ఆలయానికి వచ్చి రాజకీయాలా?.. చంద్రబాబుపై మంత్రి ఫైర్‌ | AP Minister Kottu Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆలయానికి వచ్చి రాజకీయాలా?.. చంద్రబాబుపై మంత్రి ఫైర్‌

Published Wed, Oct 5 2022 4:43 PM | Last Updated on Wed, Oct 5 2022 8:58 PM

AP Minister Kottu Satyanarayana Comments On Chandrababu - Sakshi

10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చంద్రబాబు చెప్తే బాగుండేదన్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని మంత్రి హితవు పలికారు.

సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దర్శనానికి వచ్చి చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం పద్దతి కాదు. చంద్రబాబు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏపీకి జరగకూడదనే సీఎం ఆలోచన. అమరావతి రాజధాని కాదని సీఎం జగన్‌ ఎక్కడ చెప్పారు? అని మంత్రి ప్రశ్నించారు.
చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’

‘‘10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఎందుకు వదిలి వచ్చామో చంద్రబాబు చెప్తే బాగుండేదన్నారు. చంద్రబాబు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. ‘‘చంద్రబాబు కోరుకున్నట్లు రియల్ ఎస్టేట్ రాజధాని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు’’ అని మంత్రి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement