
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు లేదన్నారు. నారాసురుడు ఉన్నంత కాలం రాష్ట్రంలో అశాంతి ఉంటుందన్నారు.
కాగా, కొట్టు సత్యనారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం వచ్చి చంద్రబాబు అన్నీ అబద్దాలే చెప్పాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ప్లాన్ ప్రకారమే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని చంద్రబాబు రోజురోజుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. గుండాలను రప్పించుకుని అల్లర్లు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారాడని విమర్శలు చేశారు.