
సాక్షి, కాకినాడ: చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలేనని బాబు విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి బాబే కారణమని, అధికారం కోసం మళ్లీ కోతల రాయుడు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లేనని దుయ్యబట్టారు.
‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మళ్లీ కొత్త అబద్ధాల పుట్టతో తయారయ్యాడు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు. చంద్రబాబు తొలి సంతకానికే దిక్కులేదు. ఆయన తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని లేపేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం’ అని కన్నబాబు పేర్కొన్నారు.
బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
టీడీపీ మహానాడు అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మహానాడు అనే కంటే కులసభ అంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు హామీలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బాబూ కొడుకులకు అధికారం అనే పిచ్చి బాగా ఎక్కిపోయిందని.. బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు.
చదవండి: ‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’
Comments
Please login to add a commentAdd a comment