breaking news
Mahanadu
-
మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎంతకైనా తెగిస్తావా.. మహానాడుపై ఎన్టీఆర్ ఆత్మ ఘోష
-
ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్ వసీం చాంబర్లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి రాజేష్‌నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్‌నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం ఇచ్చారు.నేను మాట్లాడేది రికార్డు చెయ్..కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్‌నాయుడు ఫోన్లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా.. రాత్రి నుంచి ఫోన్‌చేసినా.. నీ క్లస్టర్ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్ రికార్డు చెయ్ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్‌కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మంచి సంస్కృతి కాదు..సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్‌నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శిరాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలి..టీడీపీ నేత రాజేష్‌నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్‌కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ -
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్‌ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్‌లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్‌కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
-
TDP మహానాడులో ఎన్టీఆర్ కు అవమానం
-
లోకేష్ కు జాకీలు.. పాటలతో బాబుకు డప్పులు
-
మహానాడులో తెలంగాణ ముచ్చట ఎందుకు?: జగదీష్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట: మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదం అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం. టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు?. 2004లోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 26వేలలోపే ఉంది. 2014 నుంచి ఆంధ్రలో చంద్రబాబు ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో 1.12 లక్షల తలసరి ఆదాయం ఉంటే.. కేసీఆర్ పాలనలో 3.70 లక్షలకు వచ్చింది. చంద్రబాబు.. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే.. ఏపీ ఆదాయం ఎందుకు పెరగడం లేదు?. ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదా?. ఎందుకు అభివృద్ధి చేయడం లేదు. ఎప్పటికైనా హైదరాబాద్‌కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను వాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా?. చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
మహానాడులో ఘోరం.. ఎన్టీఆర్‌కు తీవ్ర అవమానం
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింది. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!. ఆయన మనవడు చనిపోతే.. కనీసం వేదికపై సంతాపం కూడా వ్యక్తం చేయలేదు!!. కడప వేదికగా జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చంద్రబాబు చేయలేదు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను తయారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మనసుకు, ఆయన ఉన్నప్పటి స్టేట్మెంట్లకు విరుద్ధంగా చంద్రబాబు పొడిగించుకున్నారు. భళా మనవడా.. అంటూ ఎన్టీఆర్ వారసుడు లోకేష్ అంటూ ఏఐ వీడియోలో చెప్పించుకుని ఆనంద పడ్డారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమై.. ట్రోలింగ్‌కూ దారి తీసింది. రాజకీయావసరం పడినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటారనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసు. పలు సందర్భాల్లో కంటి తుడుపు చర్యగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పైకి మాట్లాడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగమైనప్పటికీ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ఇక, ఈ మహానాడుకు నందమూరి కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మహానాడుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా హాజరుకాలేదు(సినిమాలే ముఖ్యం అనుకున్నారేమో). అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నందమూరి తారకరత్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. తారకరత్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. -
కోవర్టులంటూ కొత్త కుట్ర రాజకీయం!
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు. మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్‌లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్‌తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్‌కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్‌లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ మహానాడు కార్యక్రమంలో కనిపించని ఎమ్మెల్యే బాలకృష్ణ, జూ ఎన్టీఆర్
-
చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు
సాక్షి ప్రతినిధి, కడప, అమరావతి: ఏడాదిలో చేసిందేమీ లేక... చెప్పుకోలేక ‘మహా’ తిప్పలు..! అంతా ఆత్మస్తుతి.. పరనింద..! వ్యవస్థాపకుడి కుటుంబాన్ని పక్కకునెట్టి.. సొంత కుమారుడిని ప్రమోట్ చేసుకునేందుకు సీఎం ఎత్తులు..! ఇదీ టీడీపీ మూడు రోజులపాటు కడపలో నిర్వహించిన మహానాడు తీరు. సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేక పోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా పాట్లు పడ్డారు. వాగ్దానాలను నెరవేర్చలేని వైఫల్యాన్ని మరుగున పడేసేలా ప్రత్యర్థిపై దూషణలతో దాడికి దిగారు. మరోవైపు మహా నాడును.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వారసులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. ఈ మహానాడులో బాలకృష్ణ కనిపించలేదు. దీంతో పూజించిన కేడర్ చేతులతోనే ఎన్టీఆర్‌ను ఛీ కొట్టించి ఆయన్నుంచి పార్టీని లాక్కున్న సీఎం చంద్రబాబు.. టీడీపీలో క్రమేపీ నందమూరి వంశానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నారా లోకేశ్ నాయకుడనేలా..మంత్రి నారా లోకేశ్‌ను పార్టీలో ప్రమోట్ చేసేందుకు నందమూరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు క్రమేపీ దూరం పెడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి దూసుకెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయనను కొనసాగిస్తే తనయుడు లోకే‹శ్ రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది అని చంద్రబాబు భావించారు. క్రమేపీ జూనియర్ ఎన్టీఆర్‌ను దూరంపెట్టారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణను ముందుపెట్టి వ్యవహారాన్ని చక్కబెట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ అవసరమూ తీరిందనే భావనతో తాజాగా మహానాడులో ఆయన కనిపించకుండా చేశారని అభిమానులు వాపోతున్నారు. టీడీపీ పూర్తిగా నారా వారిదేనని, ఎన్టీఆర్ వంశానిది కాదని కేడర్‌కు చెప్పేందుకే నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పరనిందలతో ఆత్మానందంకడప మహానాడులో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను అదే పనిగా దూషించడం, లేనిపోని నిందలు మోపి సంబరపడడానికే టీడీపీ నేతలు ఎక్కడ లేని ఉత్సాహం చూపారు. చంద్రబాబు, లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తడం, చేయని పనుల గురించి అభూత కల్పనలతో గొప్పగా చెప్పుకొంటూ చంద్రబాబు ఆయన పరివారం ఆత్మానందం పొందింది. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహించామంటూ ఊదరగొట్టడమే తప్ప కడప ప్రాంతానికి ఇన్నేళ్లలో ఏం చేశారో ఒక్కమాట చెప్పలేకపోయారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా ఏఐ వీడియో ప్రదర్శించడం బెడిసికొట్టింది. బాబు గురించి ఎన్టీఆర్ చివరి రోజుల్లో చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది.తీర్మానాలు పోయి శాసనాలు వచ్చె..సాధారణంగా మహానాడులో వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీ. ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలు అంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి బాబు తన తనయుడు లోకేశ్‌తో చెప్పించారు. ఈ శాసనాలేమిటని తమ్ముళ్లు బుర్రగోక్కుంటూ చర్చించుకున్నారు. కార్యకర్తలే బలం అన్న రోజే బలవన్మరణ యత్నంఆరు శాసనాల్లో గొప్పగా చెప్పినవాటిల్లో కార్యకర్తే అధినేత. కానీ, అదే రోజు కడపలో మహిళా కార్యకర్త తనకు పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. ఎమ్మెల్యే మాధవి తమను అణచివేస్తున్నారని ఆమె బలవన్మరణానికి సిద్ధమైంది. దీన్నిబట్టి టీడీపీలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అర్థం పర్థం లేని శాసనాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత పదికి పైగా తీర్మానాలు చేసినా వాటిలో పస లేకుండాపోయింది.వాటిని ఎందుకు చేశారో, ఉద్దేశం ఏమిటో కూడా చెప్పలేకపోయారు. చివరగా రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. గతంలో యనమల రామకృష్ణుడు ప్రతిపాదించేవారు. ఈసారి యనమల వేదిక మీద ఉన్నా.. రామ్మోహన్‌నాయుడుతో తీర్మానం చేయించి సీనియర్ల అవసరం లేదని స్పష్టం చేశారు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి భారీగా జనం వచ్చినట్టు చిత్రీకరించడం విమర్శలకు దారి తీసింది.టీడీపీ నేత ఫిర్యాదుతో 15 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసుముందుగా వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకుని.. ఆపై ఫిర్యాదు తెప్పించుకుని కేసులు నమోదు చేస్తున్న అపఖ్యాతిని పులివెందుల సబ్ డివిజన్ పోలీసులు మూటగట్టుకున్నారు. బుధవారం నమోదు చేసిన ఓ కేసులో వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల అదుపులో ఉండిపోయారు. కడపలో మహానాడు నిర్వహణను దృష్టిలో పెట్టుకుని టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. పులివెందులలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. వారి దురుద్దేశం, దుశ్చర్యలను గమనించిన వైఎస్సార్సీపీ నేతలు మున్సిపల్ కమిషనర్, సబ్ డివిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న టీడీపీ జెండాలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో కోరారు. కానీ, దీనిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ కేడర్ వాటిని తొలగించింది. ఈ చర్యలో ఎలాంటి గొడవ, ఘర్షణ చోటుచేసుకోలేదు. తర్వాత కూడా టీడీపీ వర్గీయులు వైఎస్సార్ విగ్రహాలకు జెండాలు, తోరణాలు కట్టి సవాళ్లు విసిరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్లో టీడీపీ నేతలను అదుపు చేయాల్సిన పోలీసు శాఖ వారికే వత్తాసు పలికింది. టీడీపీ నేతలు చెప్పగానే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పోలీసు ప్రతాపం చూపారు. అప్పటికీ ఎలాంటి ఫిర్యాదు లేకపోగా, టీడీపీ నేత అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి నుంచి ఓ ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేశారని సమాచారం. విజయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ స్టేషన్లో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్ హఫీజ్, మాజీ కౌన్సిలర్ వెంకటపతి తదితరులపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మంది బుధవారం రాత్రి నుంచి పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నారు. కోర్టులో హాజరుపరచకుండా గురువారం సాయంత్రం వరకు ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసు స్టేషన్లు మారుస్తూ వారిని కొడుతూ వచ్చారు. దీంతో పులివెందుల పోలీసులు.. పసుపు నేతలు ఎలా చెబితే అలా ఆడుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’
తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్‌దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్‌ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్ జగన్‌ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్‌లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్‌లో వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్‌ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్‌మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్‌లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్‌సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్‌ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్‌జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు. -
మహానాడు కాదు.. అది ‘వెన్నుపోటు’ నాడు: లక్ష్మీపార్వతి
వికారాబాద్: కడపలో మహానాడు పెట్టినంత మాత్రాన కడప ప్రజలంతా టీడీపీకే ఓట్లు వేస్తారని భ్రమ పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఇద్దరే.. మహానాడును భ్రస్తుపట్టించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఏం చేయాలో చర్చించాల్సి పోయి.. జగన్‌ను తిట్టడానికే సరిపోయింది’’ అంటూ లక్ష్మీపార్వతీ దుయ్యబట్టారు.‘‘టీడీపీ జెండాలు, కరపత్రాలు వాళ్లే తగలపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ అన్నారు తండ్రి.. కొడుకు ఇంకోటి అంటున్నారు. నాడు-నేడు పేరుతో వైఎస్ జగన్ స్కూళ్లను అభివృద్ధి చేస్తే.. మేమే చేశామని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. పనికిమాలిన రాజకీయానికి పరాకాష్ట ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీఆర్ వీళ్లను పొగిడినట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్.. చంద్రబాబును తిట్టిన క్యాసెట్లు ఎన్నో ఉన్నాయి. లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్‌కి వారసుడు అవుతారు’’ అంటూ లక్షీపార్వతి ప్రశ్నించారు.‘‘వైఎస్ జగన్ అన్ని రంగాల్లో పద్ధతి ప్రకారం ముందుకు తీసుకువెళ్లారు. కరోనాలో ప్రజలను ఆదుకున్న తీరు.. జగన్‌ను ప్రపంచమే మెచ్చుకుంది. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన పీడ. మహానాడు కాదు అది.. వెన్నుపోటు నాడు. మహానాడు అట్టర్ ఫ్లాప్. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద పరిశ్రమలు అడ్రస్ లేకుండా చేశారు. జిందాల్ కంపెనీ రాకుండా చేశారు. అవకాశం కోసం చంద్రబాబు, లోకేష్ పని చేస్తారు. ఎన్టీఆర్ ఆశయాన్ని మహానాడులో చెప్పలేదు.. కేవలం జగన్‌ను తిట్టడానికి పెట్టారు. మద్యం ద్వారా ఏపీలో కుటుంబాలను సర్వ నాశనం చేస్తున్నారు...అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికి మహానాడులో విరాళంగా తీసుకుంటున్నారు. స్కిల్ స్కాంలో ఇచ్చిన సొమ్ము పార్టీ ఫండ్‌గా తీసుకున్నారు. చంద్రబాబు చేసింది పెద్ద మోసం. చంద్రబాబు దగ్గరకు ఈడీ ఎందుకు రాదు?. ఎన్టీఆర్‌ను చంపింది చంద్రబాబు. ఎన్టీఆర్ పేరుతో మళ్లీ విరాళాలు వసూలు చేస్తున్నారు. రెండు ఎకరాల చంద్రబాబుకు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చింది?. ఎన్టీఆర్ ఆత్మను కూడా ఏఐ ద్వారా ఉపయోగించుకున్న తీరు బాధాకరం’’ అని లక్ష్మీపార్వతి అన్నారు. -
మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!
-
మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు
-
Big Question: మహానాడులో జగన్ జపం
-
బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్ సిక్స్ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్‌కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్‌లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహానాడు ఎఫెక్ట్.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు -
కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ ఆత్మహత్యాయత్నం
-
పదే పదే లోకేశ్ పాట!
సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్‌ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్‌ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్ సిక్స్ హామీల తరహాలో సూపర్ సిక్స్ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్ మ్యాప్ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు. లోకేశ్ కోసం డిమాండ్ల డ్రామా.. మరోవైపు.. లోకేశ్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుంటారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్ నాయకులతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వారిని లోకేశ్ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు. రామ్మోహన్‌తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్.. చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్‌తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.తేలిపోయిన తీర్మానాలు.. ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్కటి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమగ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మానాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమాటలు చెబుతూ నేతలు ప్రసంగించారు. -
మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్.. ఓ ఎమోషన్ -
డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి
సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టీడీపీ కేడర్‌లో అసంతృప్తి, ప్రజలకు ఏడాది కాలంలో ఏమీ చేయలేకపోవడం, సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా జనం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించేందుకు అల్టిమేటం జారీచేశారు. సభకు వస్తే ఉంటారు, లేకపోతే ఇబ్బందులు తప్పవనే తరహాలో బెదిరిస్తున్నారు. ఆబ్సెంట్ అయితే పనిష్మెంట్..అలాగే, రాయలసీమ జిల్లాలోని స్వయం సహాయక సభ్యులందరూ కచ్చితంగా పాల్గొనాలని పెట్టిన వాయిస్ మెసేజ్ కలకలం రేపుతోంది. ప్రతి గ్రూపులోనూ కనీసం ఏడుగురు వచ్చేలా చూసుకోవాలని డ్వాక్రా లీడర్లకు స్పష్టంగా చెప్పడంతో పాటు ఎవరైనా రాని పక్షంలో వారి స్థానంలో మరో మహిళను కూలీ ఇచ్చి తీసుకురావాలని అల్టిమేటం జారీచేశారు. అంతేకాదు.. మహానాడు చివరిరోజు నిర్వహిస్తున్న బహిరంగసభకు గైర్హాజరైతే కచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. డ్వాక్రా మహిళల మెడపై ఇలా కత్తిపెట్టి తరలిస్తుండటంపై అన్నిచోట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరు యానిమేటర్లకు ఒక బస్సు..డ్వాక్రా మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లకు అప్పగించారు. ఒక యానిమేటర్ పరిధిలో పదుల సంఖ్యలో గ్రూపులు ఉంటాయి కాబట్టి ఇద్దరు యానిమేటర్లకు కలిపి ఒక బస్సును కేటాయించి, అందులో మహిళలను తరలించేలా ప్రణాళిక రూపొందించారు. పెద్దఎత్తున మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లదేనని, ఎవరు ఇందులో ఫెయిలైనా తమ వారిని యానిమేటర్లుగా పెట్టుకుంటామని పార్టీ నేతలు ఇప్పటికే మౌఖికంగా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. పైగా.. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదన్న విషయంలో గ్రూపు సభ్యులు మహానాడు వద్ద సెల్ఫీ తీసుకుని పెట్టాలని చెప్పడంపై మహిళా సంఘాలు రగిలిపోతున్నాయి. -
మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం
సాక్షి,వైఎస్సార్: మహానాడు వేదికగా చంద్రబాబు వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ కార్యకర్తల హత్యల వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందుకే టీడీపీ నేతల హత్యలపై చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కోవర్టుల ముద్ర వేశారు.మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి హత్య జరిగాక అనుమానం వచ్చింది. మన దగ్గర ఉండి కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారు. కోవర్టులే హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ వాళ్లు వాళ్లనే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారు. కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించను. కోవర్టులను మన దగ్గరకు పంపించారు.కోవర్టుల ద్వారా అజెండాను నెరవేర్చాలంటే ఒప్పుకోను. వలస పక్షులు వస్తాయి.. పోతాయి. నిజమైన కార్యకర్తే శాశ్వతంగా ఉంటాడు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అంటూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైఎస్ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైఎస్సార్ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైఎస్ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైఎస్సార్. వైఎస్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైఎస్సార్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైఎస్ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు. -
కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...
-
కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన
-
మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)
-
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు... చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన -
మహానాడుపై బాబుకు టీడీపీ మహిళా నేత లేఖ.. ఆవేదనతో టవర్ ఎక్కి..
సాక్షి, వైఎస్సార్: మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అనంతరం, సెల్ టవర్ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో, భారీగా పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.మహానాడు సందర్బంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20ఏళ్లుగా పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు, ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. మహానాడుకు తన లాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ లాంటి పార్టీ కార్యకర్తలను చంద్రబాబు, లోకేశ్ వరకూ రాకుండా మాధవీ రెడ్డి కోటరీ అడ్డుకుంటోందని ఆరోపణ చేశారు. నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ మనుగడే కష్టమన్నారు. తన లాంటి కార్యకర్తల గోడు మీకు తెలియాలనే ఆత్మహత్యకు పూనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం, కడపలో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ సెల్ టవర్ వద్దకు వెళ్లి.. టవర్ ఎక్కారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ నేత ఇలాంటి చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోపై గుసగుసలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను కొందరు సోషల్ పోస్ట్ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా! -
పవన్ కథ అడ్డం తిరిగింది.. మహానాడులో మాయమాటలు
-
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్ ఘోరంగా అట్టర్ ప్లాప్ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా.. -
మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!
-
సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం
-
ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్
-
అవే గొప్పలు.. అదే విద్వేషం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిందేమీ లేకపోవడంతో సీఎం చంద్రబాబు.. ప్రగల్భాలు, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై విషం కక్కడానికే సమయమంతా వెచ్చించారు. మహానాడు తొలి రోజు అంతా ఆత్మస్తుతి.. పరనిందగా సాగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడుగడుగునా విద్వేష రాజకీయాల్లో మునిగి తేలుతున్న తెలుగుదేశం పార్టీ.. కడప వేదికగా నిర్వహిస్తున్న మహానాడులోనూ అదే పంథాను కొనసాగించింది. సూపర్ సిక్స్ హామీలు సహా గత ఎన్నికలప్పుడు ఇచ్చిన వందలాది హామీల్లో ఒక్క దాన్ని అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుండడంతో దాన్ని కప్పిపుచ్చేందుకు ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని లేనివి ఉన్నట్లు మహానాడులో చిత్రీకరించారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం తన గొప్పలు, జగన్ పాలనపై విషం కక్కడానికే సరిపోయింది. సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచి ఇప్పుడు సూపర్ సిక్స్ శాసనాలంటూ వాటి పేర్లనే మార్చి.. ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్‌తో చెప్పించారు. గత హామీల తీరులో ఈ సూపర్ సిక్స్ శాసనాల ద్వారా యువత, మహిళలు, పేదలు, ఇతర వర్గాలన్నింటినీ పైకి తీసుకువస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేని పరిస్థితుల్లో ఈ కొత్త శాసనాలేంటని టీడీపీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు, విధానాలు, కార్యక్రమాలు రూపొందించడం ఆనవాయితీ. అయితే చంద్రబాబు సారథ్యంలో లోకేశ్ శాసనాలంటూ సరికొత్త పద ప్రయోగంతో ముందుకు రావడం మరోమారు జనాన్ని మభ్యపెట్టి, మాయ చేయడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనం అంటే ఎవరిని శాసిస్తారు.. ఏమని శాసిస్తారోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వం అంటూ అదే పనిగా విషంచంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలంతా గత ప్రభు త్వం, జగన్ ప్రభుత్వం అంటూ మహానాడులోనూ జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడేదో జరిగిపోయిందని చెప్పడం ద్వారా ప్రజల్ని తన పాలన గురించి ఆలోచించకుండా చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో వ్యూహమని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా ఇంకా గత ప్రభుత్వం లెక్కలు తీస్తున్నామని, ఇంకా కొత్త విచారణలు జరపాల్సివస్తుందేమోనని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఇక రాష్ట్రానికి తాను చేసేదేమీ లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడం, వారిని అన్యాయంగా కేసుల్లో ఇరికించి చిత్రహింసలు పెట్టడానికే కుతంత్రాలు పన్నుతున్నట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల మనసుల్లో విద్వేషం నింపి వారిని పగతో రగిలేలా చేయడం కోసమే గత ప్రభుత్వంపై అభాండాలు మోపడాన్ని చంద్రబాబు ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకుని దాన్ని మహానాడులోనూ కొనసాగించారు. ఇందులో భాగంగా తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో ప్రసంగించడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఏడాదిలో ఎన్నో విజయాలు సాధించామని సీఎం ఎలా చెబుతారని ప్రజలు మండిపడుతున్నారు.తండ్రీ కొడుకులపై పొగడ్తలు ఎన్టీఆర్ హయాంలో సంస్కరణలు అమలు చేశామని, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీని అభివృద్ధి చేశామని, 2014–19లో ఇరగదీశామని ఇంకా పాత కథలు చెప్పుకోవడానికే చంద్రబాబు సహా నేతలంతా ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు పార్టీ నేతలంతా చంద్రబాబును, ఆయన కొడుకు, మంత్రి లోకేశ్‌ను పొగడటానికే పోటీపడ్డారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలతో ముంచెత్తారు. చాలా మంది నేతలు భూ ప్రపంచంలో చంద్రబాబు, లోకేశ్ అంత గొప్ప వారు ఎవరూ లేరన్న రీతిలో కీర్తించారు.‘మహా’కష్టాలు» నేలకూలిన కటౌట్లు.. పరుగులు తీసిన కార్యకర్తలు» మధ్యాహ్న భోజనాల దగ్గర తోపులాట » పార్టీ శ్రేణులు లేక బోసిపోయిన ప్రాంగణం » నిర్వాహకులపై బాబు సీరియస్ » మీడియాపై లోకేశ్ ఆంక్షలు సాక్షి ప్రతినిధి, కడప/కడప రూరల్: తెలుగుదేశం పార్టీ మహానాడు టీడీపీ కార్యకర్తలకు మహా కష్టాలు తెచ్చిపెట్టింది. మహానాడు సందర్భంగా ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు గాలికి నేలకొరిగాయి. దీంతో చాలా మంది తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. కటౌట్లు పడటంతో పార్కింగ్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కటౌట్ల కారణంగా ఇప్పటికే ఇద్దరు వీఆర్వోలు గాయపడిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన చోట తోపులాట జరిగింది. కొంత మంది ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప నగరంలోకి వెళ్లి ఆకలి తీర్చుకున్నారు. ‘ఏమి ఏర్పాట్లో.. ఏమి కమిటీలో.. కనిపిస్తూనే ఉంది’ అని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. కాగా, మధ్యాహ్నం భోజన సమయానికి మహానాడు ప్రాంగణం సగం ఖాళీ కాగా, సాయంత్రానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో చంద్రబాబు నిర్వాహకులపై సీరియస్ అయినట్లు సమాచారం. చివరగా మాట్లాడిన చంద్రబాబు.. చివరి వరకూ ఉండాలని, దీనిని బుధవారం నుంచైనా పాటించాలని కోరడం గమనార్హం. మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం ఇచ్చారు. లోకేశ్ అక్కడికి రాగానే.. కెమెరాలు ఆఫ్ చేయాలంటూ ఆదేశించారు. ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే లాక్కొవాలంటూ పోలీసులకు సూచించారు. ఫొటోలు కూడా తీయనివ్వలేదు. మంత్రి లోకేశ్ మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్‌చాట్ నిర్వహించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మహానాడు పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ అధికారులకు డ్యూటీలు వేశారు. జిల్లా సర్వోన్నతాధికారి డ్యూటీ పాస్‌లు ఇచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు ఎల్లో ట్యాగు తగలించుకొని కనిపించారు. కాగా, మహానాడుకు ముందే కరోనా పాజిటివ్ కేసులు రిమ్స్‌లో నమోదు అయితే, అబ్బే అలాంటిదేమీ లేదని జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. -
ఏం సాధించారని ..మహానాడు సంబరాలు ?
-
మహానాడు పనుల్లో అధికారులే పని వాళ్లు
-
‘మహానాడు’ ప్రాంగణంలో కూలిన కటౌట్లు
కడప అర్బన్: కడప నగర శివార్లలోని పబ్బాపురంలో మంగళవారం నుంచి జరిగే టీడీపీ ‘మహానాడు’ ప్రాంగణంలో కటౌట్లు కూలడంతో ఇద్దరు వీఆర్వోలు తీవ్రంగా గాయపడ్డారు. మహానాడు కోసం రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం అట్లూరు మండలంలో వీఆర్వోలుగా పనిచేస్తున్న శీలి దొరబాబు, సుబ్బన్న మహానాడు ప్రాంగణంలోకి మోటార్‌సైకిల్‌పై వస్తుండగా భారీ కటౌట్లు కూలి వారిపై పడ్డాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సహచర ఉద్యోగులు, పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. -
‘మహా’ డ్రామాలో అధికారులు, ఉద్యోగులే సమిధలు
సాక్షి, అమరావతి: టీడీపీ మహానాడు కోసం అధికార యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోని అధికారులతోపాటు వైఎస్సార్ జిల్లా ఉద్యోగులను వారం రోజులుగా పూర్తిగా ఈ కార్యక్రమానికే ఉపయోగించుకుంటున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడును ఆర్భాటంగా నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అన్ని పనులు చేయించుకుంటున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ముఖ్య నేతలు, శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వారి కోసం కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఓలు, సర్వేయర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కో ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు ఉద్యోగులు మూడు రోజులపాటు ఉంటూ అవసరమైన సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇదే పనిలో నిమగ్నమై ఉంది. ఈ కార్యక్రమం కోసం మంత్రులు, ముఖ్యనేతలు పది రోజులుగా అక్కడే తిరుగుతుండటంతో అధికారులకు వేరే పని లేకుండాపోయింది. 18 తీర్మానాలు ఈ మహానాడులో 18 తీర్మానాలు చేయనున్నారు. ఏడాదిలో ప్రభుత్వ విజయాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అమరావతి నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, చంద్రన్న విజన్‌తో సంక్షేమ రాజ్యం, ప్రజాపాలనపై వైఎస్సార్సీపీ విష ప్రచారం వంటి తీర్మానాలు అందులో ఉన్నాయి. 18 తీర్మానాల్లో 14 ఏపీకి సంబంధించినవి కాగా.. 4 తెలంగాణవి పెడుతున్నారు. తొలి రోజు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ ఇచ్చి రెండో రోజు ఎన్నుకోనున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా చంద్రబాబును లాంఛనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. మూడవ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహిస్తారు. -
ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు?
తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడంతోపాటు అంతకంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తానంటూ ప్రతి ఎన్నికల సభలోనూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. అన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. హామీలను ఎగ్గొట్టి.. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెడ్‌బుక్ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.ఇసుక,గనులు,మద్యం దాకా ఎల్లో సిండికేట్ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. టీడీపీ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వైఎస్ జగన్ నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకున్నారనే చర్చ గ్రామ గ్రామాన జరుగుతోంది. - సాక్షి, అమరావతి ఇది రద్దుల ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలను టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదలు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచించింది. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి తమ సన్నిహితులు, బినావీులకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు.నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. 2023–24లోనే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని.. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ అందచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.ఆడబిడ్డ నిధి కింద 19 – 59 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈమేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి నమ్మించారు. సూపర్ సిక్స్‌తోపాటు మొత్తం 143 హామీలను టీడీపీ–జనసేన కూటమి ఇచ్చింది. వాటి అమలు బాధ్యత తనదేనంటూ పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి మోసాలుగా మిగిలాయి. జాబ్ క్యాలెండర్ హుష్‌కాకి..వైఎస్సార్సీపీ హయాంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చారు. 2019–24 మధ్య శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఎంఎస్ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా జాబ్ కేలండర్ ఊసే లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు.సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయించి గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ దాదాపు 1,000 పోస్టుల భర్తీకి అనుమతించినా కూటమి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డీఎస్సీ పేరుతో ఏడాదిగా డ్రామాలాడి విచిత్ర నిబంధనలతో అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని పరీక్షకు దూరం చేశారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని, భూములకు రక్షణ లేదని, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే క్రమంలో దేశంలోనే మొదటిసారిగా భూముల రీ సర్వే నిర్వహించింది. భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు.ఎడాపెడా అప్పులు.. రెడ్‌బుక్ టెర్రర్వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని చెప్పించారు. గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు.కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ఫ్రచారం చేసూ్తనే వచ్చారు. నిజానికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7,21,918 కోట్లే. ఇందులో విభజన జరిగే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు రూ.1,47,717 కోట్లు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లకు చేరుకుంది. అంటే 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగాయి (సీఏజీఆర్).వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు. అంటే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా సగటున 13.57 శాతం మాత్రమే అప్పులు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.1,37,546 కోట్లు అప్పు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 41 శాతాన్ని చంద్రబాబు కూటమి సర్కార్ ఒక్క ఏడాదిలోనే చేసింది. డైవర్షన్ పాలిటిక్స్..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ఎగవేత.. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేథాన్ని దేశానికి చాటిచెప్పేందుకు గతేడాది జూలై 24న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారు.విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కారు వైఫల్యంతో 50 మందికిపైగా బలయ్యారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టారంటూ దారుణమైన అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేశారు. తన వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సెప్టెంబరు 18న సీఎం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. మాఫియా రాజ్యం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. ఉచితం ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది.గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పని చేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినావీులకు దోచిపెడుతున్నారు. ఊరూపేరూ లేని ఉర్సాకు 99 పైసలకే ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని విశాఖలో కట్టబెడుతున్నారు. లూలూ మాల్ పేరుతో విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూదోపిడీకి పరాకాష్ట.దుష్ప్రచార కుట్రలు బట్టబయలు..ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి 2.60 లక్షల మందిని నియమించారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే ఇంటివద్దే పెన్షన్ల నుంచి అన్ని రకాల పౌర సేవలను వలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి సమయంలో వలంటీర్ల సేవల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మారు. వలంటీర్ల ద్వారా 33 వేల మంది మహిళలను మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరాధార ఆరోపణలు చేశారు. అయితే 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో వెల్లడించడం గమనార్హం.చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ 'బూటు' దెబ్బప్రశ్నించే గొంతులు నొక్కుతూ..చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 390 మంది హత్యలకు గురయ్యారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి 500 మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. జర్నలిస్టులపై 63 అక్రమ కేసులు బనాయించి 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి ఇద్దరిని జైలుపాలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాంగత ప్రభుత్వంతో పోల్చితే కూటమి సర్కారు పాలన ఏం బాలేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. చేయడానికి పనులు దొరకడం లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అది ఆచరణలో ఎక్కడా అమలు జరగడం లేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ వచి్చంది. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటి వరకూ ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇకపై వచ్చే నాలుగేళ్లలో ఇస్తుందనే నమ్మకం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. – బయ్యే నాగవిజయబాబు, శెట్టిపేట, తూర్పు గోదావరి జిల్లాకూటమి సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుతో పాటు శెట్టిపేట, తాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, కృష్ణాపురం, కొమ్ముగూడెం తదితర చోట్ల వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు ఇలా..⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జ్యోతి కాలనీలో నివసించే దిద్దే ఆనంద్‌కుమార్ భవన నిర్మాణ కార్మికుడు. విధి వక్రీకరించి ఆర్నెల్ల క్రితం పక్షవాతం బారిన పడటంతో రెండు కాళ్లూ పనిచేయడం లేదు. వికలాంగ పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఏడాదిగా ఇలా ఎంతో మంది పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటున్న సీలి విజయకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా రుణం ఇవ్వడం లేదని, కనీసం డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదనగా చెబుతోంది. వలంటీర్‌గా పనిచేసే తన కోడలిని తొలగించారని, మనవళ్లకు అమ్మ ఒడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాదిలో ఏమీ చేయని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో చేస్తుందని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న ఈ రైతు పేరు యాతం రామాంజనేయులు. పంట కోత దశకు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తడి అందక పంట ఎండిపోయింది. కౌలుకి తీసుకున్న మూడెకరాలకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున కట్టాలి. గతంలో రైతు భరోసా వచ్చేదని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు పైసా కూడా ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.⇒ ‘గత ప్రభుత్వంలో నాకు చేయూత ఇచ్చేవారు. నా భర్తకు పింఛన్ వచ్చేది. నా కోడలికి అమ్మ ఒడి అందేది. నా మనవళ్లకు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇచ్చి మంచి భోజనం పెట్టేవారు. కరోనా సమయంలో వలంటీర్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలిచ్చింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు, ఒకటి ఇచ్చేశామంటున్నారు. కానీ నాకుగానీ, నా కోడలికిగానీ రాలేదు. మేమే కాదు మా ఊరిలో అందరం ఇలాగే బాధపడుతున్నాం. జగన్ ఉన్నప్పుడు రూ.10 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.’ – మణెమ్మ, తాళ్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా. -
టీడీపీ మహానాడు ప్రాంగణంలో అపశ్రుతి
-
కరోనా వచ్చినా.. I Don't Care.. నా సభే ముఖ్యం..!
-
మాయా వేదికపై ‘మహా’ డ్రామా!
సాక్షి, అమరావతి: కడప మహానాడు వేదికగా మరో కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతు న్నారు. 2023లో రాజమండ్రి మహానాడులో ప్రజలను మోసం చేసే మహా ప్రణాళికను ప్రకటించారు. ఇప్పుడు కడప మహానాడులోనూ అదే తరహాలో మరో కొత్త ప్రణాళిక విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి తన కుమారుడు లోకేశ్‌ను అందలం ఎక్కించే వేదికగా మహానాడును ఉపయోగించుకోవడానికి పకడ్బందీ వ్యూహ రచన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించిన చంద్రబాబు.. మళ్లీ అదే తరహాలో తన కుమారుడి ద్వారా సూపర్ సిక్స్ విధానాలంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తి పరిచేందుకు కొత్త పల్లవిని వల్లె వేయించనున్నట్లు తెలుస్తోంది. ‘పేదరిక నిర్మూలన, స్త్రీ శక్తి, కార్యకర్తే అధినేత, అన్నదాతకు అండ, ఉన్నత స్థాయికి తెలుగు యువత, తెలుగు జాతి ఖ్యాతి’ పేర్లతో వాటిని రూపొందించినట్లు తెలిసింది. ఈ ఆరు విధానాలను పార్టీ కార్యకర్తల కోసం అమలు చేస్తామని మహానాడు వేదికపై ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ‘సూపర్’ మోసం2023లో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల తరహాలోనే మహానాడులో సూపర్ సిక్స్ విధానాల పేరుతో మాయ చేసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు పేర్లతో వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తూ ఇప్పుడు కొత్తగా సూపర్ సిక్స్ విధానాలంటే ఎవరు నమ్ముతారని టీడీపీ నేతకులే వ్యాఖ్యానిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలైన మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ తాగునీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్..లలో ఒక్క పథకమూ అమలుకు నోచుకోలేదు. మహిళలకు ప్రతి నెలా రూ.1500, తల్లికి వందనం పేరుతో బడికెళ్లే పిల్లలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలంటూ చెప్పినా దేన్నీ ఇవ్వలేదు. రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆరి్థక సాయం చేస్తామని పట్టించుకోలేదు. నిరుద్యోగులకు రూ.20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇవేమీ అమలు కాలేదు.ప్రజల్లో ఆగ్రహం.. అందుకే ఆర్భాటం» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఒక్క సంక్షేమ పథకం అందక పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. దీంతో వాళ్లను ఏదో ఒక రకంగా మాయ చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో చేసేసినట్లు, ఏడాదిలో అనేక విజయాలు నమోదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.» ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ సిక్స్ విధానాలను తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డబ్బులు లేవని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఏమీ ఇవ్వలేననే విషయాన్ని చంద్రబాబు నెమ్మదిగా చెప్పారు. బయట నుంచి చూసి అన్నీ చేయగలననుకుని హామీలు ఇచ్చానని, ఇప్పుడు ఎలా చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు. » దీన్నిబట్టి హామీలపై చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మహానాడులో తమ వైఫల్యాలు, హామీల అమలు ఊసే లేకుండా మాయ చేసేందుకు టీడీపీ పరివారం నిమగ్నమైంది. ఎల్లలు లేని ప్రచారం, సోషల్ మీడియాలో బజ్ సృష్టించి లబ్ధి పొందడంపైనే దృష్టి కేంద్రీకరించారు.» వైఎస్ జగన్ ఇస్తున్న పథకాల కంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి.. ఆచరణలో ఏమీ చేయక పోవడంతో తాము చంద్రబాబు చేతిలో మరోమారు మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ మోసాలకు ఎల్లో మీడియా వంత పాడుతుంటే కనుక్కోలేని వెర్రి వాళ్లమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికే మరోసారి మాయా వేదిక సిద్ధమైంది. -
మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు
-
పచ్చ దండుకు కరోనా టెన్షన్
సాక్షి,వైఎస్సార్ జిల్లా: ఏపీలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. నమోదవుతున్న కోవిడ్-19 కేసులతో కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. అందుకే కోవిడ్-19 కేసుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, వైఎస్సార్ జిల్లాలో కరోనా కేసు నమోదైంది. ఆ కేసును దాచిపెట్టేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై కడప డీహెచ్ఎంవో నాగరాజు స్పందించారు. కడప జిల్లాలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది’ అని అన్నారు. కానీ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళకు కరోనా సోకినట్లు రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి తెలిపారు. బాధిత మహిళకు వైద్యం చేస్తున్న అధికారులు కరోనా పాజిటివ్ అంటుంటే డీఎంహెచ్ఓ కాదని చెప్పడంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే? ఈ నెల (మే) 27 నుంచి కడపలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో పచ్చ నేతల్లో ఆందోళన మొదలైంది. కోవిడ్ అంటే మహానాడుకు ఎవరూ రారనే భయంతో కేసులే నమోదు కాలేదని వైద్యాదికారులతో చెప్పిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధిత మహిళకు చికిత్స చేస్తున్న రిమ్స్ సూపరింటెండెంట్ కోవిడ్ నిర్దారణ అయిందని స్పష్టం చేయడం.. జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడమే అందుకు నిదర్శనమంటూ ప్రజలు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్
-
టీడీపీలో లుకలుకలు.. మంత్రిపై సీనియర్ నేత బహిరంగ విమర్శలు
సాక్షి, కర్నూలు: టీడీపీ నిర్వహిస్తున్న మినీ మహానాడులో పచ్చనేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. గురువారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన టీడీపీ మినీ మహా నాడులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఈ ప్రభాకర్ ఫైరయ్యారు. కర్నూలు జిల్లా మినీ మహా నాడు కార్యక్రమంలో సభను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్‌పై విమర్శలు గుప్పించారు. మహా నాడు సభకు కూడా హాజరు కాలేనంత బిజీ బిజీగా మంత్రి టీజీ భరత్ ఉన్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదు , కార్యకర్తలకు న్యాయం జరగాలి లేదంటే నేను ఊరు కోను ముఖ్యమంత్రే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని ఎందుకు దక్కించులేదనే ప్రశ్నకు మంత్రి దగ్గరే సమాధానం లేదని చురకలంటించారు. ఒకటి, రెండు నెలలు చూసి పార్టీ బలోపేతానికి తాను రంగంలోకి దిగుతాను అంటూ కేఈ ప్రభాకర్ హెచ్చరించారు. -
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
సాక్షి,పాయకరావుపేట: టీడీపీ మినీ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో టీడీపీ తలపెట్టిన మిని మహానాడు పాయకరావు పేట నియోజకవర్గంలో జనం లేక వెలవెలబోయింది.గురువారం పాయకరావుపేటలో టీడీపీ మినీ మహానాడును నిర్వహించింది. ఇందుకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలు సైతం హాజరయ్యారు.అయితే, మినీమహానాడు ప్రారంభమైన అరగంటకే సభకు వచ్చిన శ్రేణులు మధ్యలోనే వెళ్లిపోవడంతో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. టీడీపీ నేతలు మాట్లాడుతుండగా.. కార్యకర్తలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. సభను వదిలి వెళుతున్న జనాలకు నచ్చచెప్పి కూర్చేబెట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసుల మాటల్ని పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు కంగుతిన్నారు. -
మహానాడులో చంద్రబాబు ప్రకటన!
-
Actor Vijay: మతతత్వ, అవినీతి శక్తులే... మా శత్రువులు
సాక్షి, చెన్నై: కేంద్రంలో, తమిళనాట అధికార పార్టీలైన బీజేపీ, డీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’’ అని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఆయన 8 నెలల క్రితం సొంత పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే. టీవీకే తొలి మహానాడు విల్లుపురం జిల్లా వీ సాలై గ్రామంలో ఆదివారం జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు అసంఖ్యాకంగా పోటెత్తారు. ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్, కర్మ యోగి కామరాజ్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారు’’ అని అన్నారు. ‘‘నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీ యాలు చేస్తా’’ అని చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆరే స్ఫూర్తి తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయంగా చరిత్ర సృష్టించారని విజయ్ గుర్తు చేశారు. ‘‘ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తాం. శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా’’. అన్నారు. నీట్ పరీక్ష విధానాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో ‘నీట్’ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందన్నారు.అశేష జనవాహిని మహానాడుకు నిర్వాహకులే ఊహించని రీతిలో జనసందోహం పోటెత్తింది. సభ సాయంత్రం నాలుగింటికి కాగా ఉదయం నుంచే వేలాదిగా అభిమానుల రాక మొదలైంది. దాంతో సభను ముందుగానే ప్రారంభించారు. రాత్రి ఏడింటికి సభ ముగిసినా రాత్రి 9 దాకా జనం వస్తూనే ఉన్నారు. దాంతో చెన్నై–తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింంది. -
పక్క పార్టీల పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు..!
-
మహానాడు వేదికగా కళాకు చంద్రబాబు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు పెద్ద ఝలక్కే తగిలింది. స్థానిక నియోజకవర్గంలోనే కాదు అధిష్టానం వద్ద కూడా ఆయనకు విలువ లేదని తేలిపోయింది. కళా తన మాట నెగ్గించుకోవడానికి చేసిన యత్నాలు ఫలించలేదా? కళా వెంకటరావు మాటలను అధిష్టానం పెడచెవిన పెట్టిందా? ఆయన వైఖరిని తేలికగా తీసుకుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఎదుగుతున్న కలిశెట్టి అప్పలనాయుడును తొక్కి పెట్టాలని, పార్టీలో ఆయనకు ఎలాంటి స్థానం లేదని, నియోజకవర్గంలో అంతా తానేనని కిమిడి కళా వెంకటరావు చూపించిన దూకుడుకు అధిష్టానమే చెక్ పెట్టింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తన ప్రాబల్యానికి అడ్డు తగులుతున్నారని, చాపకింద నీరులా తనకు పోటీ గా తయారవుతున్నారని, అడుగడుగునా తన హవాను తగ్గించడమే కాకుండా టీడీపీ కేడర్‌ను తనవైపు లాక్కుంటారన్న ఉద్దేశంతో కలిశెట్టి అప్పలనాయుడుపై కిమిడి కళా వెంకటరావు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కలిశెట్టిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. చివరికి కలిశెట్టి అప్పలనాయుడ్ని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ జిల్లా నాయకత్వం నుంచి ప్రకటన కూడా జారీ చేయించారు. అయితే కలిశెట్టి మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను సస్పెండ్ చేసినప్పటికీ ఆ ప్రకటన చెల్లదంటూ పార్టీ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నా రు. నియోజకవర్గ టీడీపీలో కళాకు దీటుగా ముందుకెళ్తున్నారు. చెప్పాలంటే కళా కంటే తన వెంటే కేడర్ ఉండేలా కలిశెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అయితే కళా వెంకటరావు తన రాజకీయ చాతుర్యంతో కలిశెట్టి అప్పలనాయుడుకు పార్టీ కార్యక్రమాల్లో గౌర వం లేకుండా చేస్తున్నారు. పార్టీ నిర్వహించే సభలు, సమావేశాల్లో కలిశెట్టిని దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన పార్టీ మినీ మహా నాడులో కలిశెట్టిని వేదికపైకి రానివ్వలేదు సరికదా నోటికొచ్చినట్టు మండిపడ్డారు. పార్టీ నుంచి సస్పెండైన వ్యక్తిని ఎలా వేదికపైకి పిలుస్తారని.. ఆహ్వానం పలికిన కనకల మురళీమోహన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పార్టీలో కళా చెప్పినదే వేదమన్నట్టుగా మినీ మహానాడు సాగింది. ఎందు‘కళా’.. జిల్లా స్థాయిలో తన హవా చూపించిన కళా వెంకటరావు...రాజమహేంద్రవరంలో రాష్ట్ర పార్టీ నిర్వహించిన మహానాడులో చూపించలేకపోయారు. తనకు ప్రత్యర్థి, పార్టీ నాయకత్వంతో సస్పెన్షన్‌కు గురైన కలిశెట్టి అప్పలనాయుడును మాత్రం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకున్నారు. ఒకచోట కూర్చొని కలిశెట్టితో మాట్లాడారు. హోటల్లో ఏర్పాటు చేసిన విందులో కలిశెట్టిని చంద్రబాబు ఏకంగా సత్కరించారు. దీంతో ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సందేహంలో పడ్డాయి. సస్పెండ్ చేసిన వ్యక్తిని మినీ మహానాడుకు పిలవడమేంటని కళా అడ్డుకుంటే.. అదే వ్యక్తిని ఏకంగా అధినేత చంద్రబాబు సత్కరించడం చూస్తే టీడీపీలో సస్పెన్షన్ ప్రకటనకు విలువ లేదా? లేదంటే కళా వెంకటరావు ప్రాబల్యాన్ని తగ్గించాలని చేసే ఎత్తుగడా? అన్న చర్చ మొదలైంది. అక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే కళా రాజకీయ వ్యూహాలు, అనుసరిస్తున్న వైఖరి, జారీ చేస్తున్న హకుంను చంద్రబాబు పట్టించుకోకుండా కలిశెట్టిని సత్కరించారనే అభిప్రాయాన్ని టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో టీడీపీలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం వ్యూహమేంటో తెలియడం లేదని, తాము ఎవరివైపు ఉండాలో తెలియని సందిగ్ధం నెలకొందని, చివరికీ పార్టీ ఎవరికీ పెద్ద పీట వేస్తుందో అంతు చిక్కడం లేదని, అంతవరకు తాము ఎవరి వెంట తిరగాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎచ్చెర్ల టీడీపీ శ్రేణులు అంతర్మధనంలో పడ్డాయి. -
ఆ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ లా చింపి పారేశారు
-
చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, మోసాలేనని బాబు విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి బాబే కారణమని, అధికారం కోసం మళ్లీ కోతల రాయుడు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లేనని దుయ్యబట్టారు. ‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. మళ్లీ కొత్త అబద్ధాల పుట్టతో తయారయ్యాడు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారు. చంద్రబాబు తొలి సంతకానికే దిక్కులేదు. ఆయన తప్పుడు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వెంటిలేటర్‌పై ఉన్న టీడీపీని లేపేందుకే ఎల్లో మీడియా ప్రయత్నం’ అని కన్నబాబు పేర్కొన్నారు. బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి టీడీపీ మహానాడు అట్టర్‌ఫ్లాప్ అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు. మహానాడు అనే కంటే కులసభ అంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. చంద్రబాబు హామీలు పిట్టల దొర మాటల్లా ఉన్నాయని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. బాబూ కొడుకులకు అధికారం అనే పిచ్చి బాగా ఎక్కిపోయిందని.. బాబు, లోకేష్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. చదవండి: ‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’ -
మహానాడు వేళ టీడీపీకి గుడ్‌బై
కోనసీమ: రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు జరుగుతున్న సమయంలో కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు వందమంది కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వెనుకబడిన వర్గాల(బీసీ)కు చెందిన వీరు వైఎస్సార్ సీపీ తీర్థం తీసుకున్నారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని చినగూళ్లపాలెం గ్రామం నుంచి కేతా శ్రీను ఆధ్వర్యంలో, కొత్తపాలెం కాలనీ నుంచి రాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోపాలపురం తరలివెళ్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులం కావడంతో పాటు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పలు సమస్యలు పరిష్కరించడం, అనారోగ్య బాధితుల పట్ల స్పందిస్తున్న తీరు తమకు నచ్చి వైఎస్సార్ సీపీలో చేరామన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ మీరు ఏ నమ్మకంతో వచ్చారో అందుకు అనుగుణంగానే పనిచేస్తానని అన్నారు. కొత్తపేట పీఏసీఎస్ పర్సన్ దంగేటి సుబ్రహ్మణ్యం (డీఎస్), పంచాయతీ సభ్యుడు బొక్కా లోకేష్, పార్టీ బీసీ విభాగం నాయకులు రాయుడు కృష్ణ పాల్గొన్నారు. -
బాలకృష్ణ, లోకేష్, బాబుపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబును పొగిడించుకుంటున్నారని విమర్శలు చేశారు నాని. కాగా, కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్ బొమ్మ ఎలా పెడతారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా. ప్రశ్నిస్తానంటూ జనసేన పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు ఓటేయించారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీలు చంద్రబాబు నిర్వహించలేదు. అదే వైఎస్సార్ 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారు. 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదు. బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారు. చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కల్యాణ్. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారు. చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైఎస్సార్ ఆనాడే చెప్పారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చాడు?. రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా?. టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విభజన సమస్యలు పరిష్కరించండి: సీఎం వైఎస్ జగన్ -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నందమూరి కుటుంబానికి అవమానం
-
మహానాడులో జగన్నామస్మరణ
రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ మహానాడు ఆసాంతం జగన్నామస్మరణతో మార్మోగిపోయింది. ఉదయం సమావేశం ప్రారంభమైంది మొదలు రాత్రి ముగిసే వరకు ప్రతి నిమిషం సీఎం పేరు తలుచుకోకుండా ఏ నాయకుడూ తన ప్రసంగాన్ని ముగించలేదు. తిట్లు, శాపనార్థాలు, ఆక్రోశాలు, ఆగ్రహావేశాలు, విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా నేతలంతా ఇదే ఒరవడి కొనసాగించారు. అసలు మహానాడు నిర్వహిస్తోంది సీఎం జగన్‌ను తిట్టడానికే అన్నట్లు వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక పేరుతో వర్ల రామయ్య పార్టీ కార్యక్రమాల గురించి చెప్పడం కంటే జగన్‌ను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు తీర్మానాలు మినహా మిగిలిన ఏపీకి చెందిన తీర్మానాలన్నీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పెట్టినవే కావడం గమనార్హం. ఎన్టీఆర్ కుటుంబానికి అవమానం మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన కుటుంబీకుల ఎవరికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్‌లకే అత్యంత ప్రాధాన్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించారు. ప్రధాన బ్యానర్లో నందమూరి బాలకృష్ణ ఫొటో ముద్రించక పోవడంపై పలువురు నేతలు చర్చించుకున్నారు. ప్రకటనలు, కరపత్రాలు.. అన్నింటా చంద్రబాబు, లోకేశ్‌కే ప్రాధాన్యం కనిపించింది. తద్వారా టీడీపీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉండదనే రీతిలో మహానాడు నిర్వహించారు. కాగా, మహానాడుకు జన స్పందన కరువైంది. ఆశించిన మేరకు జనం రాకపోవడంతో సభ వెలవెలబోయింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గ్యాలరీల్లో జనం లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు..’ ప్రస్తావన మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించారు. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు. -
చంద్రబాబూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్టీఆర్ చావుకు, ఆయన ఆత్మక్షోభకు కారణం చంద్రబాబేనని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా అని ప్రశ్నించారు. ఏ సంక్షేమ పథకాన్నైనా ప్రజలకు అందించారా అని నిలదీశారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ప్రజలను నిరు పేదలుగా మార్చారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా అని విమర్శించారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్ప చంద్రబాబు చేస్తుందేంటని మండిపడ్డారు. మంత్రి ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే ►చంద్రబాబునాయుడూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టి వాస్తవాల్లోకి రా.. ► సినిమాల్లో ఎన్టీఆర్ నటుడు అయితే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు ►చంద్రబాబు ఏది చేసినా అన్నీ పబ్లిసిటీ కోసం..పత్రికల కోసం మాత్రమే. ► ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు..ఏదైనా నేరుగా మాట్లాడు చంద్రబాబు ►నువ్వు అధికారంలో ఉన్న కాలంలో చెప్పుకోడానికి ఏదైనా ఉంటే చెప్పు ► ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి వారి పేరు చెబితే అనేక పథకాలు ప్రజల గుండెల్లో ఉండిపోయాయి. ►అలాంటిది నీ పేరు చెప్తే గుర్తుండే ఒక కార్యక్రమం చెప్పగలవా..? ► గంటలు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుని వెళితే లాభం లేదు. ►ఎంతసేపూ జగన్ గారిని ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు చేస్తుంది ఏమీ లేదు. ►జగన్ ధనవంతుడు అయ్యాడట..పేదలు నిరుపేదలు అయ్యారట.. ► ప్రజలు నిరుపేదలుగా కావడానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు. ► సామాన్యులు ఇంకా అథోపాతాళానికి వెళ్లింది..కరువు వచ్చి ప్రజలు అల్లాడింది నీ హయాంలో కాదా..? ► బడుగు బలహీన వర్గాలు నీ వద్దకు వస్తే నువ్వు ఎంత హేళనగా మాట్లాడావో నీకు మళ్లీ చెప్పాలా..? ►నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తాను అన్నది నువ్వు కాదా... ►ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది నువ్వు కాదా.? ఏపీ జీఎస్డీపీలో మొదటి స్థానంలో ఉన్నది నిజం కాదా..? ►చంద్రబాబు పరిపాలనలో జీఎస్డీపీ 6.3 శాతంగా ఉండేది. ►జగన్ అధికారంలోకి వచ్చాక జీఎస్డీపీ 7.5 శాతానికి పెరిగింది. ►ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా..? సామాన్యుడి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం కాదా..? ►బాబు హయాంలో రాష్ట్రం 22 వ స్థానంలో ఉంటే ఈ రోజు జీఎస్డీపీలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ►ఎందుకు అన్నీ అబద్దాలు మాట్లాడతావు చంద్రబాబు..ప్రజలు వాస్తవాలు తెలియని అమాయకులు అనుకుంటున్నావా..? ►నువ్వున్నప్పుడు వ్యవసాయం మైనస్ గ్రోత్‌లో ఉండటం అబద్దమా..? ► రండి.. నువ్వు..నీ ఆర్ధిక మంత్రి ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉందా..? ►వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో 8 శాతం వృద్ధి నమోదైంది. ►ఆ రోజు చంద్రబాబును ఎరువులు అడిగిన రైతులు లేరు. పంటలను కొనుగోలు చేయండి అని అడిగివారే లేరు ►కారణం ఆయన కాలం అంతా కరువు కాటకాల మయం. ► వ్యవసాయం దండగ అన్న వ్యక్తి పాలనలో రైతులు, రైతు కూలీలు ఈ రాష్ట్రం విడిచి పారిపోయారు. ► జగన్రు ముఖ్యమంత్రి అయిన తరవాత పుష్కలంగా వర్షాలు పడ్డాయి.. పంటలు కళకళలాడుతున్నాయి. ►ప్రభుత్వం వ్యవసాయ దారునికి ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయం పుంజుకుంది. ►రైతు బరోసా కేంద్రాల నుంచి అనే సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు అండగా నిలుస్తున్నాయి. చదవండి: ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు శకుని వేషం వేసింది ఎవరు? అధికారంలోకి వచ్చాక ఏం చేశామన్నది ముఖ్యం ►అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. ►అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యం ►ప్రజల నమ్మకం ఏ రకంగా నిలబెట్టుకున్నామన్నది ముఖ్యం. ►వైఎస్సార్ స్పూర్తితో జగన్ ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నారు. ►ప్రతి ప్రయోజనం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందేటట్లు పరిపాలన చేయబట్టే వ్యవసాయం విరాజిల్లుతోంది. ►అది వ్యవసాయ దారుని ఆత్మస్థైర్యాన్ని పెంచడం కాదా..? నీ హయాంలో ప్రభుత్వ విద్యార్థులకు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయా..? ► అదికారంలో ఉన్నప్పుడు విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టావు చంద్రబాబు..? ►ఎప్పుడైనా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచనైనా చేశావా..? ►ఎప్పుడైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న పిల్లల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా వచ్చాయా..? ఇప్పుడు వచ్చాయి.. ► నీ హయాంలో విద్యారంగంపై కేవలం రూ.19వేల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మేం రూ.40 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాం. ►విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు ►విద్యపై పెట్టే ఖర్చు దేశానికి పెట్టబడి అని మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు భావించారు. ►విద్య అంటే మొదటి స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం పేరు చెప్పేవారు. ►ఇవాళ మన విద్యా రంగంలోని సంస్కరణలను దేశమంతా చెప్పుకుంటోంది. ► రేపు స్కూళ్లు తెరిచే లోపు డిజిటల్ విద్యా బోధనకు సర్వం సిద్ధం చేస్తున్నాం. ►మన విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ఉండాలంటే ఇంగ్లీషు మీడియం విద్య అవసరమని భావించి ప్రవేశపెట్టాం. ►చంద్రబాబు హయాంలో రాష్ట్రం విద్యారంగంలో 24 స్థానంలో ఉంటే..జగన్ గారి హయాంలో 7వ స్థానానికి చేరాం. మొదటి స్థానానికి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. జిల్లాకో మెడికల్ కాలేజీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా బాబూ..? ► ఎంతసేపూ జగన్‌ను ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు తానేం చేశాడో చెప్పడం లేదు. ►జిల్లాకో మెడికల్ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా..? ►ఇప్పుడు జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. ►రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భావించి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకుంటే దేశంలోనే మన రాష్ట్రం గత మూడేళ్లుగా నంబర్ 1 స్థానంలో ఉంది. ►సచివాలయ వ్యవస్థలో లక్షా 40 వేల మందిని ఒకే సారి రిక్రూట్‌చేశాం. ► పరిపాలనను ప్రతి గుమ్మం ముందుకు తీసుకెళ్లాం. ►అవినీతి లేకుండా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్ల వరకూ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లింది. ►నీ హయాంలో ఈ డబ్బంతా ఏమైంది..? ఈ డబ్బంతా పెత్తందార్లకు దోచిపెట్టలేదా..? ►నిత్యం అబద్దాలు చెప్తే జనం నమ్ముతారు అనుకోవద్దు. రాష్ట్రం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అన్నావ్..మరి ఏం చేశావ్..?: ► నాకు పేద ప్రజల అండ, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని జగన్ అంటున్నారు. ►మీ అండతోనే మళ్లీ నేను సేవ చేసే అవకాశంలోకి వస్తానని ధైర్యంగా చెప్తున్నాడు. ►నువ్వు ఎప్పుడైనా ఇలా చెప్పావా చంద్రబాబు..? ఇప్పుడు మళ్లీ వస్తే ఏదో రిపేరు చేస్తాడట. ►గతంలో ఆంధ్రా ఇప్పుడే పుట్టిన పసిపాప...నాకు అనుభవం ఉంది అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు కదా.. ► అప్పుడు ఏం చేశావ్..నీ తాబేదార్లు, నీ సామాజిక వర్గీయులకే దోచిపెట్టావు ►జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నది మర్చిపోయావా చంద్రబాబూ ► ఆనాడు పింఛన్ రావాలంటే ఎవరు చచ్చిపోతారా అని వేచిచూడాల్సిన పరిస్థితిని మర్చిపోయావా..? ► చంద్రబాబు తానేదో బ్రహ్మవాక్కు చెప్తున్నట్లు..దాన్నంతా రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్న ఫీలవుతున్నాడు. ► మీరు ఎన్ని మాట్లాడిన ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా 2018–19లో దానికంటే మిన్నగా తీర్చిదిద్దుతాం. ►అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అందరూ ఏపీ వైపు చూసేటట్లు చేస్తాం. ►పేదవానికి ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందాలనేది ఈ ప్రభుత్వం విధానం. ►ఎవరెన్ని అన్నా ఇదే విదానాన్ని కొనసాగిస్తాం..దానితోనే రాబోయే కాలంలో ప్రజల్ని మెప్పిస్తాం. ►మళ్లీ సీఎం జగన్ అధికారంలోకి రావడం ఖాయం.. ఖాయం.. ►చంద్రబాబు చెప్పే మాయమాటలు నమ్మెద్దు. ప్రశ్నలు–సమాధానాలు ► రోజుకో డ్రామా సీబీఐ ఆడుతుందా..? మేము ఆడుతున్నామా..? ► ఒకే సారి కాగితాలన్నీ పెట్టొచ్చుగా..రోజుకోకటి పెట్టడం ఎందుకు..? ►చంద్రబాబు ఎన్ని చేసుకున్నా ప్రజలు నమ్మే దశలో లేరు. ►జగన్ రెండు అంశాల్లో ప్రజలు నమ్మారు. తన తండ్రిలా జగన్ గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మారు. ►రెండోది ఆయన కొత్త వ్యక్తి.. ఈయనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అని అధికారం ఇచ్చారు. ►సీఎం చెప్పింది చేశాడు.. జనం నమ్మింది సార్ధకత చేశాడు. ► చంద్రబాబు చెప్పింది ఎపుడైనా చేశాడా..? మ్యానిఫెస్టో ఇది అని ఎప్పుడైనా చూపాడా..? ►మ్యానిఫెస్టో నా ఖురాన్, భగవద్గీత, బైబిల్ అని జగన్ అంటున్నారు. ►చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం ఉందా..? ► విశాఖ రాజధాని ఎప్పుడో వచ్చేసింది..వ్యక్తులు రావడమే మిగిలింది.. అమరావతి ఏమన్నా దేవేంద్రుని నిలయమా..?: ►అమరావతి అనేది ఏమైనా బ్రహ్మపదార్ధమా.? దేవేంద్రుని నిలయమా..? ► సామాన్యుడు, పేదవాడు ఉండటానికి వీళ్లేదా..? ► ఊరంటే ఒకే సామాజిక వర్గం ఉండాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా..? ► ఊరంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిస్తేనే ఊరు ►అక్కడ ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి వారికి ఇక్కడ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త -
‘చంపిన చేతుల్తోనే దండేసి దండంపెట్టడం చంద్రబాబుకే చెల్లింది’
సాక్షి, అమరావతి: చంపిన చేతుల్తోనే దండేసి దండంపెట్టడం చంద్రబాబుకే చెల్లిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహానాడు పేరిట ఈరోజు రాజమండ్రిలో చంద్రబాబు వెకిలిచేష్టలు చూశాం. పిచ్చిప్రేలాపల్ని విన్నాం. మహానాడు వేదికపై ఒకపక్క ఎన్టీరామారావు విగ్రహం పెట్టి ఆయన చిత్రపటానికి దండ వేసి చంద్రబాబు దండం పెట్టారు. పాపం, ఈ రోజు ఎన్టీరామారావు ఆత్మ రాజమండ్రి మహానాడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఈ సందర్భంగా ఎన్టీరామారావు దేవుడ్ని ఒక వరం కోరుకుంటారు. అదేమంటే, ‘నిండు నూరేళ్లు జీవించాల్సిన నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను సమాధి చేసిన చంద్రబాబు.. నాకు దండ వేయడమేంటి..? నాకు దండం పెట్టడమేంటి..? అని.. నాకు గానీ దేవుడు మరలా ప్రాణం పోస్తే.. నన్ను కిరాతకంగా వెన్నుపోటు పొడిచి, నా నడ్డివిరిచి, నా పార్టీని లాక్కొని మానసికంగా తీవ్రంగా క్షోభపెట్టి సమాధి చేసిన చంద్రబాబును ఆ వేదిక మీదనే కొట్టికొట్టి చంపి సమాధి చేస్తాను.. అందుకు నాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. చంద్రబాబు ఆయన తోక నాయకులు కలసి ఎంత దిగజారిపోయారు..? రాజకీయాల్లో ఒక వ్యక్తిని రాళ్లతో, కర్రలతో, చెప్పులతో కొట్టడమేంటి..? ఆ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా పతనం చేసి చంపడమేంటి..? మరలా అదే వ్యక్తి శతజయంతి ఉత్సవాల పేరిట మీరు చంపిన వ్యక్తిని.. మీ చేతులతో నిలువునా వెన్నుపోటు పొడిచి పొట్టనబెట్టుకున్న నాయకుడికే మీరు చేతులెత్తి దండం పెట్టి దండలేయాల్సిన దౌర్భాగ్యం మీకు పట్టిందా..? మరీ ఇంత దుర్మార్గమా..? అని అడుగుతున్నాను. ఎన్టీరామారావు పేరు, ఆయన ఫొటోలేకుండా వేదికమీద కూర్చోలేని నాయకులు వీళ్లు’’ అంటూ మంత్రి మండిపడ్డారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త నూరేళ్ళు బతకాల్సిన నాయకుడిని సమాధి చేసి.. నూరేళ్ళు బతకాల్సిన నాయకుడ్ని 28 ఏళ్ళ క్రితమే సమాధి చేసేసి, ఆయన ఆయుర్థాయాన్ని తగ్గించి, చివరి దశలో అవమానించి, పదవి లాక్కుని, వెన్నుపోటు పొడిచి, ఒకరకంగా హత్య చేసిన తర్వాత, ఈరోజు శత పురుషుడ్ని - శక పురుషుడ్ని.. స్మరించుకుంటూ డ్రామాలు ఆడటం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాదు. ఇప్పుడు రాజమండ్రిలో నడుస్తున్నది ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డ్యాన్స్ మాత్రమే తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదు. - ప్రజలకు ఏం చేశారన్నది మహానాడు ఎజెండాలోనే లేదు. - టీడీపీ మహానాడు తీర్మానాలు అంటూ 153 పేజీల మెటీరియల్ పబ్లిష్ చేశారు. చంద్రబాబు అనే చెవిటివాడి చెవిలో శ్రీకృష్ణుడు అనే ఎన్టీఆర్ శంఖం ఊదుతున్నట్టుగా మొదటి పేజీ పబ్లిష్ చేశారు. - ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ఎన్టీఆర్ కు ముందు-తర్వాత అంటూ తెలుగువారి చరిత్ర అని రాశారు, బాగుంది. - చంద్రబాబు ముందు-తర్వాత అనే తెలుగువారి చరిత్ర చాప్టర్ మాత్రం లేదు. - 153 పేజీల ముసాయిదా తీర్మానాల పుస్తకంలో మేము మా పరిపాలనలో ఈ మంచి చేశాం అని లేదు. - చంద్రబాబు పేరు చెబితే.. ఈ పథకం గుర్తుకు వస్తుందని ఒక్క వాక్యం కూడా లేదు. - 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల, ఒక పేద ఇంటికి పలానా మంచి జరిగిందని ఒక్క చాప్టర్ కూడా రాయలేకపోయారు. -పైగా, 2014-19 మధ్య రైతు రుణాలన్నీ మాఫీ చేసేసినట్టు, కౌలు రైతులకు కూడా రుణ మాఫీ జరిగినట్టు, పంటల బీమా ఏటా ఇచ్చినట్టు, ఇవ్వని సున్నా వడ్డీ రుణాలు ఇచ్చినట్టు, పూర్తి చేయని ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్టు, పాడి పరిశ్రమ కూడా వర్థిల్లినట్టు.. రాశారు. - నిజానికి 5 ఏళ్ళ చంద్రబాబు పాలనలో సగటును ఏడాదికి 300 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. - అంటే రాష్ట్రంలో ఉన్న మండలాల్లో సగం.. 5 ఏళ్ళూ కరవే. పేదల ఇళ్ళనూ అవమానించారు - ఇక, పథకాలకు సంబంధించి అమ్మ ఒడి కన్నా గొప్ప పథకాన్ని తాము ఇచ్చినట్టు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ రద్దు చేసినట్టు, బెల్టు షాపులు లేవన్నట్టు, మద్యం ధరల్ని నియంత్రించినట్టు అందులో రాశారు. - టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమిని కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వకపోయినా, ఇచ్చేశాం అని రాశారు. - తాను పడుకోవడానికి కూడా ఇళ్ళు సరిపోవని అచ్చెన్నాయుడు అంటే.. తన టాయిలెట్ కూడా ఇంతకంటే పెద్దదిగా ఉంటుందని లోకేశ్ అంటే.. ఈ ఇళ్ళను సమాధులతో పోల్చాడు చంద్రబాబు నాయుడు. - దిశ యాప్ వల్ల మహిళలకు కలుగుతున్న రక్షణను పక్కన పెట్టి, అలాంటి యాప్ లేకపోవడం వల్లే చంద్రబాబు- పాలన బాగుందని చెప్పారు. - టీడీపీ హయాంలో మొత్తంగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు, 5 ఏళ్ళలో కలిపి 30 వేలు. జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు. -టీడీపీ పాలనలో పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు లేవు.. అని తెలిసినా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఖాతా రాసుకున్నారు. - ఇప్పుడు మరోసారి బీసీలకు డిక్లరేషన్ అని కొత్త వాగ్దానాలతో కొత్త డ్రామా మొదలు పెట్టారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా వారి చేతికి మీరు ఏమి అందించారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా... రూ. 2.10 లక్షల కోట్ల డీబీటీ ద్వారా జగన్ గారి పాలనలో అందిన ప్రయోజనాలతో పోలికే లేకుండా, ఎస్సీలకు న్యాయం చేసేశామని పద్దు రాసుకున్నారు. - ఇలా మొత్తంగా చూస్తే.. పూర్తిగా డ్రామా తప్ప, పచ్చి అబద్ధాలు తప్ప.. ఈ మహనాడులో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఏమీ లేవు. చతికిలపడిన సైకిల్ అది తెలుగుదేశం పార్టీ ఇంకా జనాల్లో బతికే ఉందనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నాడు. 2019 ఎన్నికల్లోనే ఆపార్టీకి జనం సమాధి కట్టారని ఆయన తెలుసుకోవాలి. మరలా సైకిల్‌కు పూర్వవైభవం తెస్తానని బాబు రంకెలేయడం పనికిమాలిన కార్యక్రమమే.. ఆ సైకిల్ ఎప్పుడో చతికిలపడిందని .. పార్టీలేదు.. బొక్కా లేదంటూ స్వయంగా ఆపార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్న చెప్పిన సంగతిని అందరూ గుర్తెరగాలి. బాబు చెబుతున్నట్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ తెస్తాడంట. అది ఎక్కితే మహానాడు వేదిక నుంచి నేరుగా గోదాట్లోకి పోవడమేనని బాబు తెలుసుకోవాలి. మేనిఫెస్టో అంటే విలువలేని నేత బాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు అసలు విలువుందా..? 2014కు ముందు 600 పైచిలుకు హామీలతో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేసి మాట నిలబెట్టుకున్నాడా..? అని నిలదీస్తున్నాను. బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆదరణ, ఇతర పథకాల పేరుతో బీసీలను అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలే బాగుపడ్డారు గానీ బీసీల్ని బానిసలుగా చూసిన బాబు వాళ్ల మేలు కోసం ఏరోజూ పాటుపడలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల్ని పట్టించుకోని బాబు, ఎన్నికల సమయం వచ్చేసరికే బీసీల జపం చేయడం రివాజుగానే వస్తుందని నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. రకరకాల మాయమాటలతో మళ్లీ బీసీల్ని బురిడీ కొట్టించడానికి బాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎన్ని ఎత్తుగడలేసినా బీసీ సోదరులు మాత్రం టీడీపీ పక్షాన ఉండరన్నది యదార్థం. ఎందుకంటే, బీసీల తోకలు కత్తిరిస్తానన్నది ఈ మహానుభావుడేనన్న విషయం ప్రతీ ఒక్క బీసీ సోదరుడు గుర్తుకుతెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. బీసీలే బాబును తరిమితరిమి కొడతారు ఈరోజు రాష్ట్రంలోని బీసీవర్గాలన్నీ సంఘటితమయ్యాయి. ఇన్నాళ్లకు తమను ఆదరించే నాయకుడు వచ్చాడని.. అన్నివర్గాల పెద్దన్నగా జగన్ గారు నిలిచారని బీసీసోదరులు నమ్మారు. కనుకనే, వైఎస్ఆర్సీపీ ఇటీవల జరిపిన జయహో బీసీ మహాసభ విజయవంతంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టింది. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరింది. అందుకనే, పర్యటనల్లో బీసీ తమ్ముళ్లూ అంటూ రంకేలేస్తున్నాడు. ఎన్నికల సమయానికి ఓట్ల అవసరం వచ్చేసరికి ఆయన ఇప్పుడు బీసీల జపం చేస్తున్నారు. రాబోయే కాలంలో బీసీ కాలనీలకు వెళ్లి ఆత్మగౌరవం, సామాజికన్యాయం అనే పదాలు బాబు మాట్లాడితే.. ఆయన్ను బీసీలే చెప్పులు, రాళ్లు విసిరి తరిమితరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను. బీసీలకు పెద్దన్న మా జగన్ గారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని తిరుగుతున్నారు. బీసీలకు బాద్షాగా జగన్ గారు మాకు పదవులు, పనుల్లో పెద్దపీట వేయడం మూలానా మేమంతా సమాజంలో అత్యున్నతమైన జీవనశైలితో బతుకుతున్నాం. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ప్రతీ అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం తపనపడుతున్న మా జగన్‌గారు మా అందరికీ మనసున్న ముఖ్యమంత్రి. చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. ఆ పేదలే బాబుకు, టీడీపీకి రాజకీయంగా పాతరేస్తారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎక్కడైనా పేదలకు సెంటు స్థలమిచ్చాడా..? టిడ్కో ఇళ్ల పేరుతో పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం నిజం కాదా.? వీటికి సమాధానం చెప్పే దమ్మూధైర్యం బాబుకు ఉందా..? అని నిలదీస్తున్నాను. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా నిరుపేద వర్గాల మహిళాసోదరీమణుల పేరుతో ప్రభుత్వం ఇళ్లపట్టాలిచ్చి.. వారికి నిలువ నీడను ప్రసాదిస్తే, ఈ చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ప్రభుత్వమిచ్చే ఇళ్ళ స్ఠలాల భూములను సమాధులతో పోలుస్తారా..? అందుకే, నేను ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను. ఈరోజు పేదవర్గాల కుటుంబాలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల పునాదుల్లోనే చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి సమాధి ఖాయమని హెచ్చరిస్తున్నాను. తమకు ఇళ్లు రాకుండా ఇన్నాళ్లూ రకరకాల కారణాలతో జాప్యం చేసిన చంద్రబాబు కుట్ర కుతంత్రాలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా తెలుసుకున్నారు. రేపటి ఎన్నికల్లో వారంతా కలసి చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీపై కసిదీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బాబును నమ్మితే నట్టేటా మునిగినట్టే.. బాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది. ఆయన నయవంచన రాజకీయం ఇక చెల్లదు. చంద్రబాబును నమ్ముకుంటే ఎవరైనా నట్టేటా మునిగినట్టే. ఆయన్ను నమ్ముకున్న నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎన్టీఆర్ గారు మాదిరిగానే పైలోకాలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ఒక రియల్ఎస్టేట్ బ్రోకర్. అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాలకు ఒక వలయం పెట్టి పెత్తందారీ రాజ్యానికి చంద్రబాబు కాపలా ఉండి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. - పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అహంకార మనస్తత్త్వాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు. న్యాయస్థానాలు పేదల పక్షాన ఉన్నాయి కాబట్టి.. మా పక్షాన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి ధీరోధాత్తుడు నిలబడ్డారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలే విజయం సాధించారు. నిన్న పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి ఎన్నికలు ఎప్పుడొచ్చినా 175 కి 175 స్థానాల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు శకుని వేషం వేసింది ఎవరు?
సాక్షి, తాడేపల్లి: మహానాడు చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందలాగే జరుగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వయసు మీద పడిన చంద్రబాబుకు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని, కార్యకర్తలకు సుత్తి కబుర్లు చెబుతున్నాడని దుయ్యబట్టారు. సైకిల్ గుర్తు ఎన్టీఆర్ సృష్టి అని, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం గుర్తు కింద ఉన్నాడని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ధనిక సీఎం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ దగ్గర దొంగలించిన సైకిల్ సైకిల్ గుర్తు ఎన్టీఆర్ సృష్టి అని బాబు చెబుతున్నాడు. దాంట్లో పేదవాడికి గుర్తుగా పూరిల్లు. రైతుకు గుర్తుగా నాగలి. యంత్రానికి గుర్తుగా చక్రం ఉందని బాబు ఈరోజు చెప్పినట్లు అది వందకు వందశాతం నిజమే. చంద్రబాబు జీవితంలో చెప్పిన ఏకైక నిజం ఇదే. మరి, టీడీపీ గుర్తును ఎన్టీఆర్ సృష్టించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు..? హస్తం గుర్తు కింద కాంగ్రెస్ జెండా చుట్టుకుని ఉన్నాడు. అప్పట్లో రామారావును పొడిచేస్తానంటూ ప్రగల్భాలు పలికి సవాళ్లు విసురుకుంటూ కాంగ్రెస్ గూట్లో ఉన్నాడు. లక్ష్మీపార్వతి గారిని అడ్డంపెట్టుకుని రామోజీరావుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన చంద్రబాబు తన స్వహస్తాలతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని, ఆయన సృష్టించిన పార్టీ సైకిల్ గుర్తును లాగేసుకున్న నీచుడు ఈ చంద్రబాబు. వెన్నుపోటు పొడిచిన చేతులతోనే ఎన్టీఆర్ చిత్రపటానికి దండవేసి దండం పెట్టడానికి కూడా సిగ్గుపడకుండా ఉన్న చరిత్ర చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు ఆస్తి రూ.1000 కోట్లు.. రాష్ట్రంలో ధనిక ముఖ్యమంత్రి జగన్ గారు అంటూ చంద్రబాబు తప్పుడు మాట మాట్లాడుతున్నారు. జగన్‌గారు డిక్లేర్ చేసిన ఆయన కుటుంబ ఆస్తి రూ.510 కోట్లు కాగా, ఈ దొంగ మాటలు మాట్లాడే చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం రూ.1000(వెయ్యి) కోట్లు ఉంది. ఇదేదో మేం గాల్లో చెబుతున్న లెక్కలు కాదు. ఆయన ఎన్నికల డిక్లరేషన్, ఆయన కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్‌ల అధికారిక లెక్కలనే చెబుతున్నాం. బాబు, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనువడి పేర్లతో ఉన్న ఆస్తులన్నీ కలిపి అంతస్థాయిలో ఉంటే.. ఈరోజు జగన్‌గారిపై తప్పుడు మాటలు మాట్లాడి బురదజల్లే రాజకీయం బాబుకు తగదని మేం హితవు చెబుతున్నాం. రెండెకరాల నుంచి రూ.1000 కోట్లు ఎలా గడించావు చంద్రబాబు ఒక విషయంపై నిజాయితీగా మాట్లాడాలి. అదేమంటే, కర్జూరనాయుడు గారు, అమ్మణ్ణమ్మ కలిసి బాబుకు ఇచ్చిన ఆస్తి ఎంత..? మేం ఈ సందర్భంలో కిస్మిస్ నాయుడు గురించి మాట్లడటం లేదు. బాబు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఎంత..? కేవలం రెండు ఎకరాల ఆస్తితో బయల్దేరి ఈరోజు రూ.1000 కోట్లదాకా ఎదిగావు కదా..? మరి, నువ్వేదో పక్కా నిఖార్సైన నీతిమంతుడైన రాజకీయనేతగా చెప్పుకుంటావా బాబూ..? అసలు, నువ్వు ఏం వ్యాపారం చేశావు.? 1992లో హెరిటేజ్ కంపెనీ రిజిస్ట్రర్ చేసి 1995–96లో హెరిటేజ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసేవరకు కూడా నువ్వేం వ్యాపారాలు చేశావు చంద్రబాబు..? సమాధానం చెప్పు. హెరిటేజ్ కంపెనీ అనేదాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యేముందు ఏర్పాటు చేసి.. దాంట్లో పార్టనర్లుగా ఉన్న మోహన్‌బాబు లాంటి అనేకమందిని బయటకు సాగనంపావు కదా..? ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ముందుకు సాగని హెరిటేజ్ కంపెనీ బాబు ముఖ్యమంత్రి అయ్యాకనే ఎందుకు పరిగెత్తింది అనే విషయాన్ని ఆయన చెప్పగలడా..? ఈరోజు వేరేవాళ్లకు హెరిటేజ్‌ను ఎందుకు అంటగట్టాడు.. ఆయన ఇంట్లో వాళ్లు జీతాల కింద ఎంత తీసుకుంటున్నారు..? ఇందులో రహస్యమేంటి..? బాబు తప్పుడు పనులు, ప్రభుత్వ డైరీలను నిర్వీర్యం చేయడం అందరికీ తెలుసు కదా..? ఇవన్నీ బాబు దాస్తే దాగేవి కాదు. రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే.. అవినీతికి తావెక్కడ..? చంద్రబాబు నోటివెంట వచ్చే ప్రతీ మాట అబద్ధమే. ఈ రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆయన చెప్పడానికి నోరెలా వస్తుంది..? అసలు, రూ.2లక్షల చిల్లరగా ఉన్న ఈ రాష్ట్ర బడ్జెట్లో జీతాలకింద, అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు చంద్రబాబుకు తెలియవా..?. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారు నవరత్నాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పథకాల ద్వారా డీబీటీ కింద పైసా లంచం లేకుండా నేరుగా ఇప్పటి వరకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.10 లక్షల కోట్లు కాగా, ఎక్కడ అవినీతి జరిగిందని ఈరోజు చంద్రబాబు రంకెలేస్తున్నాడు..? ఆయన నోట్లో నుంచి మాటల్ని నిరూపించుకునే దమ్ముందా..? అని బాబును అడుగుతున్నాను. తప్పుడు మాటలతో, అసత్యప్రచారాన్ని పదిమార్లు చెబితే ప్రజల్ని నమ్మించవచ్చనే చంద్రబాబు దొంగ తెలివితేటలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఆషాడభూతి, నయవంచక శకుని వేషధారి చంద్రబాబే ఓట్లు అవసరం రాగానే జనం దగ్గర వేషాలేసే సంస్కృతి ఒక్క చంద్రబాబుకే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్టీ రామారావు గారి దగ్గర ఆషాడభూతి వేషం వేసిందే చంద్రబాబు. ఆయనకు వెన్నుపోటు పొడిచి నయవంచకుడి వేషం వేసింది ఇదే చంద్రబాబు కాదా..? ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చుపెట్టి ముక్కలు ముక్కలు చేసిన శకుని పాత్రధారి ఎవరు..? చంద్రబాబే కదా..? రాజకీయాల్లో అందర్నీ వాడుకుని వదిలేసే తప్పుడు రాజకీయనేత వేషం కూడా చంద్రబాబుదే. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ప్రజల ముందు నక్కవినయాలు ప్రదర్శించే గుంటనక్క ఈ చంద్రబాబు. ఎండమావుల్లాంటి ఆశల్ని ఎరవేసి ఎన్నికల ముందు కార్యకర్తలే దేవుళ్లని.. ఎన్నికల తర్వాత వాళ్ల మొఖం చూడని తప్పుడు నాయకుడు చంద్రబాబు అని ఎవర్ని అడిగినా చెబుతారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఎంతమంది పేదల్ని కోటీశ్వరుల్ని చేశావ్ అధికారమే పరమావధిగా ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో బాబుకు అధికారం ఇస్తే పేదల్ని కోటీశ్వరులుగా మారుస్తానంటూ ఈరోజు కొత్తపలుకులు పలుకుతున్నాడు. ఈ సందర్భంగా నేనొక ప్రశ్న వేస్తున్నాను. బాబు సమాధానమివ్వాలి. 1996 నుంచి 2004 దాకా బాబు అధికారంలో ఉన్నప్పుడు.. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవారిని కోటీశ్వరులుగా మార్చారో.. సమాధానం చెప్పండి..? అని నిలదీస్తున్నాను. సాంకేతికంగా బాబు పెద్ద తురుంఖాన్ అని చెబుతున్నాడు కదా..? మరి, ఎంతమంది నిరుపేదల్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు కోటీశ్వరుల్ని చేశాడో జాబితా ప్రింట్ తీసి చూపించమని అడుగుతున్నాను. చదవండి: టీడీపీ చేస్తోంది మహానాడు కాదు.. మాయనాడు: ఆర్కే రోజా మళ్లీ అధికారం కోరడానికి సిగ్గులేదా బాబూ..? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని రేపు అధికారం ఇస్తే చేస్తాననే మాట అనడానికి సిగ్గులేదా బాబూ..? మరి, నీహయాంలో పేదలు పేదలుగానే మిగిలారు తప్ప వాళ్లేవరూ కోటీశ్వరులు కాలేదు కదా..? అలాంటప్పుడు ఇంకా నీకు 2024లో పేదవర్గాల ఓటర్లు టీడీపీకి ఓట్లేసి నిన్ను ఎందుకు గెలిపించాలని నిలదీస్తున్నాను. అసలు బాబును ఎందుకు నమ్మాలి..? పేదల గురించి ఏ ఒక్క క్షణం ఆలోచించని ఆయన్ను రాజకీయాల్లో నుంచే పక్కనబెట్టాలని పేదవర్గాలు ఆలోచన చేయడంలో తప్పేం లేదుకదా..? అని చెబుతున్నాను. బాబు బతుకంతా తప్పుడు లెక్కలే మాట్లాడితే.. సంపద సృష్టించాను అని బాబు అంటాడు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో బాబు సృష్టించిన సంపద ఎంత..? ఇచ్చాపురం నుంచి తడ దాకా అటు కర్నూలు నుంచి ఇటు బందరు దాకా బాబు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపద ఏంటని అడుగుతున్నాను. సమాధానం చెప్పగలరా..? 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆర్థిక పరిమితికి మించి రూ.26వేల కోట్లు మీ తప్పుడు లెక్కలతో అప్పులు చేసిన మాట వాస్తవం కాదా..? ఈ సత్యాన్ని మీ మంత్రి యనమల అప్పట్లో పబ్లిక్‌గానే చెప్పినసంగతి మరిచి పోయారా..? అని గుర్తుచేస్తున్నాను. జగన్ గారు సీఎం కాగానే, ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయంటూ.. జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదంటూ అప్పట్లో మీ రామోజీరావు తన ఈనాడు పత్రికలో రాసుకున్నది నిజం కాదా..? ఇదేకదా బాబు సృష్టించిన తప్పుడు సంపద అని వివరిస్తున్నాను. చంద్రబాబు 2019లో అధికారంలో నుంచి దిగేటప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లుల కింద చెల్లించాల్సినవి సుమారు రూ.40 వేల కోట్లు పైగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద రూ.650 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. రైతుల దగ్గర్నుంచి విత్తన సేకరణకు గానీ, వారికి అందించే ఇన్‌ఫుట్ సబ్సిడీ గానీ, ధాన్యం కొనుగోలు చేసిన దానికి రైతులకు చెల్లించాల్సినవి, వారికి ఉచితంగా అందించే పవర్ సబ్సిడీ .. ఇవన్నీ కలిపితే మొత్తం వేల కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు దిగిపోయాడు. ఇది అనేక తప్పుడు విధానాలతో తప్పుడు పనులు చేసిన చంద్రబాబు బకాయిల బాగోతం. మరి ఆయన సృష్టించిన సంపద ఎక్కడ..? అని అడుగుతున్నాం. సమాధానం చెప్పే దమ్ముందా బాబూ..? జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు కనిపించిన బాబు తప్పుల అప్పుల కుప్పంతా రామోజీరావునే స్వయంగా వారి ఈనాడు పత్రికలో రాసుకున్నారు. బాబుమార్కు పథకం ఒక్కటైనా ఉందా..? పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు గుర్తుంచుకోదగ్గ ఏ ఒక్క పథకాన్నైనా చంద్రబాబు అమలు చేశాడా..? అని ప్రశ్నిస్తున్నాను. బాబుకు- ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్‌గారి పాలనలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కిలో రూ.2 బియ్యం పథకం ఎన్టీఆర్ తెస్తే.. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్‌లను డ్వాక్రామహిళలకే పావలావడ్డీకే రుణాలు, శాచురేషన్ విధానంలో పింఛన్లు, ముస్లీంలకు 4శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టింది మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి కాగా, అమ్మ ఒడి, 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు, సచివాలయ వ్యవస్థ, రైతుభరోసాకేంద్రాలు తదితర నవరత్నాల పథకాలతో ఈరోజు జనరంజక పాలన అందజేస్తున్న జగన్‌గారు ప్రజలకు గుర్తుకువస్తుంటే.. బాబు పథకాల్లో ఏ ఒక్కటైనా జనానికి గుర్తుందా..? అని ప్రశ్నిస్తున్నాను. కాపులకు రిజర్వేషన్, మత్య్సకారులు, బోయ, రజకుల్ని ఎస్సీల్లో చేరుస్తాననే అబద్ధపు హామిలిచ్చి మొండిచేయి చూపిన నీచుడు ఈ చంద్రబాబు. చదవండి: ‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’ తప్పుదోవలో సీబీఐ విచారణ: సీబీఐలో పనిచేస్తున్న కీలకమైన అధికారులు కొందరు రహస్య వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడి ఉద్దేశపూర్వకంగా తప్పుదోవలో విచారణ చేస్తున్నారని మేం ముందునుంచి చెబుతూనే వస్తున్నాం. ఇవాళ హైకోర్టు బెంచి మీద నుంచి జడ్జి గారు కూడా ఇవే సీబీఐని ప్రశ్నించారు. సీబీఐ అధికారి ఎవరైతే ఉన్నారో.. ఆయన గుడ్డలూడదీసేలా జడ్జిగారు ప్రశ్నించిన సంగతి అందరం చూశాం కదా..? సీబీఐ ఏవిధంగా తప్పుడు దర్యాప్తు చేస్తున్నారో.. ఉద్దేశపూర్వకంగా ఎంపీ అవినాశ్ గారిని, జగన్ గారిని టార్గెట్ చేసి బురదజల్లే కుట్రగా సమాజానికి అర్ధమయ్యేటట్లు ఈరోజు హైకోర్టు చెప్పింది. సీబీఐలో ఉన్న ఒక కీలక అధికారి, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఎత్తుగడల్లో భాగంగానే ఆయనతో చేతులు కలిపి జగన్ గారిపై రాజకీయంగా కక్షసాధింపు తీర్చుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సంగతిని సమాజానికి కూడా మేం తెలియజేస్తున్నాం. నౌ ఆర్ నెవర్ బాబుకు అధికారం రాదు చంద్రబాబు ఎన్ని పిల్లిమొగలేసినా ఆయనకు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం అనేది రాదు రాదు. ఇది రాసిపెట్టుకోవాల్సిన వాస్తవం. 2019 ఎన్నికలతోనే ప్రజలు ఆయన రాజకీయ సమాధిని పేర్చారు. కనుక, ఆయన భ్రమల్లో బతకడమే గానీ ఎన్ని ఆసనాలు వేసినా... అధికారంలోకి రావడం కలేనని బాబు ఒప్పుకోవాల్సిందే. -
టీడీపీ చేస్తోంది మహానాడు కాదు.. మాయనాడు: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: టీడీపీ చేస్తోంది మహానాడు కాదు.. మాయనాడని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌పై చెప్పులేసినందుకు క్షమాపణ కోరుతూ తీర్మానం చెయ్యాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలు ఎన్ని ప్రకటించిన ప్రజలు నమ్మరని.. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో ముందు చెప్పాలన్నారు. సీఎం జగన్‌పై విమర్శలు చేయడానికే మహానాడు పెట్టినట్టున్నారని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో ఎక్కడికైనా అచ్చెన్నాయుడు వస్తే పేదల ఇళ్లు ఎలా కడుతున్నారో చూపిస్తామని స్పష్టం చేశారు. మహానాడు ప్రసంగంతో చంద్రబాబు అసహనం బయటపడిందన్నారు. అమ్మ ఒడి లాంటి ఒక్క పథకమైన చంద్రబాబు పేద పిల్లల కోసం తీసుకొచ్చాడా అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబం ఫోటో ఒక్కటైన మహానాడు ప్రకటనలో ఉందా అని ప్రశ్నించారు. చదవండి: ‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’ -
టీడీపీ మహానాడు వేదికగా కార్యకర్త నిరసన
-
పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేస్తే.. వేదికపైకి పిలవరా..?
బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో పొందూరు మండలం దళ్లవలసకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరైన దృశ్యమిది. పార్టీకి మంచి ఊపు వచ్చిందని.. జనాలంతా టీడీపీవైపే ఉన్నారంటూ చంద్రబాబు హడావుడి చేసిన సందర్భమిది. కానీ, అప్పట్లో ఆ సభకు జనాల్లేక కుర్చీలు వెలవెలబోయాయి. ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. సాక్షాత్తు చంద్రబాబు హాజరైన సభకొచ్చిన దుస్థితి ఇది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అటు చంద్రబాబు హాజరైన సభ, ఇటు టీడీపీ జిల్లా కేడర్ అంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మినీ మహానాడు సభ చూస్తే టీడీపీకి అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. తమకు వాపు తప్ప బలం లేదనే విషయం టీడీపీ కేడర్‌కు, ఆ పార్టీ శ్రేణులకు బోధపడుతోంది. బయట ఎంత హంగామా, హడావుడి చేసినా.. జనాల్లోనే కాదు టీడీపీ సానుభూతి పరుల్లో కూడా ఆదరణ లేదని విషయం అర్థమయ్యేలా గత ఏడాది చంద్రబాబు సభ, ఈ ఏడాది మినీ మహానాడు సభ తేటతెల్లం చేసింది. నమ్మినోళ్లను మోసగించడమే తప్ప చేసేందేమీ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందనే వాదన జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకీ పరిస్థితి..? ఓట్లేసిన ప్రజల్నే కాదు పార్టీని నమ్ముకుని పనిచేసే నాయకులకు కూడా విలువ లేకపోవడంతోనే టీడీపీకి ఈ దుస్థితి అని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. అధికారంలో ఉన్నంత సేపు ప్రజల్ని మోసగించాం, కష్టపడి పనిచేసే కేడర్‌ను నియంతృత్వ పోకడతో ఇబ్బంది పెడుతున్నాం, ఇక సభలకు, సమావేశాలకు జనాలు, పార్టీ శ్రేణులు ఎందుకొస్తారు, ఎవరు తీసుకొస్తారనే వాదన ఆ పార్టీలోనే మొదలైంది. వాస్తవంగా టీడీపీ మినీ మహానాడును భారీ జన సమీకరణతో నిర్వహించాలని జిల్లా నాయకత్వం భావించింది. అందుకు తగ్గ సన్నాహాక సమావేశాలు కూడా నిర్వహించుకుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఎంతమందిని తీసుకురావాలి అనేదానిపై ప్లాన్ చేసుకున్నారు. కానీ, వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. ప్రజలే కాదు టీడీపీ సానుభూతి పరులు కూడా ఆసక్తి చూపలేదు. మినీ మహానాడుకు ముఖం చాటేశారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు విశ్లేషించుకుంటున్నాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత హడావుడి చేసినా స్పందన లేకపోవడం చూసి ఇంతవరకు తమకున్నది వాపే తప్ప బలుపు కాదనే విషయం స్పష్టమవుతోందని పలువురు చర్చించుకున్న పరిస్థితి కన్పించింది. గొండు, మామిడిలకు అవమానం శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల నుంచి టికెట్ రేసులో ఉన్న గొండు శంకర్, మామిడి గోవిందరావు, కలిశెట్టి అప్పలనాయుడే ప్రస్తుతం పార్టీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. తమకు టిక్కెట్ వస్తుందన్న ఆశతో భారీగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ అధిష్టానం గానీ, జిల్లా నాయకత్వం గానీ గుర్తించడం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున పార్టీ గుర్తించక మానదా అని లక్షలు ఖర్చు పెట్టి, పార్టీ ఫండ్ కింద లక్షలాది రూపాయలిచ్చి ప్రజల్లో ఉంటున్నారు. ఎంతో కొంతమందిని తమవైపు తిప్పుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీరిని కూడా జిల్లా నాయకత్వంతో పాటు అధిష్టానం తరచూ అవమానాలకు గురి చేస్తోంది. కరివేపాకులా గొండు శంకర్‌ను శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసిపారేస్తుండగా, పాతపట్నంలో యూజ్ అండ్ త్రో మాదిరిగా పార్టీ కోసం ఖర్చు పెట్టించుకుని మామిడి గోవిందరావును వదిలేస్తున్నారు. ఇక, ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాకపోతే, కాశీకి వెళ్లడం వలన కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం మినీ మహానాడుకు హాజరు కాలేదు. అదే ఆయనకు అదృష్టమని చెప్పాలి. లేదంటే తీవ్ర అవమానానికి గురయ్యేవారేమో!. వేదికపైకి పిలవరా..? టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మినీ మహానాడుకు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు తదితర కీలక నేతలు రావడంతో తమ బలం చూపించి, అధిష్టానం మెప్పు పొందుదామని భావించిన గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకు తీవ్ర అవమానమే ఎదురైంది. కార్యక్రమం కోసం భారీగా ప్లెక్సీలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తమ బలం చూపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి తమ వెంట వచ్చిన జనాన్ని తీసుకొచ్చారు. కానీ, జిల్లా నాయకత్వం వీరిని కనీసం గుర్తించలేదు. పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి, కార్లతో శ్రేణులను తీసుకొచ్చిన గొండు శంకర్‌ను, మామిడి గోవిందరావును వేదికపైకి పిలవలేదు. కిందనే కూర్చోమని హుకుం జారీ చేశారు. దీంతో గొండు శంకర్, మామిడి గోవింద వెంట వచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులను వాడుకుని వదిలేస్తారా? అని ఒక్కసారిగా వారి అనుచరులు అంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వచ్చిన కొద్దిపాటి కార్యకర్తలు కూడా వెళ్లిపోవడంతో మినీ మహానాడు సభా ప్రాంగణమంతా ఖాళీ కుర్చీలతో బోసిపోయింది. గొండు శంకర్‌కు, మామిడి గోవిందరావుకే కాకుండా టీడీపీకి అవమానకరంగా సభ సాగింది. టీడీపీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభ ఇది. టీడీపీ పెద్దలంతా హాజరైన సభకు భారీగా జన సమీకరణ చేశారు. జనం అదే ట్రీట్మెంట్ ఇచ్చారు. అధికారంలో ఉండగా మేలు చేయని పార్టీ...మళ్లీ ఏదో చేస్తుందని ఎలా నమ్మగలమంటూ ప్రజలే కాదు ఆ పార్టీ శ్రేణులు కూడా మొఖం చాటేశాయి. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా వెలవెలబోయాయి. జనం లేక చాలాసేపు సభను ప్రారంభించలేని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. -
చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ దారుణాలే
-
చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నా చిన్నప్పటి నుంచి గుడివాడలో నన్ను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ కలిసొచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఈ మేరకు సాక్షి టీవీతో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌కు, టీడీపీకి సంబంధం లేదని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాసిన విషయం వాస్తవం కాదా?. ఎన్టీఆర్ నుంచి పార్టీ గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు.. ప్రజా నాయకుడు. బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టింది నేనే. విగ్రహం శిలాఫలకంపై నాపేరు వాళ్లకి కనిపించలేదా. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ రంగు ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగు లైనా వేసుకోవచ్చు' అని కొడాలి నాని పేర్కొన్నారు. చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ గుడివాడలో రేపటి టీడీపీ మినీ మహానాడు రద్దుపై కొడాలి నాని సెటైర్స్ వేశారు. 'చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయడం చంద్రబాబు తెలివి తక్కువ తనానికి నిదర్శనం. చంద్రబాబు సాంప్రదాయాలు పాటించడం తెలుసుకోవాలని కొడాలి నాని సూచించారు. చదవండి: (Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం) -
అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. మహానాడు వేదికగా అన్నదమ్ముల మధ్య ఫ్లెక్సీల వివాదం జనార్దన్‌ను అప్రతిష్టపాలు చేయగా.. తాజాగా కొత్తపట్నం మండలంలోని మత్స్యకార నేతలు ఆయన తీరుపై భగ్గుమంటున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతింటిలోనే అసమ్మతి కుంపటితో దామచర్ల తలపట్టుకుంటున్నారు. కేడర్ చేజారిపోకుండా నానా తంటాలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. మహానాడు వేదికగా సోదరుడితో గొడవలు బహిర్గతమై అందరిలో నవ్వుల పాలైన మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఇప్పుడు చివరకు ద్వితీయ శ్రేణి నాయకుల ఛీత్కారాలకు గురవుతున్నారు. అసలే అంతంత మాత్రంగా పార్టీ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక వైపు సొంతింటి సెగ, మరో వైపు పార్టీలో అసమ్మతిరాగం దామచర్ల రాజకీయ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చింది. మహానాడు ఫ్లెక్సీల ఏర్పాటులో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదాలు పార్టీ పరువు తీశాయంటూ ఓవైపు టీడీపీ అధిష్టానం దామచర్లపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసారి టికెట్టు తనకే కావాలంటూ సోదరుడు సత్య కేడర్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ జారిపోకుండా నానా తంటాలు పడుతున్న మాజీ ఎమ్మెల్యే దామచర్లకు పార్టీ నేతల్లో పెళ్లుబుకుతున్న అసమ్మతి రాగం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మహానాడుతో వాపును చూసి బలుపు అనుకుంటున్న దామచర్ల సొంత పార్టీ నేతల్లో నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితిపై ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు దామచర్ల కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. అవి కూడా బెడిసి కొడుతుండటంతో భంగపాటుకు గురవుతున్నారు. కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి తద్వారా లబ్ధిపొందాలని చేస్తున్న ప్రయత్నాలు అతనికి తీవ్ర తలనొప్పి తెచ్చి పెడుతుండటంతో పార్టీ అధిష్టానం వద్ద పట్టుకోల్పోతున్నారనే చర్చ సాగుతోంది. మహానాడు సందర్భంగా ఫ్లెక్సీలు పీకేస్తున్నారంటూ లేని పోని ఆరోపణలు చేసి భంగపడిన దామచర్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో ఇక తన పనైపోయిందని గ్రహించి కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. అల్లూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గొడవలు సృష్టించి ప్రజల నుంచి వైఎస్సార్ సీపీకి, బాలినేనికి వ్యతిరేకత వస్తుందని చూపించే కుట్రకు తెర తీశారు. టీడీపీకి చెందిన నాయకులను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వద్దకు పంపి ఓ మహిళను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు దిగారు. దీన్ని బాలినేని దీటుగా తిప్పికొట్టడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. ఏదో ఒక విధంగా కుయుక్తులు పన్ని ప్రజల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ వరుసగా బెడిసికొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్నాడు. తాజాగా కొత్తపట్నం మండలం మడనూరులో మత్స్యకారుల వర్గానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నేతకు తెలియకుండా ఓ శుభకార్యానికి హాజరవడంతో ఆ పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. తమకు తెలియకుండా గ్రామంలోకి ఎలా వస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దామచర్ల వద్దకు వెళ్లకుండా ఆగిపోయారు. ఈ వ్యవహారం బెడిసి కొట్టిందని గ్రహించిన దామచర్ల సదరు నాయకుని ఇంటికి వెళ్లేందుకు యత్నించగా కనీసం ఇంట్లోకి కూడా రాకుండా అడ్డుకుని తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక అక్కడి నుంచి జారుకున్నారు. దామచర్ల నిర్వాకంపై సదరు నేత మత్స్యకార వర్గానికి చెందిన వారితో అసమ్మతి కుంపటి రాజేస్తుండటంతో ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది ఏకమై దామచర్లపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వెళుతుందనే ప్రచారం సాగుతోంది. ఒకవైపు ఒంగోలు నగర శివారులోని యరజర్ల వద్ద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు 25 వేల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రభుత్వ భూమిని సిద్ధం చేయగా, కోర్టు ద్వారా దాన్ని దామచర్ల ఆపించారని తెలుసుకున్న నిరుపేదలు అతనిని తీవ్రస్థాయిలో ఛీత్కరించుకున్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు వ్యతిరేకంగా మారిపోవడంతో పాటు సొంతిటిలోనే అసమ్మతి కుంపటి రాజుకుంది. అయ్యే జనార్దనా... ఏమిటి నీ పరిస్థితి అంటూ.. సొంత పార్టీ నాయకులే నవ్వుకుంటున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. -
ఇలాంటి ఒక రోజు వస్తుందని.. ఎప్పుడూ భావించలేదు: దివ్యవాణి
-
నక్కకూ... నాకలోకానికీ!
రాజకీయ నేతలు తాము అద్దాల మేడలో కూర్చున్నామనే వాస్తవాన్ని సదా గుర్తుంచుకుని మరీ రాజకీయాలు చేయాలి. ఎదుటివారి మీద తాము ఒక రాయి వేయాలని చూస్తే... అంతకు పదింతల రాళ్లు తమ అద్దాల మేడపై పడతాయి. మొన్నటి మహానాడులో చంద్రబాబు అబద్ధాల డోసు అమాంతంగా పెంచారు. విడ్డూరం ఏమిటంటే, సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు మాట్లాడటం. సాధికారత, పారదర్శకతలను ప్రస్తావించడం. వ్యవసాయం గురించి వల్లించడం. విద్య, వైద్య రంగాల గురించి నీతులు చెప్పడం. తాము సంక్షేమానికి ఏకంగా 51 శాతం నిధులు కేటాయించామనీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 41 శాతమే నిధులు సమకూర్చిందనీ కాకిలెక్కలతో కనికట్టు చేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ ప్రచారమూ అవసరం లేదు. గ్రామాల్లోకి వెళితే మార్పు కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ప్రజల అన్ని అవసరాలూ తీర్చే విధంగా గ్రామీణ వ్యవస్థ స్వరూపం సమూలంగా మారిపోతోంది. ఈ అభివృద్ధికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చంద్రబాబు సంక్షేమ పథకాలను విస్మ రించి, సామాజిక న్యాయాన్ని నట్టేట్లో ముంచి, పేదోడి సొంతింటి కలను కల్లలు చేసి, వ్యవసాయం దండగని ప్రకటించేసి, విద్య, వైద్య రంగాలను భ్రష్టుపట్టించి మరీ కార్పొరేట్ దోపిడీకి బాటలు పరచి, జన్మభూమి కమిటీల పేరిట టీడీపీ తమ్ముళ్ల దోపిడీకి రాజముద్ర వేశా రని తెలుగు నాట చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అలాంటి చంద్ర బాబు మహానాడులో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన మీద నిస్సిగ్గుగా బురద జల్లేందుకు యత్నించి నవ్వుల పాలయ్యారు. సొంత ఇల్లు అన్నది పేదోడి కలే కాదు, ఆత్మగౌరవానికి ప్రతీక అనే వాస్తవాన్ని చంద్రబాబు తాను సీఎంగా ఉన్నన్నాళ్లూ గుర్తించ లేదు. టిడ్కో కింద జీ+3 తరహాలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి పేదల నుంచి 300 చదరపు అడుగుల ఒక్కో ఇంటికి రూ. 2.65 లక్షల రుణాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించాలన్నారు. పేదలు వడ్డీతో సహా ఇంటి అప్పు తీర్చాలంటే 20 ఏళ్ల సమయం పడుతుందన్నది పట్టించు కోలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవే టిడ్కో ఇళ్లను పేదలకు కేవలం ఒక్క రూపాయికే పూర్తి హక్కులతో ఇస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కడుతోంది ఇళ్లు కాదు, ఏకంగా 17 వేల ఊళ్లు! పేదలం దరికీ ఇళ్ల పథకం కింద ఏకంగా 31 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. అమరావతిలో పేద లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరా వతిలో ‘సామాజిక సమతౌల్యం’ దెబ్బతింటుందని నిస్సిగ్గుగా టీడీపీ వాదించింది. పేదలు, దళితులు, బలహీనవర్గాలు అమరావతికి అవ తలే ఉండాలని చెబుతూ పెత్తందారీ పోకడలను ప్రదర్శించడం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకే చెల్లింది. మహానాడు వేదిక మీద చంద్రబాబు నోటినుంచి జాలువారిన మరో రెండు పదాలు – సామాజిక న్యాయం, సాధికారత. సీఎం హోదాలో ఉండి కూడా ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ప్రశ్నించి రాజ్యాంగ స్ఫూర్తినే అపహాస్యం చేయడం చంద్రబాబుకే చెల్లింది. నాయీ బ్రాహ్మణులను తూలనాడుతూ ‘తోక కత్తిరిస్తా’ అన్నా... మత్స్యకారులపై మండిపడుతూ ‘తోలు తీస్తా’ అని గెంటివేయించినా అది చంద్రబాబే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారు’ అని సీఎం హోదాలో ఏకంగా లేఖ రాయడం ద్వారా, తాను ఎంతటి బీసీ వ్యతిరేకో వెల్ల డించారు. ‘కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దంటుందా’ అని వివక్షాపూరితమైన వ్యాఖ్యలతో మహిళలను హేళన చేశారు. మహిళా తహశీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేకు కొమ్ముకాశారు. అటువంటి చంద్రబాబు సామాజిక న్యాయం, సాధికారత అంశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించడం రాజకీయ వైచిత్రి కాక మరేమిటి! వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక విప్లవాన్ని తీసుకు రావడమే కాదు... ఆ దిశగా దేశానికి దిశానిర్దేశం చేశారు. మంత్రి వర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించడం దేశంలోనే రికార్డు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారు. పెద్దల సభకు 50 శాతం మంది బీసీలను పంపిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు కనీసం 50 శాతం కేటాయించడమే కాదు.. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో ఆ వర్గాలకు 50 శాతం రిజర్వ్ చేస్తూ చట్టం చేయడం ద్వారా చరిత్ర సృష్టించారు. అనుభవజ్ఞుడిని అని ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నించే చంద్ర బాబు తాను సీఎంగా ఉన్నకాలంలో తీసుకువచ్చిన పరిపాలనా సంస్కరణ ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కటీ కనిపించదు. అందుకు భిన్నంగా వినూత్న సంస్కరణలతో పరిపాల నను ప్రజల గడప వద్దకు తీసుకువెళ్లిన జగన్మోహన్రెడ్డి అంటే ఆయనకు కంటగింపుగానే ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 15,400 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు వలంటీర్ వ్యవస్థ ద్వారా మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజల ముంగి టకు తీసుకువచ్చింది. ప్రభుత్వం అంటే ఎక్కడో రాజధానిలో బ్యూరోక్రాట్ వ్యవస్థ గుప్పిట్లో ఉంటుందన్న భ్రమలను తొలగిం చింది. ఇంతటి విప్లవాత్మక వ్యవస్థను ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రజల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగా చూడటం చంద్ర బాబు నైజం. తమకు ఓటు వేస్తేనే... ఇంటిపై టీడీపీ జెండా కడితేనే... ప్రభుత్వ పథకాలు అందిస్తామన్న దుర్నీతిని టీడీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా పాటించింది. అందుకోసం ఏకంగా జన్మభూమి కమిటీలు అనే రాజ్యాంగేతర వ్యవస్థను ఏర్పాటు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే... దాంతో వారు సిఫార్సు చేస్తేనే ఏ ప్రభుత్వ పథకమైనా అందుతుంది. లేకుంటే అర్హులు అయినప్పటికీ జాబితాలో పేర్లు ఉండవు. అటువంటి చంద్రబాబు నుంచి పారదర్శకతను ఆశించడం నేతి బీరలో నెయ్యి కోసం వెతికిన చందంగానే ఉంటుంది. అందుకే పారదర్శకంగా అర్హులు అందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఆయన సమ్మతిం చలేకపోతున్నారు. పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శిస్తుండటం... అర్హులు ఎవరికైనా పథకాలు అందక పోతే వెంటనే సరిచేసి వారికి కూడా అందిస్తుండటమన్నది మింగుడు పడటం లేదు. అందుకే కిందపడ్డా తనదే పైచేయి అని నమ్మించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకత లేదంటూ అవాస్తవిక ఆరోప ణలతో ఎదురుదాడికి దిగారు. కానీ ప్రజలు వివేకవంతులు. చంద్ర బాబు కువిమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 శాతం పార దర్శకతతో... నేరుగా నగదు బదిలీ పథకాల(డీబీటీ) ద్వారా ఏకంగా రూ. 1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసింది. పరోక్ష నగదు బదిలీ(నాన్–డీబీటీ) పథకాల రూపంలో రూ. 43,682.65 కోట్లు ప్రయోజనం కలిగించింది. మొత్తం మీద రాష్ట్రంలో అర్హులైన ‘9.58 కోట్లమంది’ లబ్ధిదారులకు రూ.1.41 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. చాలామంది లబ్ధిదారులు ఒకటి కంటే ఎక్కువ పథకాలకు అర్హులు కావడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో లబ్ధిదారుల కొనుగోలు శక్తి పెరిగింది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మరో దుర్మార్గం – విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేటీకరించడం. కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాసరే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. అటు వంటి చంద్రబాబు విద్యా రంగం గురించి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించడమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువస్తోంది. నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఫౌండేషన్ స్కూల్స్ (అంగన్వాడీ కేంద్రాలు), గురుకుల పాఠశాలలు కలిపి ఏకంగా 61వేల విద్యా సంస్థల రూపురేఖలను సమూలంగా మార్చి వేస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఈ మూడేళ్లలోనే కొత్తగా 6 లక్షల మందికి పైగా విద్యార్థులు చేరడం వైఎస్సార్సీపీ విధానానికి ప్రజలు తెలిపిన ఆమోదమే. తల్లులు తమ పిల్లల్ని బడులకు పంపేందుకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద రెండు దశల్లో రూ.13 వేల కోట్లు పంపిణీ చేశారు. మూడో దశ కింద రూ. 6,500 కోట్లు పంపిణీకి సిద్ధమవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సంస్క రించి జగనన్న గోరుముద్ద పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తు న్నారు. జగనన్న విద్యా కానుక కింద మూడు జతల యూనిఫాం, షూ, బెల్డ్, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల కిట్ ఇస్తున్నారు. 100 శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన పథకంతో పాటు హాస్టల్ విద్యార్థులకు ఏటా రూ. 20 వేల చొప్పున జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నారు. ఉపాధి అవకాశాలు కలిగించేలా డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ ప్రవేశపెట్టారు. ఆ విధా నాన్ని ఏకంగా యూజీసీ కూడా అనుసరించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు నిదర్శనం. అన్నింటికంటే మించీ... పోటీ ప్రపంచంలో ప్రభుత్వ విద్యార్థులు నెగ్గుకు వచ్చేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం జగన్ ఘనత అయితే... దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం టీడీపీ దిగజారుడు రాజకీయాలను తేటతెల్లం చేస్తోంది. చంద్రబాబు వేటుకు నిర్వీర్యమైన మరో వ్యవస్థ ప్రభుత్వ వైద్య రంగం. ప్రభుత్వ వైద్య రంగం శిథిలాల మీద కార్పొరేట్ వైద్య సామ్రాజ్యాన్ని నిర్మించిన శిల్పి చంద్రబాబే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏనాడూ ఒక డాక్టర్‌ను నియమించడంగానీ, మౌలిక వసతులు సమకూర్చడంగానీ, తగినన్ని మందులు సరఫరా చేయడంగానీ చేయనే లేదన్నది చేదు నిజం. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లు వెచ్చిస్తూ ప్రభుత్వ వైద్య వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తోంది. కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో వసతులు మెరుగుపరుస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు చేస్తుండటంతోపాటు... పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో అయిదు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఏకంగా దండగ అని సూత్రీకరించి చంద్రబాబు పూర్తిగా విస్మరించిన రంగం వ్యవసాయం. వ్యవసాయ రుణాల మాఫీ అని నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత హామీని గాలికొదిలేసిన చరిత్ర ఆయన సొంతం. అటువంటి చంద్రబాబు ప్రస్తుతం రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం విడ్డూరం. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, మద్దతు ధర లేక టీడీపీ ప్రభుత్వంలో అన్నదాత అన్ని విధాలుగా నష్టపోయారన్నది కఠోర సత్యం. అందుకు భిన్నంగా వ్యవసాయాన్ని పండుగ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిస్సిగ్గుగా చంద్రబాబు విమర్శలు చేస్తుండటం ఆయన రాజకీయ దిగజారుడుతనం కాక మరేమిటి? వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువస్తూ 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నెలకొల్పింది. విత్తు నుంచి విపణి వరకు అన్నీ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అన్నీ అందిస్తోంది. ఈ–పంట నమోదు చేస్తోంది. పంటలను కొనుగోలు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుండటంతోపాటు అంతర్జాతీ యంగానూ ప్రశంసలు పొందుతూ అవార్డులు గెలుచుకుంటున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను, కంపెనీలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తూ ఇ–ఫార్మ్ మార్కెట్ విధానాన్ని తెచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. మూడేళ్లలో 50.10 లక్షలమంది రైతు కుటుంబాలకు రూ.23,875 కోట్ల పెట్టుబడి సహాయం అందించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఏ మీడియా ప్రచారం అవసరం లేదు. గ్రామాల్లోకి వెళితే మార్పు ప్రజల కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ప్రజల అన్ని అవసరాలూ తీర్చే విధంగా గ్రామీణ వ్యవస్థ స్వరూపం సమూలంగా మారిపోతోంది. ఏ గ్రామానికి వెళ్లినా రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. గ్రామ సచివాలయంలో ఏకంగా 745 సేవలు అందుతున్నాయి. సకల వసతులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఫౌండేషన్ స్కూల్స్‌గా రూపాం తరం చెందిన అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆటపాటలతో విద్యను నేర్చుకుంటున్నారు. ఆ సమీపంలోనే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ప్రజల ఆరోగ్య అవసరాలను తీరుస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉంటూ వైద్యం చేస్తున్నారు. అక్కడే మందులు ఉచితంగా ఇస్తున్నారు. మండలానికి ఒక్కోటి చొప్పున 108, 104 వాహనాలతో పాటు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రజలకు ముఖ్యమైన విద్య, వైద్య, వ్యవసాయ అవసరాలన్నీ గ్రామాల్లోనే తీరుతున్నాయి. గ్రామీణ వ్యవస్థ సుభిక్షంగా ఉంది. పట్టణాల అవసరాలు తీరుస్తూ, పారిశ్రామిక రంగానికి ముడిసరుకు అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలుస్తోంది. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలన్న మహాత్ముని మాటను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తోంది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. – వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి -
‘మహానాడులో చంద్రబాబుకు ఆ ఏడుపు మరీ ఎక్కువైంది’
సాక్షి, అమరావతి: మహానాడు దేనికోసం నిర్వహించారో అర్థం కాలేదని.. ప్రభుత్వంపై బురద చల్లేందుకే మహానాడు జరిగినట్టుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విష ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. బీసీ మంత్రుల బస్సు యాత్రను చూసి ఓర్వలేకపోయారన్నారు. మహానాడులో అన్నీ అబద్ధాలే చెప్పారని ధ్వజమెత్తారు. చదవండి: నారా లోకేశ్ టీమ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ‘‘ఏదో ఎన్నికల్లో గెలిచినట్టు మహానాడులో హడావుడి చేశారు. ప్రభుత్వంపై పడి ఏడవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. మహానాడులో ఆ ఏడుపు మరీ ఎక్కువైంది. ఏపీ సీఎం హోదాలో జగన్ దావోస్ సదస్సులో పాల్గొన్నారు. దావోస్ ఒప్పందాలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు. సీఎం జగన్ హుందాగా వ్యవహరించే వ్యక్తి. చంద్రబాబులా జగన్ ప్రగల్భాలు పలికే వ్యక్తి కాదు. ప్రజలకు మేలు చేకూర్చే పథకం ఒక్కటైనా బాబు తెచ్చారా?. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడంతోనే ఈ ఏడుపు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. -
బీసీలంటే టీడీపీకి ఎందుకంత ద్వేషం..?
సాక్షి,సీటీఆర్ఐ (కాకినాడ): బీసీలంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ద్వేషమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం మంజీర కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ‘పేదల సంక్షేమ సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా పెద్ద పీట వేయడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మంత్రులు నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రను అవహేళన చేసేలా నారా లోకేశ్ మాట్లాడారని, ఆ మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి వేణు అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహానాడును బూతుల వేదికగా మార్చారన్నారు. ఎంత ఎక్కువగా తిడితే అంత చంద్రబాబు దృష్టిలో పడవచ్చని ఆ పార్టీ నాయకులు భావించారన్నారు. నారా లోకేశ్ ఒక అడుగు ముందుకేసి సామాజిక న్యాయభేరిలో పాల్గొన్న బీసీలను అవహేళన చేసేలా మాట్లాడటం చాలా దారుణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే బీసీలకు మంత్రి పదవులు, నామినేటేడ్ పోస్టులు దక్కాయని చెప్పారు. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడం లోకేశ్‌కు ఇష్టం లేదన్నారు. టీడీపీకి ఏనాడో బీసీలు దూరం అయ్యారని మంత్రి అన్నారు. చదవండి: Complaint Against Nara Lokesh: నారా లోకేశ్‌కు బిగ్ షాక్.. పోలీసులను ఆశ్రయించిన మాజీ టీడీపీ నేత -
మహానాడు కాదు.. ఏడుపునాడు
పార్వతీపురం టౌన్: తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తు న్నది మహానాడు కాదు.. ఏడుపు నాడు అని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడు పేరుతో ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులు ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు ఆద్యంతం సీఎంను, ఆయన కుటుంబా న్ని దూషించడమే లక్ష్యంగా సాగిందన్నారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, బీసీలకు కల్పించిన ప్రయోజనాలను, భవిష్యత్తులో ఏమి చేస్తారో చెప్పకుండా ప్రభుత్వంపై బురదజల్లడ మే పనిగా పెట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లోని లబ్ధిదారులకు 95 శాతం మేర సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ఆయా వర్గాల నుంచి వస్తున్న విశేష స్పందనను చూసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మానసిక స్థైర్యం కల్పించేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. అదే ఆనాడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల కార్యక్రమం కింద ఏమీ చేస్తామో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం చేసి చూపించారన్నారు. తమ నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సమ్మర్ స్టడీస్.. ఇంట్లోనే చదవండి ఇలా!) -
బాబు మాట కళా నోట
-
మహానాడులో మైండ్‌లేని మాటలు
ఏఎన్‌యూ (గుంటూరు): టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి చంద్రబాబు, లోకేశ్ తదితర నాయకులంతా మైండ్‌లేని మాటలే మాట్లాడారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం ప్రభుత్వాన్ని, వైఎస్సార్సీపీని తిట్టడానికే మహానాడు పెట్టుకున్నట్లున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేస్తున్న మంత్రుల బృందం శనివారం మధ్యాహ్నం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొద్దిసేపు బస చేసింది. బృందాన్ని కలిసేందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఏం చేస్తుందో మహానాడు వేదికగా చెబుతారేమోనని చూశామని, కానీ అది ఎక్కడా కనిపించలేదని న్నారు. ఏ అజెండా లేని పార్టీ టీడీపీ అని మహానాడు వేదికగా మరోసారి నిరూపించుకున్నారన్నారు. 2017లో వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహించామని, ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారని అన్నారు. అలా చెప్పే ధైర్యం, అంకితభావం టీడీపీకి లేవనేది మహానాడులో స్పష్టమైందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ వైఎస్సార్సీపీపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. బాలకృష్ణవి ఘాటు వ్యాఖ్యలు కాదని.. పిచ్చి వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. -
టీడీపీకి మహానాడు జాకీలు
సాక్షి, అమరావతి: పాతాళానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీని కొద్దిగానైనా పైకి లేపి రాజకీయ రేసులో ఉన్నామని చెప్పుకొనేందుకు చంద్రబాబు మహానాడు ద్వారా తాపత్రయపడ్డారు. నిస్తేజంలో కూరుకుపోయిన శ్రేణులు, భవిష్యత్తుపై బెంగతో అస్త్ర సన్యాసం చేసిన నాయకుల్ని కదిలించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానిక ఎన్నికల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస పోటీ కూడా ఇవ్వలేక దారుణంగా ఓడిపోవటంతో పార్టీ యంత్రాంగం నీరసించిపోయింది. చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా నాయకులు, శ్రేణులు పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా ఏదో ఉన్నామని చూపించుకోవడం తప్ప పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మెజారిటీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు కూడా లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు, మంత్రుల్లో నలుగురైదుగురు మినహా మిగిలిన వాళ్లెవరు మూడేళ్లుగా బయటకు రాలేదు. దీంతో కొంత కాలంగా యువతకు అవకాశం పేరుతో జూనియర్ నాయకులను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్ని కొంతైనా కదిలించాలని ప్రయత్నించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బూతులు, తిట్లు పార్టీ ముందడుగు కోసం నిర్వహించే మహానాడు వేదికను పూర్తిగా బూతులమయంగా మార్చివేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని నోటికి వచ్చినట్లు కొందరు నేతలతో మాట్లాడించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వ్యతిరేకించి అభూత కల్పనలతో బురద జల్లేందుకు మహానాడును ఉపయోగించుకున్నారు. అందులో భాగంగానే ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేసి ప్రతి దాన్ని తిట్లు, శాపనార్థాలతో నింపేశారు. మరోవైపు మహానాడు ముగింపు సభకు కార్యకర్తలు రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు వారం ముందు నుంచే తప్పుడు ప్రచారానికి దిగారు. బస్సులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, ఇతర నేతలు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి నియోజకవర్గాల వారీగా నాయకులకు టార్గెట్లు ఇచ్చి కచ్చితంగా అంతమందిని ఒంగోలుకు తీసుకురావాలని ఆదేశించారు. అంతమందిని తేలేమని చాలామంది చేతులెత్తేయడంతో జనం రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ ముందస్తుగా ప్రచారాన్ని లేవనెత్తారు. ఎన్టీఆర్‌కు దక్కని సముచిత గౌరవం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహానాడులో ఆయనకు మాత్రం సముచిత గౌరవం ఇవ్వలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రతి మహానాడులో తీర్మానం చేస్తున్నారు. అయితే, ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడులో ఈ తీర్మానమే లేదు. ఆయన పేరును చెప్పుకోవడానికే నేతలు పరిమితమయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం తప్ప ఆయన్ను గౌరవించేలా ఒక్క పనీ చేయలేదు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించింది. సీఎం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు. -
విషవృష్టి యాగం..!
చెప్పాలని ఉంది... గొంతు విప్పాలని ఉంది. తెలుగుదేశం పార్టీ నలభయ్యేళ్ల ప్రస్థానం గురించీ, ఆ ప్రయాణంలోని మలుపుల గురించీ ఇప్పుడు క్లుప్తంగానైనా మాట్లాడుకోవాలి. తాజాగా ఆ పార్టీ ‘మహానాడు’ పేరుతో ఓ విషవృష్టి యాగాన్ని నిర్వహిం చింది. ఆ విబూదిని రాష్ట్రమంతటా చల్లక ముందే... తొలకరి వర్షాలతో కలిపి అది విషపు చుక్కల్ని కురిపించకముందే... విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఆ పార్టీని పెట్టిన ఎన్టీ రామా రావుకు ఇది శతజయంతి సంవత్సరం. పార్టీ వయసు 40 సంవత్సరాలు. అందువల్ల కూడా ఇది మాట్లాడుకోవలసిన సందర్భం. పదేళ్ల కింద వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూటికి 70 మంది నలభయ్యేళ్ల లోపువారే. కనుక తెలుగు రాష్ట్రాల్లోని నూటికి డెబ్బయ్ మందికి తెలుగుదేశం పార్టీ ప్రయాణంలోని పదనిసల గురించిన లోతైన అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఆ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసు కొచ్చిన ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ణి చేసి చంద్రబాబు 27 సంవత్సరాల క్రితం గద్దెనెక్కాడు. ఇప్పుడు నలభయ్యేళ్లున్న వారు కూడా అప్పటికింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ‘మహా నాడు’ హంగామాలను చూసి తెలుగుదేశం నాయకులంతా ఎన్టీ రామారావు శిష్యులనీ, భక్తులనీ, అనుచరులనీ వారు భ్రమించే అవకాశం ఉన్నది. అనారోగ్య కారణాలతో ఎన్టీ రామారావు తప్పుకొని స్వయంగా ఆయనే చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించాడని యెల్లో మీడియా కథలల్లడానికి ఇంకెంతో కాలం పట్టదు. అందువల్ల ఈ నలభయ్యేళ్ల కథను ఖుల్లం ఖుల్లా చెప్పుకోవాలి. రెక్కల గుర్రంపై ఎగిరొచ్చే కలల రాకుమారుడి కథలాంటిది ఎన్టీ రామారావు సినీ జీవితం. జానపదుల జనరంజక కథా నాయకుడు. దేవతామూర్తుల పాత్రల్లో ఒదిగిపోయిన స్ఫుర ద్రూపం. అద్భుతమైన నటపాండిత్యం. వెరసి తెలుగు నిఘంటు వులో హీరో అనే మాటకు అర్థం అతను. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు’ అనే బిరుదును ఆయన అభిమానులు ఇవ్వలేదు. భజన బృందం తగిలించింది కాదు. శృంగేరీ పీఠానికి సంబంధించిన యతీశ్వరులు స్వయంగా చేసిన ప్రశంస అది. ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే ఎన్టీఆర్ సినిమాలు రాబట్టిన కలెక్షన్లు ఇప్పటికీ రికార్డులే! ఒక డజన్ సూపర్ డూపర్ హిట్స్‌తో ఆయన తన 60వ ఏట సినీరంగం ఇన్నింగ్స్‌ను ముగించారు. ఇంతటి ప్రజాదరణ ఉన్నది కనుకనే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను రాజకీయాల్లో పరీక్షించుకోదలుచుకున్నారు. రాజకీయాల్లో నెగ్గుకురావడానికి ప్రజాదరణ ఒక్కటే సరిపోదు. పరిస్థితులు కూడా కలిసిరావాలి. ఎన్టీఆర్‌ను అదృష్టం వరించింది. ఆ సమయానికి పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత ఏర్పడుతున్నది. బలమైన ప్రతిపక్షం లేని రాజకీయ శూన్యత ఆవరించి ఉన్నది. అప్పటి పత్రికా రంగం నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అసలే ఎన్టీఆర్. ఆపై రోడ్డెక్కారు. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పదజాలం కత్తులు దూసింది. రాజకీయాల్లోకి కొత్త నరేటివ్ వచ్చి చేరింది. ఈ మార్పు జనానికి కూడా నచ్చింది. ఫలితంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సూపర్‌హిట్ ఎన్టీఆర్ ఖాతాలో వచ్చిపడింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో చదువుకున్నవాడు కాబట్టి ఎన్టీ రామారావుపై జాతీయ భావాలు, ఆదర్శాల ప్రభావం కొంత ఉన్నది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్ఏటి) పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి ప్రదర్శనలిచ్చేవారు. విద్యార్థి రోజుల నుంచే కష్టపడి సంపాదించుకునే తత్వం. సినిమాల్లో కూడా రేయింబవళ్లు పనిచేశారు. ఏటా పది పన్నెండు సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి హీరో ఎన్టీఆర్ తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. ఆయన పోషించిన వందలాది ఉదాత్త, జనోద్ధారక పాత్రల ప్రభావం కూడా ఉండేది. ముఖ్యమంత్రిగా పరిపాలనలో పేదలకు, కష్టజీవులకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. చౌకబియ్యం ఇవ్వడంతోపాటు రైతుల విద్యుత్ ఛార్జీలను తగ్గించారు. పాలనా సంస్కరణలను ప్రారంభించారు. మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్ – పట్వారీ లేదా కరణం – మునసబుల వ్యవస్థ రద్దు – ఈ సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఎన్టీ రామారావు అనుసరించిన పేదల అనుకూల విధా నాలపై తెలుగుదేశం పార్టీలోనే కొందరు ముఖ్యులకూ, పార్టీకి అండగా నిలబడిన మీడియా మొగల్స్కూ సదభిప్రాయం లేదన్న సంగతి తదనంతర కాలంలో బయటపడింది. సదరు మీడియా మొగల్స్, బిజినెస్ మౌర్యాస్, సంపన్న నిజామ్స్.... అంతా కలిసి చంద్రబాబు రింగ్ లీడర్‌గా ఒక ముఠాను తెలుగుదేశం పార్టీలో తయారుచేసుకున్నారు. ’89 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఈ ముఠా పట్టు బిగిసింది. పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో ఉండే అన్ని కమ్యూనికేషన్ చానల్స్ ఈ ముఠా అధీనంలోకి వచ్చాయి. వయోధిక దశలో ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్‌కు సహాయ కురాలిగా ఉన్న లక్ష్మీపార్వతి మరో కమ్యూనికేషన్ చానల్‌గా మారవచ్చని ముఠా శంకించింది. ఆమెపై దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమెకు వ్యతిరేకంగా మెదళ్లలో విష బీజాలు నాటి కన్నబిడ్డల్ని సైతం ఎన్టీఆర్‌కు దూరం చేశారు. తనకు తోడుగా ఉన్నందుకు నిందలు మోస్తున్న మహిళకు అండగా నిలవడమే తన తక్షణ ధర్మంగా ఎన్టీఆర్ భావించారు. తిరుపతి బహిరంగ సభలో వేలాదిమంది సమక్షంలో ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబు ముఠా పార్టీపై ఎందుకు పట్టు బిగించిందో, నాయకుని కమ్యూనికేషన్ ఛానల్స్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నదో, లక్ష్మీపార్వతిని వెళ్లగొట్టడానికి ఎందుకు ప్రయత్నించిందో... 94 ఎన్నికల తర్వాత అర్థమైంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు కొంతమేరకే ఉపయోగం తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం సాధ్యపడదని బాబు అండ్ మొగల్స్ ముఠాకు అవగాహన ఉన్నది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి. అందుకోసం టిక్కెట్లలో సింహభాగం తమ నమ్మకస్థులకే దక్కాలి. ఇదీ కుట్ర. అయితే చివరి దశలో ఎన్టీఆర్ అప్రమత్తం కావడంతో కొంతమేరకు మాత్రమే వారి ఎత్తుగడ ఫలించింది. పైగా అరకొర మెజారిటీ కాకుండా ఎన్టీఆర్‌కు అఖండ విజయం సిద్ధించింది. కుట్ర అమలుకు కొన్ని నెలలు ఎదురు చూడవలసి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు నమోదు చేసిన నెలరోజులకే యెల్లో మీడియా ఎజెండాను పైకి తీసింది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్టు, కార్యకర్తలతో దూరం పెరిగినట్టు ప్రచారం మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే వ్యతిరేకత ఎట్లా వచ్చిందనే ప్రశ్నకు ఇక్కడ తావుండదు. యెల్లో మీడియా వార్తలకు తర్కంతోగానీ, హేతువుతోగానీ, వాస్తవికతతో గానీ సంబంధం ఉండదు. వేడివేడి బజ్జీలు వేయడం మార్కెట్లోకి వదలడం మాత్రమే దానికి తెలిసిన విద్య. ప్రచారం పీక్స్‌కు చేరగానే తాము టిక్కెట్లి ప్పించగా ఎన్టీఆర్ వేవ్‌లో గెలిచిన ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను ఈ ముఠా వైస్రాయ్ హోటల్‌కు పంపించేసింది. ఆ వెంటనే ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా 70 మంది ఎమ్మెల్యేలు ఆ హోటల్లో సమావేశమయ్యారని ప్రచారం మొదలుపెట్టారు. గంటగంటకూ ఆ స్కోర్ పెంచుతూపోయారు. ఏం జరుగుతోందో చూసి వెళ్దామని వచ్చిన ఎమ్మెల్యేలను అక్కడే బంధించారు. కొందర్ని బెదిరించి పిలిపించారు. మీడియా సహకారంతో తెల్లారేసరికల్లా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. గవర్నర్ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్టిచ్చి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసి, స్పీకర్‌ను చేసిన యనమల ఎన్టీఆర్‌కు మాట్లాడే హక్కును సైతం తృణీకరించారు. సైకిల్ గుర్తు, టీడీపీ జెండా, బ్యాంక్ డిపాజిట్లతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదనీ, అవన్నీ బాబు పార్టీకి చెందుతాయనీ హైకోర్టు కూడా చెప్పేసింది. ఎదురుగా వెళ్లే ధైర్యం లేక వృద్ధసింహాన్ని మోసపూరితంగా బంధించి బోనులో పెట్టారు. తనవాళ్లే తనకు ద్రోహం చేయడాన్ని ఊహించలేకపోయిన ఎన్టీఆర్ షాక్‌కు గురయ్యారు. మనోవేదనతో కృశించి అనతికాలంలోనే ఆయన చనిపోయారు. ఆయన ఇంకొంతకాలం జీవించి ఉంటే ఈ ముఠాకు గుణపాఠం చెప్పి ఉండేవారు. ’94 ఎన్నికల్లో ఎన్టీఆర్ అండతో రెండు కమ్యూనిస్టు పార్టీలూ కలిసి 32 సీట్లు గెలుచుకున్నాయి. 1962 తర్వాత కమ్యూనిస్టులు ఇన్ని సీట్లు గెలిచిన సందర్భం మొదటి సారి, చివరిసారి కూడా ఇదే! అయినా ఆ పార్టీలు కృతజ్ఞత చూపెట్టలేదు. టీడీపీ ఆంతరంగిక వ్యవహారమని ముఖం చాటేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు మద్దతు ప్రకటించాయి. కమ్యూనిస్టులు తన సహజ మిత్రులనీ, తనకు బావగార్ల వరసవుతారనీ ఎన్టీఆర్ ఆప్యాయంగా చెప్పు కున్నారు. ఆ బావల నిర్వాకం చూసి ఆయన అవాక్కయ్యారు. కృత్రిమ సంక్షోభం తలెత్తిన వెంటనే కమ్యూనిస్టులు ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికావాళ్లు జపాన్‌పై వేసిన ఆటమ్ బాంబ్‌తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తి కలిగిన హైడ్రోజన్ బాంబులు ఇప్పుడున్నాయి. ఎన్టీఆర్ మీద యెల్లో ముఠా చేసిన కుట్రను ఆటమ్ బాంబుతో పోల్చితే, అదే ముఠా సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అమలుచేస్తున్న కుట్రను హైడ్రోజన్ బాంబుతో పోల్చ వచ్చు. 27 ఏళ్ల కిందట కుట్రపూరితంగా అధికారం చేపట్టిన ఈ ముఠా ఆ కుట్రలూ కుహకాల్లో ఆరితేరి హైడ్రోజన్ బాంబులు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రజాసంక్షేమం, ప్రజల వద్దకు పాలన, బలహీన వర్గాల సాధికారత అనే అంశాల్లో ఎన్టీఆర్ నలభయ్యేళ్ల కింద ఒక అడుగువేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 40 అడుగులు వేశారు. ఈ విధానాలకూ, యెల్లో ముఠాకూ అస్సలు పొసగదు. ఈ ముఠాకు తన వర్గ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు అండ్ కో వైఎస్ రాజశేఖర రెడ్డిపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ఈ ముఠాకు ఎనిమీ నెంబర్ వన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, సామర్థ్యాన్ని, కమిట్ మెంట్‌నూ అందరికంటే ముందుగానే ఈ ముఠా గుర్తించింది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడానికి ముందే ఆ పార్టీ అధిష్ఠానంతో చేతులు కలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో షరీకై తప్పుడు కేసులు మోపడానికి రంగం సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే కేసుల కుట్రను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన గులామ్ నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మేము జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఆఫర్ చేశాము. కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము. మాట వినకపోతే జైలుకు పోవలసి వస్తుందని కూడా చెప్పాము. అయినా మాట వినలేదని ఆజాద్ అన్నారు. మాట వింటే అందలమెక్కిస్తాం, వినకపోతే జైలుకి పంపిస్తామని సాక్షాత్తూ ఢిల్లీ సామ్రాజ్ఞి చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కావలసింది సమాచారం కాదు. కామన్సెన్స్! జైలుకు పంపించే తప్పేమీ తాను చేయలేదని తన అంతరాత్మకు తెలుసు గనుక ఆయన పెద్దల బెదిరింపులకు జంకలేదు. తన ప్రయాణాన్ని తాను ఎంచుకున్నారు. ఆనాటి నుంచీ గడిచిన పదకొండేళ్లుగా యెల్లో ముఠా తన సర్వశక్తుల్నీ జగన్మోహన్ రెడ్డి పైనే కేంద్రీకరించింది. ఈ కాలంలో ఆయన మీద విష ప్రచారానికి కేటాయించిన న్యూస్ ప్రింట్నంతా ఒక పక్కన పడేసి వుంటే ఆ రెండు పత్రికలకు ఇంకో ఏడాదిపాటు ఆ న్యూస్ ప్రింట్ సరిపోయేది. విష ప్రచారాలతో, పొత్తుల ఎత్తులతో, నెరవేర్చని హామీలతో 2014 ఎన్నికల్లో జగన్ పార్టీని ఈ కూటమి ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడించగలిగింది. దీనికి సమాధానంగా వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల్లో 10 శాతం ఓట్ల తేడాతో టీడీపీని ఓడించింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో 50 శాతం ఓట్లను సంపాదించి సాధించిన విజయం. ఈ విజయంతో పోల్చదగిన విజయాలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో రెండే రెండున్నాయి. ఒకటి కమ్యూ నిస్టులతో పొత్తు పెట్టుకొని 1994లో ఎన్టీఆర్ సాధించిన గెలుపు. రెండోది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో సాధించిన గెలుపులో ఇందిరమ్మ ప్రభంజనం వీస్తున్న సమయంలో 1972లో కాంగ్రెస్ సాధించిన అసెంబ్లీ విజయం. అప్పుడు కాంగ్రెస్‌కు బలమైన ప్రతిపక్షం కూడా లేదు. ఇండిపెండెంట్లే ప్రతిపక్షం. మూడేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి సాధిం చిన కళ్లు చెదిరే విజయం కంటే కూడా ఆయన పరిపాలనా దక్షత యెల్లో కూటమికి ఎక్కువ కలవరపాటును కలిగిస్తున్నది. సామాజిక ఆర్థిక మార్పు సాధనంగా ఆయన రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్న తీరుకు దేశవిదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది. మహిళలూ, బలహీన వర్గాల సాధికారత విషయంలో జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలబడింది. రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ఒక అధ్యయనాంశంగా మారింది. ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని, ఆర్బీకేల పనితీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు బృందాలుగా ప్రతినిధులు వచ్చిపోతున్నారు. ఊరి స్వరూపం మారుతున్నది. ప్రతి పల్లె పట్టణ సొబగులను అద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో సహజంగానే వైఎస్సార్సీపీ బలం గత ఎన్నికల కంటే ఇప్పుడు పెరిగింది. యథాతథంగా ఎన్నికలు జరిగితే వైసీపీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. ఇతర పార్టీలతో జట్టు కట్టినా సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీకి యాభై శాతం కంటే ఎక్కువ ఓటింగ్ బలం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం లోకి రావడం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే అడ్డదారులు తొక్కడానికి సిద్ధపడింది. పాతమిత్రుల ప్రత్యక్ష, పరోక్ష సహకారాలతో సామాజిక విభజన కార్యక్రమానికి చాలాకాలం కిందనే శ్రీకారం చుట్టింది. పేద వర్గాల ప్రజ లందరూ ఒకవైపున సంఘటితం కాకుండా కులాల పేరున, మతాల పేరున విడిపోయి విద్వేషాలను విరజిమ్ముకొనేలా రెచ్చగొట్టే పథకానికి తెరతీసింది. ఎక్కడెక్కడ అటువంటి అవకాశాలుంటాయో పరిశీలించడానికి గతంలోనే కొన్ని రెక్కీలను నిర్వహించారు. కోనసీమలోని అంతర్వేదితో ఒక రెక్కీ ఆపరేషన్ జరిగింది. రామతీర్థంలో రెక్కీ జరిగింది. గుంటూరులో జిన్నా టవర్స్ పేరుతో ఒక రెక్కీ జరిగింది. ఇప్పుడు కోనసీమలో ఒక యాక్షన్ అమలుచేశారు. కోనసీమలో దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రకులాల వాళ్లు తరతరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. వ్యావసాయికంగానే కాక విద్యాపరంగా కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ అభివృద్ధి అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. చిన్న చిన్న తగాదాలు, వ్యక్తిగత పంచాయతీలు, పంతాలు పట్టింపుల వంటివి మాత్రమే వివిధ వర్గాల మధ్య పొడసూపుతున్నాయి. అప్పుడప్పుడు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇవేమీ పరిష్కరించ లేనంత తీవ్రమైన సమస్యలు కావు. కానీ వీటినే ఆసరా చేసుకొని ఇక్కడ విషం చిమ్మే క్రీడను ఈ కూటమి ప్రారంభించింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో వేళ్లన్నీ అటువైపే చూపు తున్నాయి. ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దళితులకూ – ఇతర కులాలకూ మధ్య, బీసీలకూ – ఇతరులకూ మధ్య, మైనారిటీలకూ – ఇతరులకూ మధ్య కృత్రిమ సమస్యలు సృష్టించి చిచ్చుపెట్టే వికృత క్రీడను ప్రారంభించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా, వినాశకరంగా పరిణ మించబోతున్న ఈ పాపాన్ని ప్రజలంతా ఉమ్మడిగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. శనివారం నాడు ఒంగోలులో జరిగిన ‘మహానాడు’లో పాలక పార్టీపై విద్వేషాన్ని రెచ్చ గొట్టడం తప్ప పేదవర్గాలను సాధికారం చేయగల ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయారు. కోనసీమకు అంబేడ్కర్ పేరుపై తన వైఖరేమిటో చెప్పకుండా నిజస్వరూపాన్ని చూపెట్టారు. ఇదొక హెచ్చరిక. సాధించిన విజయాలను నిలబెట్టుకోవడానికి పేద వర్గాలు సంఘటితం కావలసిన అవసరం ఉన్నది. బలహీన వర్గాల నాయకుల బస్సు యాత్రలు ఆహ్వానించవలసిందే! కానీ అదే చాలదు. పేదవర్గాల ప్రజ లందరూ ఐకమత్యంగా గ్రామగ్రామానా చైతన్య యాత్రలు జరపవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక – సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయవలసి ఉన్నది. అన్ని కులాలు, వర్గాల మధ్య సమైక్యతనూ, సౌభ్రాతృత్వాన్నీ నిలబెట్టవలసి ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టీడీపీలో అంతర్గత పోరు.. మహానాడు సాక్షిగా బీసీ నేతకు అవమానం
టీడీపీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ మహానాడు సాక్షిగా ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. నిన్నటి వరకూ ఫ్లెక్సీల వివాదం నడిస్తే.. నేడు నగరంలోని పార్టీ కార్యాలయాల అంశంలోనూ వర్గ విభేదాలు వెలుగు చూస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడి కార్యాలయాన్ని మహానాడుకు వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కన్నెత్తి చూడకపోవడంతో వెలవెలబోతోంది. గుంటూరు రోడ్డులోని దామచర్ల కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులు, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. ఇదేమి సామాజిక న్యాయం అంటూ సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీకి మహానాడు అనేది ఒక పండుగలాంటిది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడ జరుగుతోంది. దాదాపు రెండు వారాలుగా పార్టీ ముఖ్య నాయకుల హడావిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ హడావిడి ఇసుమంతైనా కనపడలేదు. దీంతో భాగ్యనగర్‌లోని ఆ కార్యాలయం వెలవెలబోతోంది. ఈ వైపు టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వెలవెలబోవటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పాత గుంటూరు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయం మాత్రం కళకళలాడుతోంది. చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్ బీసీలకు టీడీపీ గుండెకాయ వంటిది అని చంద్రబాబు నిత్యం చెబుతుంటారు. టీడీపీకి బీసీలు వెన్నుపూసలాంటి వారు అని కూడా ఆయనే వల్లెవేస్తుంటారు. కానీ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే పదవులు ఎరవేయడం, ఆ తర్వాత వారిని అవమానించడం టీడీపీలో కొత్తేమీ కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీకి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ కార్యాలయానికి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు మాత్రం నేతి బీరకాయలో నేతి చందంగా తయారయ్యాయి. ఆ పార్టీ పండుగలా మహానాడును నిర్వహిస్తున్న సమయంలోనూ భాగ్యనగర్ మూడోలైన్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ఓ అనాథలా వెలవెలబోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ నగరానికి వచ్చి వెళ్తున్నారు. బాలాజీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక్కసారి వచ్చి వెళ్లారు. జనార్దన్ ఆఫీసు కళకళ: ఒంగోల మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు చెందిన పాత గుంటూరు రోడ్డులోని కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులతో, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. మహానాడుకు వచ్చిన ముఖ్య నేతలు కూడా అక్కడికే వచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన నేత దామచర్ల జనార్దన్ కావటమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మరి జిల్లా పార్టీ కార్యాలయం ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటూ ఆ పార్టీలోని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. జనార్దన్ అసలు జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదు. జనార్దన్ ఆయన పార్టీ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. టీడీపీలో బీసీలకు పేరుకే పదవులు..అధికారం మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనన్న వాదనలు అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ బలంగా వినిపిస్తోంది. మరి జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటం ఎందుకు, నూకసాని బాలాజీని ఈ విధంగా అగౌరవ పరచటం ఎందుకని బీసీలకు చెందిన కొందరు నేతలు నేరుగానే ప్రశి్నస్తున్నారు. ఏదిఏమైనా మహానాడు వేదికగా బీసీ నేతకు తీవ్ర అవమానం జరిగిందనే చెప్పాలి. ఫ్లెక్సీల్లో కూడా.. మహానాడు సందర్భంగా ఒంగోలు నగరం మొత్తం టీడీపీ ముఖ్య నేతలతోపాటు ఇతర నాయకుల ఫొటోలతో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా బీసీ నేత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి తీవ్ర అవమానం జరిగింది. ఏ పదవులు లేని వారి ఫొటోలను సైతం తాటికాయంతా సైజుల్లో వేసుకున్న ఫ్లెక్సీలో ఏ ఒక్కచోట కూడా బాలాజీ ఫొటోలు ఆ సైజులో లేకపోవడం గమనార్హం. కొన్నింటిలో అయితే బాలాజీ ఫొటోలే లేవు. -
సీఎంను తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు: మంత్రి అంబటి రాంబాబు
-
వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయలు. చంద్రబాబు ఓ విష సర్పం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. అది మహానాడు కాదు.. మోసపునాడు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోంది’’ అని ఆరోపించారు. -
జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: మహానాడులో చంద్రబాబు నాయుడు మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శనిగ్రహం చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు అనుకుంటున్నారని, ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిచిపోతుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఏ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. 2018లోనే జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టారని, ఐనా సరే ఇంకా రాజకీయాలలో తిరుగుతున్నాడని విమర్శించారు. ‘ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాని వ్యక్తి చంద్రబాబు. అమలాపురంలో తన మనుషులతోపాటు తనతో తిరిగే నిక్కర్ల బ్యాచ్‌తో ఇళ్లు తగులపెట్టించారు. మహానాడులో అడ్రస్ లేని వాళ్లని కూర్చోపెట్టుకున్నారు. సీఎం జగన్ గట్టిగా చూస్తేనే పరారయ్యే వారిని పక్కన కూర్చోపెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. సీఎం జగన్ తాను చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక శాతం పదవులు ఇచ్చారు. వారందరినీ రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తున్నారు. రాష్ట్రంలో 50% బడుగులకు న్యాయం చేస్తుంటే జగన్‌ను ఎందుకు ఓడించాలి? బడుగులను వదిలేసి రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ప్రాధాన్యత ఇవ్వాలా? బస్సు యాత్ర మీద కూడా చంద్రబాబు విషం కక్కుతున్నారు. ఈ 420 మాట్లాడే మాటలను ఎవరూ విశ్వసించరు. కోట్లు ఖర్చు చేస్తూ చేసుకునే మహానాడుకి, బస్సుయాత్రకు సంబంధం ఏంటి? నీ కొడుకుని కూడా గెలిపించుకోలేని దద్దమ్మవి. ఎన్టీఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమి కొట్టాలి. చదవండి: ‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’ -
చంద్రబాబు చెప్పే అబద్దాలు ప్రజలు నమ్మరు: బొత్స
-
మామను చంపిన ‘బాబు’ ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మామను(నందమూరి తారక రామారావు) చంపి తద్దినం పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు. చంద్రబాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. మహానాడులో చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మళ్లీ అధికారంలోకి వస్తానని చంద్రబాబు కలలు కంటున్నారు. చంద్రబాబు కంటే ఉన్మాది పాలన ఎవరిది అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు