
విజయనగరం: పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు(మంగళవారం) పైడితల్లి సిరిమానోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర కి పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మవారిని కోరాను.
వికేంద్రీకరణ జరగాలని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది. హైదరాబాద్‌లా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియాని తయారు చేశాడు. ఫేక్ రైతుల తో ఫేక్ పాదయాత్ర చేయిస్తున్నాడు. ఈ యాత్రను పెయిడ్ వర్కర్లను టీడీపీ నాయకులను పెట్టి నడిపిస్తున్నాడు’ అని అన్నారు.