సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మి యజ్ఞం.. లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గొప్ప కార్యక్రమం అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. నాలుగు యాగశాలల్లో 600పైగా రుత్వికులు హోమాలు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి యజ్ఞం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి.
‘శ్రీమహాలక్ష్మీ యజ్ఞం మూడో రోజుకి చేరింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాం. హనుమాన్ జయంతి రోజు కావడంతో హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో నిర్వఁహించాం. ఈ మహాయజ్ణంలో క్రతువు నిర్వహించడంలో భాగస్వాములైనందుకు రుత్వికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు యాగశాలల్లో వేదపండితులు నాలుగు వేధాలని పఠించారు. యాగ శాలలలో జరిగే యజ్ణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాం. రాజస్ధాన్ నుంచి ఈ యాగానికి దేశీయ ఆవు నెయ్యిని తెప్పించాం. రాష్ట్ర ప్రజల అభివృద్దికి...ప్రజలు సుఖసంతోషాలకోసం, పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ యజ్ణాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment