సాక్షి, గుంటూరు: శ్రీలక్ష్మీ మహాయజ్ఞంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. యజ్ఞంలో భాగంగా.. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన ఇవాళ ఉదయం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ సందర్భంపై ట్వీట్ చేస్తూ.. ‘‘ఆరు రోజులపాటు చండీ, రుద్ర, రాజ శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగం జరిగింది. వేలాది మంది ఆ యజ్ఞంలో పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్రార్ధించారు.
..ప్రజలు నాపై ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నేను కృతజ్ఞుడను. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు కృషి చేద్దాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాల్లని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారాయన.
Today saw the culmination of the Chandi, Rudra, Raja Syamala, and Sudarshana Sahita Sri Lakshmi Maha Yagam after six days where thousands joined hands in prayer for the progress and prosperity of Andhra Pradesh.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 17, 2023
I am grateful for the unwavering faith that people have bestowed… pic.twitter.com/Dron2nRzSI
Comments
Please login to add a commentAdd a comment