సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుందని ఆరోపించారు. అలాగే, బుడమేరు మునగడానికి కారణం కూటమి నేతలు కాదా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు.
67వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చుపెట్టారు?.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్లు భారం మోపారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైఎస్సార్‌సీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది.
అమరావతికి కొత్త కళ అంటున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా?. బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారు.. అవి ఎవరికి ఖర్చుపెట్టారు?. బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లికేజ్ మొదలయ్యాయి. పోలవరంలో అవినీతి జరిగింది అనడానికి సిగ్గు ఉందా?. ప్రధాని మోదీనినే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీంఎంలా వాడుకున్నారని కామెంట్స్ చేశారు. ప్రధాని మాటలను కూటమి నేతలు మర్చిపోయారా?.
మొన్నటి వరకు అమరావతి, తిరుపతి లడ్డు, పోలవరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.. ఇప్పుడు కొత్తగా సీజ్ ది షిప్ అని మొదలుపెట్టారు. అక్కడ రెండు షిప్‌లు ఉంటే ఒక్కటే సీజ్ చేయడానికి కారణం ఏంటి?. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పోర్టుకి వెళ్తే నన్నే రానివ్వలేదు అనడానికి సిగ్గుపడాలి. తాడేపల్లిగూడెంలో మూడు లారీల పీడీఎస్ బియ్యం సీజ్ చేస్తే వాటిని ఎవరు వదిలేశారు?. రైతులకు ఇప్పటివరకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.. రైతులను ఆదుకోలేదు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. 30వేల మంది ఆడపిల్లలు కనిపించడంలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎంత మంది ఆడపిల్లలను కనిపెట్టారు?. తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్టణంలో ఐదు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. పోలవరం గట్లపై ఉన్న ఎర్ర కంకరను కూటమి నాయకులు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో రైతులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారు. ప్రజలను అన్ని విషయాల త్వరలోనే తెలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment