
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఎచ్చర్ల మండలం కుప్పిలి సిరిమాను ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. బుడగడ్లపాలెం చెందిన సూరాడ అప్పన్న(40), కారిపల్లెటి శ్రీకాంత్(55) మృతిచెందారు. సిరిమానుపై కూర్చున్న చిన్నారెడ్డికి నాలుక తెగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.