
సాక్షి, అమరావతి: పవన్ ట్వీట్‌ల ద్వారానే ప్రజల్లో ఉన్నానని అనుకుంటాడని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షూటింగ్ గ్యాప్‌లో ట్వీట్లు చేస్తుంటాడు. పవన్‌కు రాజకీయ విలువలు లేవన్నారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయం. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్‌ను వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
చదవండి: ట్విట్టర్‌లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడకు రావాలి: జోగి రమేష్ సవాల్
ధార్మిక పరిషత్తు ద్వారా 5 ఆలయాలకు పాలక వర్గాలను నియమించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని మఠంలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఏ ఆలయంలో కూడా టిక్కెట్ ధరలు పెంచలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment