చంద్రబాబూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు: మంత్రి బొత్స | Botsa Satyanarayana On Chandrababu Naidu Fake Words At Mahanadu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టు: మంత్రి బొత్స

Published Sat, May 27 2023 5:57 PM | Last Updated on Sat, May 27 2023 9:40 PM

Botsa Satyanarayana On Chandrababu Naidu Fake Words At Mahanadu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్టీఆర్‌ చావుకు, ఆయన ఆత్మక్షోభకు కారణం చంద్రబాబేనని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ పెట్టిన ఒక్క పథకమైనా చంద్రబాబు కొనసాగించారా అని ప్రశ్నించారు. ఏ సంక్షేమ పథకాన్నైనా ప్రజలకు అందించారా అని నిలదీశారు.  14 ఏళ్లుగా సీఎంగా ఉండి ప్రజలను నిరు పేదలుగా మార్చారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్‌ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా అని విమర్శించారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్ప చంద్రబాబు చేస్తుందేంటని మండిపడ్డారు.

మంత్రి ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే
►చంద్రబాబునాయుడూ ఇక నీ డ్రామాలు కట్టిపెట్టి వాస్తవాల్లోకి రా..
► సినిమాల్లో ఎన్టీఆర్ నటుడు అయితే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు
►చంద్రబాబు ఏది చేసినా అన్నీ పబ్లిసిటీ కోసం..పత్రికల కోసం మాత్రమే. 
► ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు..ఏదైనా నేరుగా మాట్లాడు చంద్రబాబు
►నువ్వు అధికారంలో ఉన్న కాలంలో చెప్పుకోడానికి ఏదైనా ఉంటే చెప్పు
► ఎన్టీఆర్, వైఎస్సార్‌ లాంటి వారి పేరు చెబితే అనేక పథకాలు ప్రజల గుండెల్లో ఉండిపోయాయి. 
►అలాంటిది నీ పేరు చెప్తే గుర్తుండే ఒక కార్యక్రమం చెప్పగలవా..?
► గంటలు గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పుకుని వెళితే లాభం లేదు.
►ఎంతసేపూ జగన్‌ గారిని ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు చేస్తుంది ఏమీ లేదు. 
►జగన్‌ ధనవంతుడు అయ్యాడట..పేదలు నిరుపేదలు అయ్యారట..
► ప్రజలు నిరుపేదలుగా కావడానికి కారణం నువ్వు కాదా చంద్రబాబు. 
► సామాన్యులు ఇంకా అథోపాతాళానికి వెళ్లింది..కరువు వచ్చి ప్రజలు అల్లాడింది నీ హయాంలో కాదా..?
► బడుగు బలహీన వర్గాలు నీ వద్దకు వస్తే నువ్వు ఎంత హేళనగా మాట్లాడావో నీకు మళ్లీ చెప్పాలా..? 
►నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తాను అన్నది నువ్వు కాదా...
►ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది నువ్వు కాదా.?

ఏపీ జీఎస్‌డీపీలో మొదటి స్థానంలో ఉన్నది నిజం కాదా..?
►చంద్రబాబు పరిపాలనలో జీఎస్‌డీపీ 6.3 శాతంగా ఉండేది. 
►జగన్‌ అధికారంలోకి వచ్చాక జీఎస్‌డీపీ 7.5 శాతానికి పెరిగింది.
►ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా..? సామాన్యుడి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం కాదా..?
►బాబు హయాంలో రాష్ట్రం 22 వ స్థానంలో ఉంటే ఈ రోజు జీఎస్‌డీపీలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 
►ఎందుకు అన్నీ అబద్దాలు మాట్లాడతావు చంద్రబాబు..ప్రజలు వాస్తవాలు తెలియని అమాయకులు అనుకుంటున్నావా..?
►నువ్వున్నప్పుడు వ్యవసాయం మైనస్‌ గ్రోత్‌లో ఉండటం అబద్దమా..?
► రండి.. నువ్వు..నీ ఆర్ధిక మంత్రి ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉందా..? 
►వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో 8 శాతం వృద్ధి నమోదైంది. 
►ఆ రోజు చంద్రబాబును ఎరువులు అడిగిన రైతులు లేరు. పంటలను కొనుగోలు చేయండి అని అడిగివారే లేరు
►కారణం ఆయన కాలం అంతా కరువు కాటకాల మయం.
► వ్యవసాయం దండగ అన్న వ్యక్తి పాలనలో రైతులు, రైతు కూలీలు ఈ రాష్ట్రం విడిచి పారిపోయారు. 
► జగన్‌రు ముఖ్యమంత్రి అయిన తరవాత పుష్కలంగా వర్షాలు పడ్డాయి.. పంటలు కళకళలాడుతున్నాయి. 
►ప్రభుత్వం వ్యవసాయ దారునికి ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయం పుంజుకుంది. 
►రైతు బరోసా కేంద్రాల నుంచి అనే సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు అండగా నిలుస్తున్నాయి. 
చదవండి: ఎన్టీఆర్‌ కుటుంబాన్ని ముక్కలు చేసేందుకు శకుని వేషం వేసింది ఎవరు?

అధికారంలోకి వచ్చాక ఏం చేశామన్నది ముఖ్యం
►అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. 
►అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యం
►ప్రజల నమ్మకం ఏ రకంగా నిలబెట్టుకున్నామన్నది ముఖ్యం. 
►వైఎస్సార్‌ స్పూర్తితో జగన్‌ ఈ రాజకీయాల్లో అడుగుపెట్టి, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకున్నారు. 
►ప్రతి ప్రయోజనం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందేటట్లు పరిపాలన చేయబట్టే వ్యవసాయం విరాజిల్లుతోంది. 
►అది వ్యవసాయ దారుని ఆత్మస్థైర్యాన్ని పెంచడం కాదా..?

నీ హయాంలో ప్రభుత్వ విద్యార్థులకు స్టేట్‌ ర్యాంక్స్‌ వచ్చాయా..?
► అదికారంలో ఉన్నప్పుడు విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టావు చంద్రబాబు..?
►ఎప్పుడైనా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచనైనా చేశావా..? 
►ఎప్పుడైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న పిల్లల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు విద్యార్థులకు ధీటుగా వచ్చాయా..? ఇప్పుడు వచ్చాయి..
► నీ హయాంలో విద్యారంగంపై కేవలం రూ.19వేల కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మేం రూ.40 వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాం. 
►విద్యా, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అనేవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు
►విద్యపై పెట్టే ఖర్చు దేశానికి పెట్టబడి అని మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు భావించారు. 
►విద్య అంటే మొదటి స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం పేరు చెప్పేవారు. 
►ఇవాళ మన విద్యా రంగంలోని సంస్కరణలను దేశమంతా చెప్పుకుంటోంది.
► రేపు స్కూళ్లు తెరిచే లోపు డిజిటల్‌ విద్యా బోధనకు సర్వం సిద్ధం చేస్తున్నాం. 
►మన విద్యార్థి గ్లోబల్‌ కాంపిటీషన్లో ఉండాలంటే ఇంగ్లీషు మీడియం విద్య అవసరమని భావించి ప్రవేశపెట్టాం. 
►చంద్రబాబు హయాంలో రాష్ట్రం విద్యారంగంలో 24 స్థానంలో ఉంటే..జగన్‌ గారి హయాంలో 7వ స్థానానికి చేరాం. మొదటి స్థానానికి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. 

జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా బాబూ..?
► ఎంతసేపూ జగన్‌ను ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు తానేం చేశాడో చెప్పడం లేదు. 
►జిల్లాకో మెడికల్‌ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడైనా వచ్చిందా..? 
►ఇప్పుడు జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నారు. 
►రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భావించి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 
►ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ తీసుకుంటే దేశంలోనే మన రాష్ట్రం గత మూడేళ్లుగా నంబర్‌ 1 స్థానంలో ఉంది. 
►సచివాలయ వ్యవస్థలో లక్షా 40 వేల మందిని ఒకే సారి రిక్రూట్‌చేశాం. 
► పరిపాలనను ప్రతి గుమ్మం ముందుకు తీసుకెళ్లాం. 
►అవినీతి లేకుండా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.3 లక్షల కోట్ల వరకూ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లింది. 
►నీ హయాంలో ఈ డబ్బంతా ఏమైంది..? ఈ డబ్బంతా పెత్తందార్లకు దోచిపెట్టలేదా..? 
►నిత్యం అబద్దాలు చెప్తే జనం నమ్ముతారు అనుకోవద్దు. 

రాష్ట్రం ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అన్నావ్‌..మరి ఏం చేశావ్‌..?:
► నాకు పేద ప్రజల అండ, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని జగన్  అంటున్నారు. 
►మీ అండతోనే మళ్లీ నేను సేవ చేసే అవకాశంలోకి వస్తానని ధైర్యంగా చెప్తున్నాడు. 
►నువ్వు ఎప్పుడైనా ఇలా చెప్పావా చంద్రబాబు..? ఇప్పుడు మళ్లీ వస్తే ఏదో రిపేరు చేస్తాడట.
►గతంలో ఆంధ్రా ఇప్పుడే పుట్టిన పసిపాప...నాకు అనుభవం ఉంది అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు కదా..
► అప్పుడు ఏం చేశావ్‌..నీ తాబేదార్లు, నీ సామాజిక వర్గీయులకే దోచిపెట్టావు
►జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్నది మర్చిపోయావా చంద్రబాబూ
► ఆనాడు పింఛన్‌ రావాలంటే ఎవరు చచ్చిపోతారా అని వేచిచూడాల్సిన పరిస్థితిని మర్చిపోయావా..? 
► చంద్రబాబు తానేదో బ్రహ్మవాక్కు చెప్తున్నట్లు..దాన్నంతా రాష్ట్ర ప్రజలంతా నమ్ముతున్న ఫీలవుతున్నాడు. 
► మీరు ఎన్ని  మాట్లాడిన ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా 2018–19లో దానికంటే మిన్నగా తీర్చిదిద్దుతాం. 
►అట్టడుగున ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ అందరూ ఏపీ వైపు చూసేటట్లు చేస్తాం. 
►పేదవానికి ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందాలనేది ఈ ప్రభుత్వం విధానం. 
►ఎవరెన్ని అన్నా ఇదే విదానాన్ని కొనసాగిస్తాం..దానితోనే రాబోయే కాలంలో ప్రజల్ని మెప్పిస్తాం. 
►మళ్లీ సీఎం జగన్‌ అధికారంలోకి రావడం ఖాయం.. ఖాయం..
►చంద్రబాబు చెప్పే మాయమాటలు నమ్మెద్దు. 

ప్రశ్నలు–సమాధానాలు
► రోజుకో డ్రామా సీబీఐ ఆడుతుందా..? మేము ఆడుతున్నామా..? 
► ఒకే సారి కాగితాలన్నీ పెట్టొచ్చుగా..రోజుకోకటి పెట్టడం ఎందుకు..? 
►చంద్రబాబు ఎన్ని చేసుకున్నా ప్రజలు నమ్మే దశలో లేరు. 
►జగన్‌ రెండు అంశాల్లో ప్రజలు నమ్మారు. తన తండ్రిలా జగన్‌ గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మారు. 
►రెండోది ఆయన కొత్త వ్యక్తి.. ఈయనకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అని అధికారం ఇచ్చారు. 
►సీఎం చెప్పింది చేశాడు.. జనం నమ్మింది సార్ధకత చేశాడు. 
► చంద్రబాబు చెప్పింది ఎపుడైనా చేశాడా..? మ్యానిఫెస్టో ఇది అని ఎప్పుడైనా చూపాడా..? 
►మ్యానిఫెస్టో నా ఖురాన్, భగవద్గీత, బైబిల్‌ అని జగన్‌  అంటున్నారు. 
►చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం ఉందా..? 
► విశాఖ రాజధాని ఎప్పుడో వచ్చేసింది..వ్యక్తులు రావడమే మిగిలింది..

అమరావతి ఏమన్నా దేవేంద్రుని నిలయమా..?:
►అమరావతి అనేది ఏమైనా బ్రహ్మపదార్ధమా.? దేవేంద్రుని నిలయమా..? 
► సామాన్యుడు, పేదవాడు ఉండటానికి వీళ్లేదా..? 
► ఊరంటే ఒకే సామాజిక వర్గం ఉండాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా..? 
► ఊరంటే అన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిస్తేనే ఊరు
►అక్కడ ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి వారికి ఇక్కడ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం
చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement