
సాక్షి, విజయవాడ: బీజేపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ కోవర్టుల స్క్రిప్ట్‌ను అమిత్ షా, నడ్డా చదవినట్లున్నారని మండిపడ్డారు మంత్రి. పలు సందర్భాల్లో సీఎం జగన్‌ను ప్రధాని మెచ్చుకున్నారనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
ప్రధాని మాట్లాడిందానికి విరుద్ధంగా అమిత్ షా, నడ్డాలు మాట్లాడతున్నట్లుంది. సీఎం జగన్‌పై ప్రధాని మోదీకి విశ్వాసం ఉంది. కేంద్రం-రాష్ట్రంమధ్య ఎలాంటి గ్యాప్ లేదు. మోదీ 9 ఏళ్ల పాలన విజయాలపై పెట్టిన సభలో ఏం మాట్లాడారు?, చెప్పుడు మాటలు విని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా?, ‘ ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోవాలి. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపై ప్రకటన చేయాలి’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.