట్రియేషన్) వారి సంఖ్య: 3,610 

# టెంపుల్ ట్రావెల్ సేవ  ద్వారా దేవాలయాలలో దర్శనాలు చేసుకున్న ప్రవాసాంధ్రుల సంఖ్య:  6,169 

# ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ & మైగ్రంట్ రిసోర్స్ సెంటర్ (ఎమ్‌ఆర్‌సీ సెల్)  ద్వారా పరిష్కరించిన గ్రీవెన్స్ లు:  1739

# వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చిన వారి సంఖ్య: 900 మందికి  పైగా 

# మృతదేహాల రవాణాకు సంబంధించిన ఖర్చు: రూ. 33 లక్షలు

# అమ్నెస్టీ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావటానికి (రీపాట్రియేషన్)  అయిన  ఖర్చు: రూ. 1 కోటి  10 లక్షలు పైగా

# అడ్వాన్స్డ్ ఐటీ కోర్సులలో శిక్షణ  పొందిన వారి సంఖ్య:  876

# ప్రవాసాంధ్ర భరోసా బీమా తీసుకున్న వారి సంఖ్య: 33,596, క్లెయిమ్స్ విడుదల: రూ. 44,05,604, పురోగతిలో ఉన్న క్లెయిమ్స్ : రూ. 25,53,700

ఈ బీమాకు సంబంధించి ఏపీఎన్ఆర్‌టీఎస్‌ కొద్దిరోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.  3 సంవత్సరాలకు ఉద్యోగులు కడుతున్నరూ. 550 ల  ప్రీమియంలో 50%, ఒక సంవత్సరానికి విద్యార్థులు కడుతున్న రూ. 180 ప్రీమియం పూర్తిగా రాయితీ కల్పించింది. దీని ద్వారా 3232 మంది ఉద్యోగులు, 516 మంది విద్యార్థులకు లబ్ది కలిగింది. వీరి తరఫున ఏపీఎన్ఆర్‌టీఎస్‌ మొత్తం రూ. 9,80,662 ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టింది.    

# విద్యావాహిని సేవను వినియోగించుకున్న విద్యార్ధుల సంఖ్య: 3,118 

# వివిధ దేశాలలో ఉన్న 130 కి పైగా తెలుగు సంఘాలతో సమన్వయము

# టిటిడి సహకారంతో, ఏ‌పి‌ఎన్‌ఆర్‌టిఎస్ సమన్వయము చేసి వివిధ దేశాలలోని  పలు నగరాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణాలు: 46

# ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్లతో నిర్వహించిన “Exam Stress Management” ఆన్ లైన్ శిక్షణకు కు హాజరైన లెక్చరర్ల సంఖ్య:  6,800

# ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి సొసైటీ ద్వారా ఉద్యోగ లభ్ది పొందిన వారి సంఖ్య (దేశ, విదేశాల్లో): 1,218

# సక్రమ వలసలపై నిర్వహించిన అవగాహన సదస్సులు:  14

(పశ్చిమ గోదావరి - 4, కోనసీమ - 3, తూర్పు గోదావరి - 2, కడప - 2, శ్రీకాకుళం -1, కాకినాడ - 1, అన్నమయ్య – 1)

# “ప్రశిక్షణ, శిక్షణ” కార్యక్రమం ద్వారా కమ్యూనికేషన్ లో శిక్షణ పొందిన టీచర్ల సంఖ్య:  210,  విద్యార్ధుల సంఖ్య: 170

#ఏపీఎన్ఆర్‌టీ ట్రస్ట్ కు  ధన, వస్తువు రూపేణా  వచ్చిన విరాళం దాదాపు రూ. 7 కోట్లు 

14 ప్రభుత్వ పాఠశాలలకు సహాయం
పాఠశాలల్లో ఆట స్థలాల అభివృద్ధి 
అదనపు తరగతి గదులు
సైకిల్ షెడ్లు, భోజనశాలలు (డైనింగ్ హాల్స్) తదితర అభివృద్ధి పనులు  

# వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బాలల గ్రంథాలయాలు: 61, అయిన ఖర్చు: రూ. 17,30,000
 
కోవిడ్ సమయం లో వివిధ దేశాలలో ఉన్న ఏపీ వారికోసం ఏపీఎన్ఆర్‌టీఎస్‌ 24/7 హెల్ప్ లైన్ నంబర్లను అత్యవసర నంబర్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీఎన్ఆర్‌టీఎస్‌ సిబ్బంది హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు విమానాశ్రయాలకు వెళ్లి మనవారిని రిసీవ్ చేసుకొని జిల్లా పరిపాలన అధికారులతో సమన్వయము చేసుకుంటూ ప్రభుత్వ బస్సుల్లో 44,000 మందికి పైగా  వారి ఊర్లకు చేర్చడం జరిగింది. 

అనంతరం జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు, సందేహాలను నివృత్తి చేసారు.

విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏపీఎన్ఆర్‌టీఎస్‌ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా,  ఏదేని సహాయం కొరకు  ఏపీఎన్ఆర్‌టీఎస్‌ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను ఎల్లవేళలా సంప్రదించగలరు.


చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
ఏ‌పీ‌ఎన్‌ఆర్‌టి సొసైటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement