కోనసీమ: రాజమహేంద్రవరంలో తెలుగుదేశం మహానాడు జరుగుతున్న సమయంలో కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు వందమంది కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వెనుకబడిన వర్గాల(బీసీ)కు చెందిన వీరు వైఎస్సార్ సీపీ తీర్థం తీసుకున్నారు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని చినగూళ్లపాలెం గ్రామం నుంచి కేతా శ్రీను ఆధ్వర్యంలో, కొత్తపాలెం కాలనీ నుంచి రాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోపాలపురం తరలివెళ్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు.
వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులం కావడంతో పాటు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పలు సమస్యలు పరిష్కరించడం, అనారోగ్య బాధితుల పట్ల స్పందిస్తున్న తీరు తమకు నచ్చి వైఎస్సార్ సీపీలో చేరామన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ మీరు ఏ నమ్మకంతో వచ్చారో అందుకు అనుగుణంగానే పనిచేస్తానని అన్నారు. కొత్తపేట పీఏసీఎస్ పర్సన్ దంగేటి సుబ్రహ్మణ్యం (డీఎస్), పంచాయతీ సభ్యుడు బొక్కా లోకేష్, పార్టీ బీసీ విభాగం నాయకులు రాయుడు కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment