‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’ | Minister Kottu Satyanarayana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే’

Published Sat, May 27 2023 3:26 PM | Last Updated on Sat, May 27 2023 4:24 PM

Minister Kottu Satyanarayana Fires On Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడని, ఆయనను మానసికంగా చంపేసి ఇవాళ పాదపూజ చేస్తా అంటున్నాడు’’ అని మండిపడ్డారు.

‘‘సిగ్గు శరంలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. బాబు దుర్మార్గ పరిపాలన చూసే ప్రజలు రాజకీయ సమాధి చేశారు. మహానాడు కోసం బలవంతపు జనసమీకరణ చేస్తున్నారు. పదవిలో ఉండగా చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చాడా?. ఎప్పుడైనా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అడిగాడా?. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టి గౌరవించిన వ్యక్తి సీఎం జగన్‌. బాబు కాపుల ఓట్ల కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. చంద్రబాబు మాయలో కాపు సామాజిక వర్గం పడొద్దు’’ అని మంత్రి పేర్కొన్నారు.

‘‘కాపులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్‌. అధికారంలోకి రాగానే తుని ఘటన కేసును ఎత్తివేసింది సీఎం జగనే. ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులు వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. మొదటి నుంచీ ఎన్టీఆర్‌ను గౌరవించింది వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ మాత్రమే.. రాజమండ్రి సభకు ఎన్టీఆర్‌ అభిమానులు వెళ్తే ఆయన ఆత్మ క్షోభిస్తుంది’’ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement