సాక్షి, విజయవాడ: శ్రీమహాలక్ష్మీ యజ్ఞం ఏ ఇబ్బందులు లేకుండా ఐదు రోజులు నిర్విఘ్నంగా జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో అందరి సమన్వయంతో యజ్ఞం జరిగిందన్నారు మంత్రి. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ‘ఎండను లెక్కజేయకుండా భక్తులు వచ్చారు. రేపు మహా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. నాలుగు ప్రధాన యాగశాలల్లో జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రేపు పాల్గొంటారు. ఉదయం గం.10:45కి సీఎం అభిషేక మండపానికి చేరుకుంటారు.
కంచి నుంచీ తెచ్చిన వస్త్రాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సీఎం అందజేస్తారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద్రేద్ర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల జీయర్ స్వామి రేపు వస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి కూడా వస్తారని ఆశిస్తున్నాం. యజ్ఞదీక్ష తీసుకున్న దంపతులుగా మేము కృష్ణానదిలో స్నానం చేసి, వేదాశీర్వచనం తీసుకుంటాం.
రేపు పూర్ణాహుతి అనంతరం వేలాదిమందిగా వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందిస్తాం. ప్రతీ ఒక్కరూ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రకృతి సహకారంతో యజ్ఙం ఐదు రోజులు విజయవంతంగా జరిగింది..ఇలాంటి యజ్ఙం భారత దేశంలో ఎక్కడా జరుగలేదు.ఎనిమిది ఆగమాలు సంపుటీకరించుకొని ఒకేసారి ఎప్పుడూ చేయలేదు. ఎండను లెక్కచేయకుండా భక్తులు వచ్చి ప్రదక్షణ చేసి ప్రసాదం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యజ్ఙం గురించి చర్చించుకుంటున్నారు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment