సాక్షి, అమరావతి: చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకున్నట్లే.. మూడు పార్టీలు కలిస్తే ఏదో అవుతుందని అని ప్రచారం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాళ్లు గతంలోనూ పొత్తు పెట్టుకున్నారు.. ఇందులో కొత్తేమీలేదు. రోజురోజుకు జనసేన గ్రాఫ్ పడిపోతుంది. అందుకే పవన్ కల్యాణ్.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు.
‘‘రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్టీ కమిటెడ్ లీడర్. పార్టీలో వివాదాలంటూ పచ్చ పార్టీ పేపర్‌లో తప్ప ఎక్కడా కనపడటం లేదు. ప్రతిపక్ష పార్టీలు పొత్తులు, ఎత్తులు, కుట్రలతో కాలక్షేపం చేస్తున్నాయి. 2024లో మళ్లీ మేం ఒంటరిగానే పోటీ చేస్తాం. తిరిగి అధికారంలోకి వస్తాం. జగన్‌ది ప్రజారంజక పాలన. ఏపీలో సంక్షేమపాలనపై అంతర్జాతీయ స్థాయి లో చర్చ జరుగుతుంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్
‘‘ప్రతిపక్ష పార్టీలు 2019 నుంచి వచ్చే ఎన్నికల కోసమే పని చేస్తున్నాయి. మేం ప్రజలు, భగవంతుడిని నమ్ముకున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుతిన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సర్వేల కోసం ఫీల్డ్ వలంటీర్లని ఉపయోగించుకుంటే తప్పేంటి’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment