SRI MAHALAKSHMI YAGNAM
-
‘యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు’
సాక్షి, తిరుమల: తమ ప్రభుత్వం శ్రీమహాలక్ష్మీ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించిందని,యజ్ఞ ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్ ప్రయత్నం సఫలం కావడంతో పెండింగ్ నిధులు వచ్చాయన్నారు. ‘ పీఠాధిపతులు సూచనల మేరకు కార్తీకమాసంలోశ్రీశైలంలో కుంభాభిషేకం. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను సంబంధిత ట్రస్ట్ బోర్డు నిర్వహించేలా కేబినెట్లో నిర్ణయం. ఆయా దేవాలయాలపై పర్యవేక్షణ దేవాదాయశాఖకు ఉంటుంది. లీజు ముగిసినా కోర్టును ఆశ్రయిస్తూ స్టేలు పొందే వారిపై 15 రోజుల నోటీసుతో చర్యలు తీసుకునేలా చట్ట సవరణను ఆమోదించాం. దేవాదాయ ఆస్తుల కాపాడుకోవడానికి చట్టసవరణ. చట్ట సవరణ ద్వారా గడువు ముగిసిన లీజు భూములను మార్కెట్ రేటు ప్రకారం మళ్లీ లీజుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడుగుతామని, ఇది పేదలకి, పెత్తందార్లకి మధ్య జరిగే ఎన్నికలన్నారు. ‘సత్యానికి, అసత్యానికి జరుగుతున్న పోరాటం ఇది. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న పోరాటం ఇది. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక వైపు ఉన్నారు. చంద్రబాబు తెలంగాణ నివాసి. రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అప్పులు పాలు చేశారని చంద్రబాబు, పవన్‌లు విమర్శించారు. చంద్రబాబు,దత్తపుత్రుడు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మహానాడు అంటూ దండలు వేస్తున్నారు. వ్యవసాయం అంటే నీకు గిట్టదు.. విద్యపై ఒక్క రోజు ఫోకస్ చేయలేదు.నీకు, సీఎం జగన్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. పవన్ గతంలో కాపు సామాజికి వర్గాన్ని ముంచేశారు’ అని మండిపడ్డారు. -
ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞుడను: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: శ్రీలక్ష్మీ మహాయజ్ఞంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. యజ్ఞంలో భాగంగా.. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన ఇవాళ ఉదయం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ సందర్భంపై ట్వీట్ చేస్తూ.. ‘‘ఆరు రోజులపాటు చండీ, రుద్ర, రాజ శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగం జరిగింది. వేలాది మంది ఆ యజ్ఞంలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్ధించారు. ..ప్రజలు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నేను కృతజ్ఞుడను. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు కృషి చేద్దాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాల్లని కోరుకుంటున్నా’’ అని ట్వీట్లో పేర్కొన్నారాయన. Today saw the culmination of the Chandi, Rudra, Raja Syamala, and Sudarshana Sahita Sri Lakshmi Maha Yagam after six days where thousands joined hands in prayer for the progress and prosperity of Andhra Pradesh. I am grateful for the unwavering faith that people have bestowed… pic.twitter.com/Dron2nRzSI — YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2023 -
‘శ్రీమహాలక్ష్మీ యజ్ఞం.. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం’
సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మీ యజ్ఞం ఏ ఇబ్బందులు లేకుండా ఐదు రోజులు నిర్విఘ్నంగా జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందన్నారు మంత్రి. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ‘ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారు. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రేపు పాల్గొంటారు. ఉదయం గం.10:45కి సీఎం అభిషేక మండపానికి చేరుకుంటారు. కంచి నుంచీ తెచ్చిన వస్త్రాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం అందజేస్తారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి రేపు వస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి కూడా వస్తారని ఆశిస్తున్నాం. యజ్ఞదీక్ష తీసుకున్న దంపతులుగా మేము కృష్ణానదిలో స్నానం చేసి, వేదాశీర్వచనం తీసుకుంటాం. రేపు పూర్ణాహుతి అనంతరం వేలాదిమందిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తాం. ప్రతీ ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రకృతి సహకారంతో యజ్ఙం ఐదు రోజులు విజయవంతంగా జరిగింది..ఇలాంటి యజ్ఙం భారత దేశంలో ఎక్కడా జరుగలేదు.ఎనిమిది ఆగమాలు సంపుటీకరించుకొని ఒకేసారి ఎప్పుడూ చేయలేదు. ఎండను లెక్కచేయకుండా భక్తులు వచ్చి ప్రదక్షణ చేసి ప్రసాదం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యజ్ఙం గురించి చర్చించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు. -
‘లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గొప్ప కార్యక్రమమిది’
సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మి యజ్ఞం.. లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గొప్ప కార్యక్రమం అని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. నాలుగు యాగశాలల్లో 600పైగా రుత్వికులు హోమాలు నిర్వహిస్తున్నారని, రాష్ట్ర చరిత్రలో ఇటువంటి యజ్ఞం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదన్నారు మంత్రి. ‘శ్రీమహాలక్ష్మీ యజ్ఞం మూడో రోజుకి చేరింది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాం. హనుమాన్ జయంతి రోజు కావడంతో హనుమాన్ చాలీసా భక్తి శ్రద్ధలతో నిర్వఁహించాం. ఈ మహాయజ్ణంలో క్రతువు నిర్వహించడంలో భాగస్వాములైనందుకు రుత్వికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు యాగశాలల్లో వేదపండితులు నాలుగు వేధాలని పఠించారు. యాగ శాలలలో జరిగే యజ్ణాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాం. రాజస్ధాన్ నుంచి ఈ యాగానికి దేశీయ ఆవు నెయ్యిని తెప్పించాం. రాష్ట్ర ప్రజల అభివృద్దికి...ప్రజలు సుఖసంతోషాలకోసం, పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ ఈ యజ్ణాన్ని వీక్షించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. -
‘మహాయజ్ఞం’లో ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: సనాతన ధర్మాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీ మహాయజ్ఞ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రారంభమైంది. ‘సమస్త ప్రజానాం క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధ్యర్థం...’ అంటూ సీఎం వైఎస్ జగన్ వేద పండితుల ఉచ్చారణల మధ్య సంకల్పం చేపట్టడంతో యజ్ఞ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి దంపతులతో పాటు వారి పిల్లల గోత్ర నామాలతో వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ మహాలక్ష్మీ దేవి విగ్రహం ముందు స్వర్ణలక్ష్మీ అమ్మవారి ప్రతిమకు సీఎం జగన్ పంచామృతాలతో అభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహానికి హారతి ఇచ్చారు. ముఖ్యమంత్రికి కుర్తాళం శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి ఆశీర్వచనం అందజేశారు. కపిల గోవుకు పూజలు యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వివిధ ఆగమాలకు అనుగుణంగా యజ్ఞశాల చుట్టూ కలియ తిరిగిన సీఎం జగన్ వేద పండితులు, రుత్వికులకు అభివాదం చేశారు. గోశాలలో కపిల గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో భక్తులను పలుకరించి మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు యజ్ఞ దీక్షాధారణ స్వీకరించారు. మంత్రులు తానేటి వనిత, ఉషశ్రీచరణ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు యజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతాయి. -
శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ కల్యాణ సౌభాగ్యాలతో వర్థిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 5గంటలకు మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నేశ్వర–విష్వక్సేన పూజలు, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. సీఎం జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న అనంతరం మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్.. కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. నాలుగు ఆగమాల నడుమ.. మే 17వ తేదీ బుధవారం వరకు 6 రోజులపాటు ఈ మహాయజ్ఞం కొనసాగనుండగా.. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు జరుగుతాయి. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తొలి రోజు ఉదయం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనసాగుతాయి. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. చదవండి: బాగున్నావా అన్నా..? భక్తుల కోసం నాలుగు క్యూలైన్లు యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా ఉమ్మడిగా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యజ్ఞ కార్యక్రమాలను వీక్షిస్తూనే ఆ యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసేలా వీటిని తీర్చిదిద్దారు. వాటిలో ఒకటి వీఐపీల కోసం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు రోజుకు ఒక ఆలయం చొప్పున ప్రసాదాల పంపిణీ చేపడుతున్నాయి. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగ లి పంపిణీ చేస్తారు. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 17వ తేదీన చివరి రోజు సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వ రూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)