సాక్షి, విజయవాడ: దేశచరిత్రలోనే తొలిసారిగా ఇంతటి మహాయజ్ఞం నిర్వహించడం ఇదే ప్రథమం అని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యాగం వైభవంగా జరిగిందన్నారు. ఎనిమిది ప్రధాన ఆగమాలని అనుసరించి ఒకే దగ్గర దేవతామూర్తులకి యాగాలు నిర్వహించాం. ఇందులో ప్రధానంగా నాలుగు ఆగమాలైన పాంచరత్న, వైఖానస, వైదిక స్మార్తం, శైవానుసారం యాగాలు నిర్వహించాం’’ అని మంత్రి అన్నారు.
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన యజ్ఞం విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి అన్నారు. ‘‘ఆగమ సలహా మండలి, ధార్మిక మండలి, పండితుల సలహాల ప్రకారమే యాగాన్ని నిర్వహించాం. ఒక్కొక్క యాగశాలలో 27 కుండలములతో మొత్తంగా 108 కుండలాలతో యాగం ఘనంగా నిర్వహించాం. లోక కళ్యాణార్ధం, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం నిర్వహించిన యజ్ఞం విజయవంతమైంది. ఆరు రోజుల పాటు ఎటువంటి అవాంతరాలు రాకుండా మహాయజ్ఞం నిర్వహించగలిగాం. 600 మంది రుత్వికులు, 200 మంది వేదపండితులు ఈ యాగాలలో పాల్గొన్నారు’’అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
మండుటెండని సైతం లెక్క చేయకుండా రుత్వికులు ఈ మహాయజ్ణంలో పాల్గొన్నారు. అనుగ్రహభాషణ చేసిన పీఠాదిపతులకి ప్రత్యేక ధన్యవాదాలు. పాంచరత్నంలో సుదర్శన యాగం 50 వేలకి మించి అవనం సాగింది. వైదిక స్మార్త యాగశాలలో రాజశ్యామల , చండీ యాగాలు నిర్వహించాం. వైఖానస యాగశాలలో నారాయణ మంత్ర హోమం జరిగింది. శైవాగమ యాగశాలలో అతి రుద్ర యాగం నిర్వహించాం. యాగానికి అవసరమైన యజ్ణ ద్రవ్యాలలో ఎక్కడా రాజీపడలేదు. దేశీయ ఆవుతో కూడిన నెయ్యిని రుత్వికుల సూచనల మేరకు వినియోగించాం’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment