sirimanu utsavam
-
శ్రీకాకుళం జిల్లా: సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎచ్చర్ల మండలం కుప్పిలి సిరిమాను ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. బుడగడ్లపాలెం చెందిన సూరాడ అప్పన్న(40), కారిపల్లెటి శ్రీకాంత్(55) మృతిచెందారు. సిరిమానుపై కూర్చున్న చిన్నారెడ్డికి నాలుక తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం (ఫొటోలు)
-
విజయనగరం : వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం (ఫొటోలు)
-
పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
విజయనగరం: పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు(మంగళవారం) పైడితల్లి సిరిమానోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర కి పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మవారిని కోరాను. వికేంద్రీకరణ జరగాలని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది. హైదరాబాద్‌లా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియాని తయారు చేశాడు. ఫేక్ రైతుల తో ఫేక్ పాదయాత్ర చేయిస్తున్నాడు. ఈ యాత్రను పెయిడ్ వర్కర్లను టీడీపీ నాయకులను పెట్టి నడిపిస్తున్నాడు’ అని అన్నారు. -
వనంలో వెలిసిన దేవత.. ప్రకృతి స్వరూపిణి.. పైడితల్లి
విజయనగరం టౌన్: పైడితల్లమ్మ చరిత విన్నా.. తెలుసుకున్నా.. ఎంతో పుణ్యఫలం. ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే.. అవి తీరిన కొద్దిరోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు. అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం వరకూ ఇక్కడే ఉండి పసుపు, కుంకుమలతో మొక్కుబడులు చెల్లిస్తారు. చల్లంగా చూడుతల్లీ.. మళ్లీ వచ్చి దర్శించుకుంటామంటూ ప్రకృతి స్వరూపిణిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అంతటి మహిమాన్వితమైన పైడితల్లమ్మ వెలిసింది విజయనగరంలోని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలోనే.. వనంలోనే సాక్షాత్కారం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి వెళ్లడం ఆనవాయితీ. సిరిమానోత్సవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కోటశక్తికి విశేష పూజలు నిర్వహిస్తారు. అయితే అమ్మ సాక్షాత్కరించింది మాత్రం వనంలోనే. అప్పట్లో స్థానిక రైల్వేస్టేషన్ ప్రదేశం పూర్తి అటవీ ప్రాంతం. పెద్దచెరువు దాటిన తర్వాత అంతా దట్టమైన అరణ్యప్రాంతం. పెద్దచెరువు పశ్చిమభాగాన వనంతో కలిసి ఉన్న చెరువులో వెలిసిన చిన్నారి పెడితల్లి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. అన్నను వారించినా.. బొబ్బిలి యుద్ధం సమయంలో రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి తన అన్న విజయరామరాజును పైడితల్లమ్మ ముందే హెచ్చరించింది. యుద్ధం వద్దని చెప్పి వారించినా ఆమె మాటను సోదరుడు పెడచెవిన పెట్టాడు. యుద్ధంలో విజయరామరాజును తాండ్రపాపారాయుడు హతమార్చాడు. పెద్దవిజయరామరాజును రక్షించుకోవాలని చిన్నారి పైడితల్లి.. పతివాడ అప్పలనాయుడు సహాయంతో యుద్ధం జరిగిన స్థలానికి బయలుదేరింది. వారిద్దరూ కోట దగ్గర నుంచి బయల్దేరి పెద్దచెరువు వద్దకు వచ్చేసరికి అన్న మరణవార్త చెవిన పడడంతో తట్టుకోలేక పోయిన ఆమె అన్నంటే ఎంతో అభిమానం, వాత్సల్యం ఉండడంతో.. తాను నిత్యం పూజించే మహాశక్తిని ప్రార్ధిస్తూ పెద్దచెరువులో దూకి దుర్గాదేవిలో లీనమైపోయింది. పెద్దచెరువులో ప్రతిరూపాలు అదేరోజు రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలో కనిపించి .. తన ప్రతిరూపాలు పెద్దచెరువు పశ్చిమభాగంలో లభ్యమవుతాయని, వాటిని తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని కోరింది. ఆ ప్రకారంగానే రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న పెద్దచెరువులో బెస్తవారి సహాయంతో వెతగ్గా ఆ నీటిలో ఓ మెరుపులా సాక్షాత్కరించి తానిక్కడ ఉన్నాననే సంకేతాన్నిచ్చింది. వెంటనే వారు ఆ ప్రదేశంలో వెతకగా విగ్రహాలు లభ్యమయ్యాయి. అనంతరం అమ్మవారిని ప్రతిష్టించి గుడి నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం కావడంతో వనంగుడి అని పేరువచ్చింది. సిరిమానోత్సవాన్ని చదురు కట్టి నిర్వహించడం, కోటశక్తికి పూజలు చేయడం మూలంగా చదురుగుడి వద్ద సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వనంగుడిలో దుర్గమ్మ, ముత్యాలమ్మ వనంగుడిలో అమ్మవారికి ఇష్టమైన దుర్గాదేవి, ముత్యాలమ్మ అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి నెలా మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు, అమ్మవారికి చండీహోమం శరన్నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవికి అలంకరణలు, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారి పాత విగ్రహానికి ఆలయం వెనుక ఉన్న ప్రత్యేక గది కట్టి నిత్యపూజలందిస్తున్నారు. రైల్వేస్టేషన్ ప్రాంతం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తారు. అమ్మవారికి అద్దాల మంటపం 2008లో వనంగుడిలోనే అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి ఉన్న విధంగానే అద్దాల మంటపం ఏర్పాటుచేశారు. ఈ మంటపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఊయలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊంజల్ సేవలు నిర్వహిస్తారు. రోజూ పంచహారతుల అనంతరం సేవ నిర్వహిస్తారు. భక్తులు అద్దాల మంటపంలోని ఉయ్యాలలో అమ్మవారి చిత్రపటానికి మొక్కి ప్రదక్షిణలు చేస్తారు. అమ్మవెలిసింది ఇక్కడే ఉత్తరాంధ్రుల కొంగుబంగారం పైడితల్లి ఆలయం విశిష్ట చరిత్రకు మారుపేరు. ఇక్కడ బలిహరణ ప్రాంతం వెనుక కూడా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మవారి ఆలయంతో పాటు ఈ ప్రదేశాన్ని కూడా భక్తులు కొలుస్తారు. దీన్ని భక్తిపూర్వకంగా తాకుతూ అమ్మను ప్రార్థిస్తారు. గుడిలో బలిహరణ ప్రదేశం వద్ద భోగం పెట్టడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాడు పైడితల్లి అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశం కావడమే దీనికి కారణం. అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు ఇక్కడే ముందుగా పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. ముందుగా బలిహరణం చేతులతో స్పర్శించి, కళ్లకద్దుకుంటూ అమ్మను చూసేందుకు ముందుకు వెళతారు. అప్పట్లో ఆలయం పెద్ద చెరువుకు ఎదురుగా ఉండేది. కానీ జనసంచారం దృష్ట్యా ఆలయాన్ని దాదాపు 15ఏళ్ల కిందట రైల్వేస్టేషన్ వైపు ముఖ ద్వారం ఉంచి అభివృద్ధి చేశారు. అయితే తొలుత పూజలందుకున్న విగ్రహాలు అవసాన దశకు చేరుకోవడంతో చిన్న తల్లి విగ్రహాలను భీమునిపట్నం సముద్రంలో వేదమంత్రోచ్చారణలతో కలిపేశారని పెద్దలు చెబుతుంటారు. అందులో ఒక విగ్రహం తిరిగి ఒడ్డుకు వచ్చిందని, అదే విగ్రహాన్ని వనంగుడి బాలాలయంలో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఆలయాన్ని దర్శిస్తే ఈడేరనున్న కోరికలు పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి విశాలమైన ప్రాంతంలో నిర్మించారు. అమ్మవారు ఎక్కడైతే పెద్దచెరువులో పతివాడ అప్పలనాయుడుకు సాక్షాత్కరించారో అదేస్థలంలో వనంగుడి నిర్మించడం, అమ్మవారు లభ్యమైనచోటే విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కులు వెంటనే నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో అమ్మవారు భక్తులను పండగరోజు చిన్నపాటి చినుకులతో ఆశీర్వదిస్తూ ఉంటారు. తల్లిని దర్శించి మొక్కులు మొక్కిన వారందరూ కేవలం నెలల వ్యవధిలోనే తిరిగి తమ కోర్కెలు నెరవేరాయని, సత్యమైన తల్లి అంటూ అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో మొక్కుబడులు చెల్లిస్తుంటారు. సిరిమానోత్సావానికి ఉత్తరాంధ్రా నుంచే కాకుండా ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి, ఎన్ఆర్ఐలు, విదేశీయులు వచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. (క్లిక్ చేయండి: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు) తల్లిసేవలో తరిస్తున్నా.. మా నాన్నగారు నేతేటి శ్రీనివాస్ సిరిమాను అధిరోహించారు. పైడితల్లికి సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మసేవలో తరిస్తున్నాను. ఎందరో భక్తులు అమ్మ మహిమలతో పాటు వారికి కలిగిన మంచి పనుల గురించి నాతో వారి అనుభవాన్ని పంచుకుంటారు. – నేతేటి ప్రశాంత్, వనంగుడి అర్చకుడు, విజయనగరం. -
వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఫొటోలు
-
Sirimanu Utsavam: వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
సాక్షి, విజయనగరం: శ్రీపైడితల్లమ్మ సిరిమానోత్సవం కన్నుల పండువగా జరిగింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. సిరిమానోత్సవాన్ని తలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో సుమారు 55 అడుగులు నుంచి 60 అడుగుల వరకూ పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ఏర్పాటుచేసిన పీటపై ప్రధాన పూజారి విసనకర్ర చేతబట్టి ఆశీనులయ్యారు. (చదవండి: అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించాను: బొత్స) రెండో చివరన రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు.దాని ఆధారంగానే మాను పైకిలేస్తుంది. గజపతిరాజు వంశీయులు తరఫున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి నుంచి రాజా బజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు తిరిగింది. ఊరేగింపు అద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలిచారు. సిరిమానోత్సవం.. ఈ పేరు వింటే భక్తకోటి పరవశించిపోతుంది. ఆ అద్భుత ఘడియలను కనులారా వీక్షించేందుకు పరితపిస్తుంది. ఆద్యంతం ఆసక్తి గొలిపే సిరిమానోత్సవానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతుంది. చదవండి: కాఫీ ఘుమఘుమ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు.. -
పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధం..
సిరుల తల్లి పండగంటేనే ఆనందం. ఉత్తరాంధ్ర ప్రజల ఇష్ట దైవం, భక్తుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవానికి తెర లేచింది. సోమవారం జరగనున్న తొలేళ్ల ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాక్షి, విజయనగరం టౌన్: భక్తుల కొర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి(ఏరు)తో తొలిత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్లనీ పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలూ.. దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కోటకి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతుల తో ఆ విత్తనాలను అందించి అమ్మ ఆశీర్వదిస్తుంది. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు, మంచి దిగుబడులు సాధిస్తారు. పండగ శోభ విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి పండగ రోజుల్లో మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో పండగ శోభ సంతరించుకుంది. రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి ప్రదేశం, మూడు లాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరాడుతోంది. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో సచివాలయ వ్యవస్థ ద్వారా టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆలయం వద్దనే రెండు ఆన్లైన్ కౌంటర్లు పెట్టి టికెట్లు అందజేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసే పనిలో కొంతమంది ఉంటే, ప్రసాదాల తయారీలో మరికొందరు, సేవలకు సిద్ధంగా ఇంకొందరు ఇలా తలా బాధ్యత అమ్మ సేవలో నిమగ్నమయ్యారు. చల్లని తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు సన్నద్ధమయ్యారు. తొలేళ్ల రోజు ప్రధాన ఘట్టాలు ►వేకువ జామున 3 గంటల నుంచి అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు. ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. ►రాత్రి 10.30 గంటలకు భాజా భజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలోకి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు. ►ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి, మొక్కులు చెల్లిస్తారు. ►ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు. నేడు, రేపు మద్యం దుకాణాల బంద్ విజయనగరం అర్బన్: పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమీపంలోని మద్యం దుకాణాలు మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులను కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నగరాని కి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రత ల కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవ ఏర్పాట్లు పూర్తి అమ్మవారి తొలేళ్లు, పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతర రెండు రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉండడం వలన సచివాలయాల్లో అమ్మవారి దర్శనం టికెట్లను అందిస్తున్నాం. పది వేల లడ్డూ ప్రసాదాలను, పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచు తున్నాం. మాస్క్‌లు, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. – బిహెచ్విఎస్ఎన్.కిశోర్‌కుమార్, ఈఓ, పైడితల్లి అమ్మవారి దేవస్ధానం మూడంచెల పోలీస్ భద్రత సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్లు, సిరిమానోత్సవానికి సంబంధించి మూడంచెల పోలీస్ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తును 20 సెక్టార్లుగా విభజించి, సుమారు 2,500 మంది పోలీసులను రెండు షిప్టులుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు/ఆర్ఐలు, 136 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 414 మంది ఏఎస్ఐ/హెచ్‌సీలు, 652 మంది కానిస్టేబుళ్లు, 144 మంది మహిళా కానిస్టేబుళ్లు, 365 మంది హోంగార్డులు, 105 మంది ఎస్టీఎఫ్ పోలీసు సిబ్బంది, 155 మంది ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, 25 మంది పీఎస్ఓలు, 10 మంది బాంబ్ డిస్పోజల్ బృందాలు, 25 మంది కమ్యూనికేషన్ సిబ్బందితో సహా సుమారు 2,500 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం బందోబస్తును పర్యవేక్షించేందుకు పార్వతీపురం ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావును నియమించామన్నారు. అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యనారాయణరావును కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణకు నియమించామని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వహించేందుకు విశాఖ సిటీ, రూరల్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పోలీస్ అధికారులు, సిబ్బంది వస్తున్నట్లు తెలిపారు. ప్రజలంద రూ ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని పోలీసు శాఖకు, ఇతర శాఖలకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 19న దర్శనాల నిలిపివేత ఈ నెల 19న ఉదయం 11 గంటల నుంచి సిరిమానోత్సవం ముగిసే వరకూ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నందున, భక్తులెవరూ ఆ సమయంలో దర్శనాల కోసం ప్రధా న దేవాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు. చెక్‌పోస్టుల ఏర్పాటు కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లోనూ, అంతర్ మండలాల్లోనూ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి, తనిఖీలు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. పైడితల్లి సిరిమానోత్సవం రోజున ఎటువంటి వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమన్నారు. అమ్మవారి ఆలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకువచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరింపజేస్తున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే విధంగా డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫాల్కన్ మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నామన్నారు. రూఫ్ టాప్‌లు ఏర్పాటు సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 20 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేశామని, ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బైనాక్యులర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూంకు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నామన్నారు. భక్తులకు సహాయ, సహకారాలందించేందుకు పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏడు ప్రత్యేక బృందాలు అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంచుతున్నామని, సిబ్బందికి ఎక్కడ ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా, వేరే పోలీసు సిబ్బంది కోసం వేచి చూడకుండా వీరిని వినియోగిస్తామన్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు అయోధ్య మైదానం, రాజీవ్ స్టేడియం, రామానాయుడు రోడ్డు ట్రాఫిక్ డైవర్షన్ రేపు ►పట్టణంలోని వాహనాలను ఎత్తుబ్రి డ్జి, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు తరలిస్తారు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం వెలుపలకు పంపిస్తారు. ►ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా, కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ►జేఎన్టీయూ, కలెక్టరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా, ప్రదీప్‌నగర్ జంక్షన్, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా అనుమతిస్తారు. అమ్మ దర్శనం కోసం... విజయనగరం పూల్‌బాగ్: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. భక్తులెవరూ సిరిమానోత్సవాన్ని నేరుగా దర్శించే అవకాశం లేకుండా టీవీలు, ఎల్ఈడీలు ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవం వరకూ ఆగకుండా ముందుగానే అమ్మవారిని దర్శించుకోవాలన్న పిలుపు మేరకు ఇప్పటికే ఘటాలతో ముందస్తుగానే అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పైడితల్లికి పుష్పార్చన పైడితల్లి అమ్మవారు ఆదివారం ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు దూసి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, మూలా పాపారావు, ఏడిద రమణ ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఘటాలతో భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కిశోర్‌కుమార్ పర్యవేక్షించారు. భక్తజనం అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. చదురుగుడి నుంచి కోట వరకూ, అటు గంటస్థంభం వరకూ భక్తులు బారులు తీరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, అత్యంత భద్రంగా... భౌతిక దూరం పాటిస్తూనే అమ్మను దర్శించుకుంటున్నారు. మాస్కులు విధిగా ధరిస్తున్నారు. -
అస్తమించిన భాస్కరుడు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానును అధిరోహించే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు(68) హుకుంపేటలో ఉన్న స్వగృహంలో శుక్రవారం కన్ను మూశారు. గురువారం రాత్రి గుండె నొప్పితో తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఉమామహేశ్వరి, కుమారుడు ధనుంజయ్, కుమార్తెలు అరుణ, వాసవి ఉన్నారు. ఈయన 2009 నుంచి 2016 వరకు సిరిమానును అధిరోహించారు. అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించేవారు. భాస్కరరావు మృతి పట్ల పలువురు తమ సంతాపాన్ని తెలిపారు. ఈయన మృతిపై కస్పా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి వేలమూరి నాగేశ్వరరావు, గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాడిశెట్టి శాంతారావు, పైడితల్లి అమ్మవారి ఆలయ అభవృద్ధి కమిటీ ప్రతినిధి ఎంబీ సత్యనారాయణ, పైడిమాంబ దీక్షాపీఠం వ్యవస్థాపకుడు, గురుస్వాములు ఆర్ఎస్ పాత్రో, ఎస్.అచ్చిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
-
ఘనంగా పైడితల్లి సిరిమానోత్సవం
-
కనులపండుగగా పైడితల్లి సిరిమానోత్సవం
-
సిరిమానోత్సవం మొదలైంది.
-
కన్నుల పండువగా సిరిమాను ఉత్సవం
విజయనగరం: విజయనగరంలో సిరిమాను ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. పైడితల్లి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలసి కోట బురుజుపై నుంచి ఉత్సవాలను తిలకించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు.