
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు జనసేన నేత గుణ్ణం నాగబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గుణ్ణం నాగబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన తనయుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావులకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది: విజయ సాయిరెడ్డి
ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక పాలకొల్లుకు చెందిన గుణ్ణం నాగబాబు గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment