సాక్షి, విజయవాడ: రుషికొండపై కట్టడాలు అక్రమమేమి కాదని, ప్రభుత్వ కట్టడాలు కడితే తప్పేంటి? అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు భ్రమలో ఉన్నాడు.. మైకం దిగినట్లు లేదు. టీడీపీ పని అయిపోయినట్లు ఇంకా గ్రహించినట్టు లేదు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘పవన్ గ్రాఫ్ తగ్గిపోయింది. విడిగా పోటీ చేసే దమ్ము లేదు.. కలిసి పోటీ చేయడానికి సిద్దపడుతున్నారంటే వైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించినట్టే. లోకేష్‌ది యువ గళం కాదు.. గందరగోళ యాత్ర. యువగళంలో బౌన్సర్లతో.. కిరాయి కూలీలతో చేసేది పాదయాత్ర అంటారా?. లోకేష్ పాదయాత్రకి 250 కోట్లు ఖర్చు పెట్టారని వారే చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ నేతలు భయపడుతున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు గతంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితాపై ఇంటింటి సర్వే చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా లోకేష్ సాధించేదేమిటి?. ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు ఇస్తామని లోకేష్ చెప్పడం దేనికి సంకేతం. ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవడానికే నాడు వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో ప్రజల కరెంట్ కష్టాలు చూసి ఉచిత విద్యుత్‌ని, ఆరోగ్యశ్రీని అమలు చేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు కాపీ కొట్టారు’’ అంటూ కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు.
చదవండి: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ
‘‘పిట్టలదొర మాటలని ప్రజలు నమ్మరు. చంద్రబాబు కొత్త అవతారం రాఖీ బాబా. మతి ఉండి చంద్రబాబు మాట్లాడుతున్నారా?. ఇలాంటి మానసిక స్ధితి ఉన్నవాళ్లని పిచ్చోళ్లగా చూస్తాం. పవన్ కళ్యాణ్ రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నారు. పెళ్లి ఒకరితో....సంసారం మరొకరితో అన్నట్టు పవన్ ఉన్నారు’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment