
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖ, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు.
కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబూ.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్. మోసం, దగా, వెన్నుపోటు, అవినీతిని కలిపితే అదే చంద్రబాబు. నైతిక విలువలు లేని ఏకైన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అధికారం కోసం బాబు అబద్ధాలు, అడ్డదారులు తొక్కుతున్నాడు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా చేసి ఏపీని పాతాళానికి తొక్కేసాడు.
2019లో ప్రజలు ఛీకొట్టినా మళ్లీ మాయమాటలు చెబుతున్నాడు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం దురదృష్టం. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు. అవినీతి అనకొండ చంద్రబాబు. బాబు రెండెకరాల నుంచి రూ.లక్ష కోట్లకు ఎలా పడగలెత్తాడు. చంద్రబాబు పాలనలో అంతా దుర్భిక్షం, కరువు కాటకాలే. 2024 ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా?
Comments
Please login to add a commentAdd a comment