సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి వారిని హక్కుదారులను చేయాలని చూస్తే కోర్టులకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనాడు రామోజీరావు దుర్మార్గమైన వార్తలు రాస్తున్నాడని.. 50 ఏళ్ల సామ్రాజ్యం అనుకునే ఈనాడు తన సామ్రాజ్యాన్ని తానే కొల్లగొట్టుకుంటుందని దుయ్యబట్టారు.
జెండా సభకు జనం రాకపోతే అది కప్పిపుచ్చుకునేందుకే జెండా సభకు వచ్చిన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని విషపు రాతలు రాస్తున్నారు. సేవా భావంతో పనిచేసే వాలంటీర్లు పై దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు. వాలంటీర్ల వ్యవస్థ తీసేస్తే నష్టపోయేది ప్రజలే. చంద్రబాబు లాంటి తన్నే దున్నపోతు వెనుక ఎవరు వెళ్లే పరిస్థితి లేదు’’ అని మంత్రి అన్నారు.
చంద్రబాబు రాసిచ్చింది చదివే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ ఊగిపోతూ మాట్లాడుతున్నాడో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇటీవల కొంతమంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తున్నట్లు.. ఏ మాఫియా వీరికి ఏమేమి సప్లై చేస్తారో మాకు తెలియదు. పవన్ కల్యాణ్ ఉన్మాదంతోనే మాట్లాడారు. జెండా సభలో పవన్ మాట్లాడిన తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. 24 సీట్లు వల్ల కాపులకు ఒరిగేదేమీ లేదు. పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడు పోయాడని అనుకుంటున్నారు. పవన్ తీరు చూసి కాపులు సిగ్గుపడుతున్నారు. ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్న పరిస్థితి. పవన్‌పై కాపు సామాజిక వర్గానికి నమ్మకం పోయింది. పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment