సాక్షి, అమరావతి: టీడీపీ చేస్తోంది మహానాడు కాదు.. మాయనాడని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌పై చెప్పులేసినందుకు క్షమాపణ కోరుతూ తీర్మానం చెయ్యాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలు ఎన్ని ప్రకటించిన ప్రజలు నమ్మరని.. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారో ముందు చెప్పాలన్నారు.
సీఎం జగన్‌పై విమర్శలు చేయడానికే మహానాడు పెట్టినట్టున్నారని వ్యాఖ్యానించారు. 175 నియోజకవర్గాల్లో ఎక్కడికైనా అచ్చెన్నాయుడు వస్తే పేదల ఇళ్లు ఎలా కడుతున్నారో చూపిస్తామని స్పష్టం చేశారు. మహానాడు ప్రసంగంతో చంద్రబాబు అసహనం బయటపడిందన్నారు. అమ్మ ఒడి లాంటి ఒక్క పథకమైన చంద్రబాబు పేద పిల్లల కోసం తీసుకొచ్చాడా అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబం ఫోటో ఒక్కటైన మహానాడు ప్రకటనలో ఉందా అని ప్రశ్నించారు.
చదవండి: ‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’
Comments
Please login to add a commentAdd a comment