
సాక్షి, తాడేపల్లిగూడెం: చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాలుగు దశాబ్ధాల నుంచి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు.
చంద్రబాబు వర్గ ప్రయోజనాల కోసమే పని చేస్తాడు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. గూగుల్‌లో వీటి పేర్లు కొడితే చంద్రబాబు ఫోటో వస్తుందని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘తెర వెనుక ఉండి రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తూ, మళ్ళీ దానిని ప్రచారం చేస్తాడు. పచ్చ మీడియా సపోర్ట్‌తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడు’’ అని చంద్రబాబుపై మంత్రి నిప్పులు చెరిగారు.
‘‘చంద్రబాబు స్నేహం కారణంగా పవన్ మతిపోయింది. పవన్ చూస్తే జాలేస్తుంది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరపరిచారు. జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారు’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: గెలవనని తెలుసు.. పవన్ కల్యాణ్ ఖాతాలో మరొకటి
Comments
Please login to add a commentAdd a comment