సాక్షి, అమరావతి: చంపిన చేతుల్తోనే దండేసి దండంపెట్టడం చంద్రబాబుకే చెల్లిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహానాడు పేరిట ఈరోజు రాజమండ్రిలో చంద్రబాబు వెకిలిచేష్టలు చూశాం. పిచ్చిప్రేలాపల్ని విన్నాం. మహానాడు వేదికపై ఒకపక్క ఎన్టీరామారావు విగ్రహం పెట్టి ఆయన చిత్రపటానికి దండ వేసి చంద్రబాబు దండం పెట్టారు. పాపం, ఈ రోజు ఎన్టీరామారావు ఆత్మ రాజమండ్రి మహానాడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఈ సందర్భంగా ఎన్టీరామారావు దేవుడ్ని ఒక వరం కోరుకుంటారు. అదేమంటే, ‘నిండు నూరేళ్లు జీవించాల్సిన నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను సమాధి చేసిన చంద్రబాబు.. నాకు దండ వేయడమేంటి..? నాకు దండం పెట్టడమేంటి..? అని.. నాకు గానీ దేవుడు మరలా ప్రాణం పోస్తే.. నన్ను కిరాతకంగా వెన్నుపోటు పొడిచి, నా నడ్డివిరిచి, నా పార్టీని లాక్కొని మానసికంగా తీవ్రంగా క్షోభపెట్టి సమాధి చేసిన చంద్రబాబును ఆ వేదిక మీదనే కొట్టికొట్టి చంపి సమాధి చేస్తాను.. అందుకు నాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు.
చంద్రబాబు ఆయన తోక నాయకులు కలసి ఎంత దిగజారిపోయారు..? రాజకీయాల్లో ఒక వ్యక్తిని రాళ్లతో, కర్రలతో, చెప్పులతో కొట్టడమేంటి..? ఆ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా పతనం చేసి చంపడమేంటి..? మరలా అదే వ్యక్తి శతజయంతి ఉత్సవాల పేరిట మీరు చంపిన వ్యక్తిని.. మీ చేతులతో నిలువునా వెన్నుపోటు పొడిచి పొట్టనబెట్టుకున్న నాయకుడికే మీరు చేతులెత్తి దండం పెట్టి దండలేయాల్సిన దౌర్భాగ్యం మీకు పట్టిందా..? మరీ ఇంత దుర్మార్గమా..? అని అడుగుతున్నాను. ఎన్టీరామారావు పేరు, ఆయన ఫొటోలేకుండా వేదికమీద కూర్చోలేని నాయకులు వీళ్లు’’ అంటూ మంత్రి మండిపడ్డారు.
చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త
నూరేళ్ళు బతకాల్సిన నాయకుడిని సమాధి చేసి..
నూరేళ్ళు బతకాల్సిన నాయకుడ్ని 28 ఏళ్ళ క్రితమే సమాధి చేసేసి, ఆయన ఆయుర్థాయాన్ని తగ్గించి, చివరి దశలో అవమానించి, పదవి లాక్కుని, వెన్నుపోటు పొడిచి, ఒకరకంగా హత్య చేసిన తర్వాత, ఈరోజు శత పురుషుడ్ని - శక పురుషుడ్ని.. స్మరించుకుంటూ డ్రామాలు ఆడటం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాదు. ఇప్పుడు రాజమండ్రిలో నడుస్తున్నది ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డ్యాన్స్ మాత్రమే తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదు.
- ప్రజలకు ఏం చేశారన్నది మహానాడు ఎజెండాలోనే లేదు.
- టీడీపీ మహానాడు తీర్మానాలు అంటూ 153 పేజీల మెటీరియల్ పబ్లిష్ చేశారు. చంద్రబాబు అనే చెవిటివాడి చెవిలో శ్రీకృష్ణుడు అనే ఎన్టీఆర్ శంఖం ఊదుతున్నట్టుగా మొదటి పేజీ పబ్లిష్ చేశారు.
- ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ఎన్టీఆర్ కు ముందు-తర్వాత అంటూ తెలుగువారి చరిత్ర అని రాశారు, బాగుంది.
- చంద్రబాబు ముందు-తర్వాత అనే తెలుగువారి చరిత్ర చాప్టర్ మాత్రం లేదు.
- 153 పేజీల ముసాయిదా తీర్మానాల పుస్తకంలో మేము మా పరిపాలనలో ఈ మంచి చేశాం అని లేదు.
- చంద్రబాబు పేరు చెబితే.. ఈ పథకం గుర్తుకు వస్తుందని ఒక్క వాక్యం కూడా లేదు.
- 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల, ఒక పేద ఇంటికి పలానా మంచి జరిగిందని ఒక్క చాప్టర్ కూడా రాయలేకపోయారు.
-పైగా, 2014-19 మధ్య రైతు రుణాలన్నీ మాఫీ చేసేసినట్టు, కౌలు రైతులకు కూడా రుణ మాఫీ జరిగినట్టు, పంటల బీమా ఏటా ఇచ్చినట్టు, ఇవ్వని సున్నా వడ్డీ రుణాలు ఇచ్చినట్టు, పూర్తి చేయని ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్టు, పాడి పరిశ్రమ కూడా వర్థిల్లినట్టు.. రాశారు.
- నిజానికి 5 ఏళ్ళ చంద్రబాబు పాలనలో సగటును ఏడాదికి 300 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు.
- అంటే రాష్ట్రంలో ఉన్న మండలాల్లో సగం.. 5 ఏళ్ళూ కరవే.
పేదల ఇళ్ళనూ అవమానించారు
- ఇక, పథకాలకు సంబంధించి అమ్మ ఒడి కన్నా గొప్ప పథకాన్ని తాము ఇచ్చినట్టు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ రద్దు చేసినట్టు, బెల్టు షాపులు లేవన్నట్టు, మద్యం ధరల్ని నియంత్రించినట్టు అందులో రాశారు.
- టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమిని కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వకపోయినా, ఇచ్చేశాం అని రాశారు.
- తాను పడుకోవడానికి కూడా ఇళ్ళు సరిపోవని అచ్చెన్నాయుడు అంటే.. తన టాయిలెట్ కూడా ఇంతకంటే పెద్దదిగా ఉంటుందని లోకేశ్ అంటే.. ఈ ఇళ్ళను సమాధులతో పోల్చాడు చంద్రబాబు నాయుడు.
- దిశ యాప్ వల్ల మహిళలకు కలుగుతున్న రక్షణను పక్కన పెట్టి, అలాంటి యాప్ లేకపోవడం వల్లే చంద్రబాబు- పాలన బాగుందని చెప్పారు.
- టీడీపీ హయాంలో మొత్తంగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు, 5 ఏళ్ళలో కలిపి 30 వేలు. జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు.
-టీడీపీ పాలనలో పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు లేవు.. అని తెలిసినా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఖాతా రాసుకున్నారు.
- ఇప్పుడు మరోసారి బీసీలకు డిక్లరేషన్ అని కొత్త వాగ్దానాలతో కొత్త డ్రామా మొదలు పెట్టారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా వారి చేతికి మీరు ఏమి అందించారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా... రూ. 2.10 లక్షల కోట్ల డీబీటీ ద్వారా జగన్ గారి పాలనలో అందిన ప్రయోజనాలతో పోలికే లేకుండా, ఎస్సీలకు న్యాయం చేసేశామని పద్దు రాసుకున్నారు.
- ఇలా మొత్తంగా చూస్తే.. పూర్తిగా డ్రామా తప్ప, పచ్చి అబద్ధాలు తప్ప.. ఈ మహనాడులో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఏమీ లేవు.
చతికిలపడిన సైకిల్ అది
తెలుగుదేశం పార్టీ ఇంకా జనాల్లో బతికే ఉందనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నాడు. 2019 ఎన్నికల్లోనే ఆపార్టీకి జనం సమాధి కట్టారని ఆయన తెలుసుకోవాలి. మరలా సైకిల్‌కు పూర్వవైభవం తెస్తానని బాబు రంకెలేయడం పనికిమాలిన కార్యక్రమమే.. ఆ సైకిల్ ఎప్పుడో చతికిలపడిందని .. పార్టీలేదు.. బొక్కా లేదంటూ స్వయంగా ఆపార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్న చెప్పిన సంగతిని అందరూ గుర్తెరగాలి. బాబు చెబుతున్నట్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ తెస్తాడంట. అది ఎక్కితే మహానాడు వేదిక నుంచి నేరుగా గోదాట్లోకి పోవడమేనని బాబు తెలుసుకోవాలి.
మేనిఫెస్టో అంటే విలువలేని నేత బాబు
మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు అసలు విలువుందా..? 2014కు ముందు 600 పైచిలుకు హామీలతో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేసి మాట నిలబెట్టుకున్నాడా..? అని నిలదీస్తున్నాను. బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆదరణ, ఇతర పథకాల పేరుతో బీసీలను అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలే బాగుపడ్డారు గానీ బీసీల్ని బానిసలుగా చూసిన బాబు వాళ్ల మేలు కోసం ఏరోజూ పాటుపడలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల్ని పట్టించుకోని బాబు, ఎన్నికల సమయం వచ్చేసరికే బీసీల జపం చేయడం రివాజుగానే వస్తుందని నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. రకరకాల మాయమాటలతో మళ్లీ బీసీల్ని బురిడీ కొట్టించడానికి బాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎన్ని ఎత్తుగడలేసినా బీసీ సోదరులు మాత్రం టీడీపీ పక్షాన ఉండరన్నది యదార్థం. ఎందుకంటే, బీసీల తోకలు కత్తిరిస్తానన్నది ఈ మహానుభావుడేనన్న విషయం ప్రతీ ఒక్క బీసీ సోదరుడు గుర్తుకుతెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను.
బీసీలే బాబును తరిమితరిమి కొడతారు
ఈరోజు రాష్ట్రంలోని బీసీవర్గాలన్నీ సంఘటితమయ్యాయి. ఇన్నాళ్లకు తమను ఆదరించే నాయకుడు వచ్చాడని.. అన్నివర్గాల పెద్దన్నగా జగన్ గారు నిలిచారని బీసీసోదరులు నమ్మారు. కనుకనే, వైఎస్‌ఆర్‌సీపీ ఇటీవల జరిపిన జయహో బీసీ మహాసభ విజయవంతంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టింది. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరింది. అందుకనే, పర్యటనల్లో బీసీ తమ్ముళ్లూ అంటూ రంకేలేస్తున్నాడు. ఎన్నికల సమయానికి ఓట్ల అవసరం వచ్చేసరికి ఆయన ఇప్పుడు బీసీల జపం చేస్తున్నారు. రాబోయే కాలంలో బీసీ కాలనీలకు వెళ్లి ఆత్మగౌరవం, సామాజికన్యాయం అనే పదాలు బాబు మాట్లాడితే.. ఆయన్ను బీసీలే చెప్పులు, రాళ్లు విసిరి తరిమితరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను.
బీసీలకు పెద్దన్న మా జగన్ గారు
ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని తిరుగుతున్నారు. బీసీలకు బాద్‌షాగా జగన్ గారు మాకు పదవులు, పనుల్లో పెద్దపీట వేయడం మూలానా మేమంతా సమాజంలో అత్యున్నతమైన జీవనశైలితో బతుకుతున్నాం. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ప్రతీ అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం తపనపడుతున్న మా జగన్‌గారు మా అందరికీ మనసున్న ముఖ్యమంత్రి.
చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే..
ఆ పేదలే బాబుకు, టీడీపీకి రాజకీయంగా పాతరేస్తారు
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎక్కడైనా పేదలకు సెంటు స్థలమిచ్చాడా..? టిడ్కో ఇళ్ల పేరుతో పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం నిజం కాదా.? వీటికి సమాధానం చెప్పే దమ్మూధైర్యం బాబుకు ఉందా..? అని నిలదీస్తున్నాను. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా నిరుపేద వర్గాల మహిళాసోదరీమణుల పేరుతో ప్రభుత్వం ఇళ్లపట్టాలిచ్చి.. వారికి నిలువ నీడను ప్రసాదిస్తే, ఈ చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ప్రభుత్వమిచ్చే ఇళ్ళ స్ఠలాల భూములను సమాధులతో పోలుస్తారా..? అందుకే, నేను ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను. ఈరోజు పేదవర్గాల కుటుంబాలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల పునాదుల్లోనే చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి సమాధి ఖాయమని హెచ్చరిస్తున్నాను. తమకు ఇళ్లు రాకుండా ఇన్నాళ్లూ రకరకాల కారణాలతో జాప్యం చేసిన చంద్రబాబు కుట్ర కుతంత్రాలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా తెలుసుకున్నారు. రేపటి ఎన్నికల్లో వారంతా కలసి చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీపై కసిదీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
బాబును నమ్మితే నట్టేటా మునిగినట్టే..
బాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది. ఆయన నయవంచన రాజకీయం ఇక చెల్లదు. చంద్రబాబును నమ్ముకుంటే ఎవరైనా నట్టేటా మునిగినట్టే. ఆయన్ను నమ్ముకున్న నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎన్టీఆర్ గారు మాదిరిగానే పైలోకాలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ఒక రియల్‌ఎస్టేట్ బ్రోకర్. అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాలకు ఒక వలయం పెట్టి పెత్తందారీ రాజ్యానికి చంద్రబాబు కాపలా ఉండి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు.
- పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అహంకార మనస్తత్త్వాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు. న్యాయస్థానాలు పేదల పక్షాన ఉన్నాయి కాబట్టి.. మా పక్షాన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి ధీరోధాత్తుడు నిలబడ్డారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలే విజయం సాధించారు. నిన్న పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలంతా వైఎస్‌ఆర్‌సీపీకి అండగా ఉండి ఎన్నికలు ఎప్పుడొచ్చినా 175 కి 175 స్థానాల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment