Sirimanostavam
-
అంబరాన్నంటిన సిరిమాను సంబరం
అంబరాన్ని తాకింది. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఏడాది కూడా కనులపండువగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం 3.26 గంటలకు ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి చదురుగుడి నుంచి కోట వరకు మూడుసార్లు సాగిన తిరువీధి ఉత్సవం సాయంత్రం 5.21 గంటలకు ముగిసింది. నెలరోజులపాటు నిర్వహించే వేడుకల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో బారులుతీరి అమ్మను దర్శించుకున్నారు. జిల్లాతోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన భక్తులు తరలివచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగాయి. పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కోట బురుజుపై నుంచి తిరువీధి ఉత్సవాన్ని తిలకించారు. డీసీసీబీ కార్యాలయం నుంచి శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వీక్షించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఉండి ఎమ్మెల్యే ఆర్.రఘురామకృష్ణరాజు తదితరులు సిరిమానోత్సవాన్ని తిలకించారు.– సాక్షి ప్రతినిధి, విజయనగరం -
కన్నుల పండుగగా సిరిమానోత్సవం
-
అక్టోబర్ 31న పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 31న నిర్వహించనున్నారు. ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పూర్తి వివరాలను గురువారం మీడియాకు తెలియజేశారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో పైడితల్లి ఉత్సవ తేదీలను ఆమె ప్రకటించారు. తిథి, వార నక్షత్రాలను అనుసరించి నిర్ణయించిన ముహుర్తం ప్రకారం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ఈవో సుధారాణి వివరించారు. అక్టోబర్ 30న తొలేళ్ల ఉత్సవం ఉంటుందని, మరుసటి రోజు అక్టోబర్ 31న అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అలాగే నవంబర్ 7వ తేదీన పెద్దచెరువు వద్ద తెప్పోత్సవం, 14వ తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 8.00 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు, అక్టోబర్ 25న అర్ధమండలి దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు వనం గుడి నుంచి కలశ జ్యోతి ఊరేగింపు ఉంటుందని వివరించారు. నవంబర్ 15న ఛండీహోమం, పూర్ణాహుతితో వనంగుడి వద్ద దీక్ష విరమణతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో కె.ఎల్. సుధారాణి పేర్కొన్నారు. సిరిమాను పూజారి బి. వెంటకరావు, వేదపండితులు రాజేశ్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణ, ఇతర ఏర్పాట్ల గురించి వివరాలు వెల్లడించారు. అనంతరం అందరూ కలిసి ఉత్సవ తేదీలతో కూడిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సిరిమాను పూజారి బి. వెంకటరావు, వేద పండితులు తాతా రాజేశ్ బాబు, దూసి శివప్రసాద్, వి. నర్శింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పతివాడ వెంకటరావు, వెత్సా శ్రీనివాసరావు, గొర్లె ఉమ, ప్రత్యేక ఆహ్వానితులు ఎస్. అచ్చిరెడ్డి, గంధం లావణ్య, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 7 గంటల సమయం -
కనుల పండువగా పైడితల్లి సిరిమానోత్సవం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కనుల పండువగా సాగింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఉత్సవం జరిగింది. ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో భక్తులు పోటెత్తారు. విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 4.5 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి , దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు అమ్మవారికి వస్త్రాలను తీసుకొచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5.22 గంటలకు సిరిమాను కదిలింది. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానుపై ఆశీనులై భక్తులకు దర్శనం ఇచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడు పర్యాయాలు సిరిమానును తిప్పారు. సాయంత్రం 6.42 గంటలకు సిరిమాను జాతర పూర్తయింది. డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సిరిమాను ఉత్సవాన్ని వీక్షించారు. కోటపై నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతిరాజు, సునీలా గజపతిరాజు, సుధా గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు తదితరులు ఉత్సవాన్ని తిలకించారు. -
Vizianagaram: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం (ఫొటోలు)
-
పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
విజయనగరం: పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు(మంగళవారం) పైడితల్లి సిరిమానోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర కి పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మవారిని కోరాను. వికేంద్రీకరణ జరగాలని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది. హైదరాబాద్‌లా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియాని తయారు చేశాడు. ఫేక్ రైతుల తో ఫేక్ పాదయాత్ర చేయిస్తున్నాడు. ఈ యాత్రను పెయిడ్ వర్కర్లను టీడీపీ నాయకులను పెట్టి నడిపిస్తున్నాడు’ అని అన్నారు. -
వనంలో వెలిసిన దేవత.. ప్రకృతి స్వరూపిణి.. పైడితల్లి
విజయనగరం టౌన్: పైడితల్లమ్మ చరిత విన్నా.. తెలుసుకున్నా.. ఎంతో పుణ్యఫలం. ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోర్కెలు కోరితే.. అవి తీరిన కొద్దిరోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడున్నా పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు. అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తొలేళ్ల నుంచి సిరిమానోత్సవం వరకూ ఇక్కడే ఉండి పసుపు, కుంకుమలతో మొక్కుబడులు చెల్లిస్తారు. చల్లంగా చూడుతల్లీ.. మళ్లీ వచ్చి దర్శించుకుంటామంటూ ప్రకృతి స్వరూపిణిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అంతటి మహిమాన్వితమైన పైడితల్లమ్మ వెలిసింది విజయనగరంలోని రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలోనే.. వనంలోనే సాక్షాత్కారం పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడికి వెళ్లడం ఆనవాయితీ. సిరిమానోత్సవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కోటశక్తికి విశేష పూజలు నిర్వహిస్తారు. అయితే అమ్మ సాక్షాత్కరించింది మాత్రం వనంలోనే. అప్పట్లో స్థానిక రైల్వేస్టేషన్ ప్రదేశం పూర్తి అటవీ ప్రాంతం. పెద్దచెరువు దాటిన తర్వాత అంతా దట్టమైన అరణ్యప్రాంతం. పెద్దచెరువు పశ్చిమభాగాన వనంతో కలిసి ఉన్న చెరువులో వెలిసిన చిన్నారి పెడితల్లి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది. అన్నను వారించినా.. బొబ్బిలి యుద్ధం సమయంలో రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి తన అన్న విజయరామరాజును పైడితల్లమ్మ ముందే హెచ్చరించింది. యుద్ధం వద్దని చెప్పి వారించినా ఆమె మాటను సోదరుడు పెడచెవిన పెట్టాడు. యుద్ధంలో విజయరామరాజును తాండ్రపాపారాయుడు హతమార్చాడు. పెద్దవిజయరామరాజును రక్షించుకోవాలని చిన్నారి పైడితల్లి.. పతివాడ అప్పలనాయుడు సహాయంతో యుద్ధం జరిగిన స్థలానికి బయలుదేరింది. వారిద్దరూ కోట దగ్గర నుంచి బయల్దేరి పెద్దచెరువు వద్దకు వచ్చేసరికి అన్న మరణవార్త చెవిన పడడంతో తట్టుకోలేక పోయిన ఆమె అన్నంటే ఎంతో అభిమానం, వాత్సల్యం ఉండడంతో.. తాను నిత్యం పూజించే మహాశక్తిని ప్రార్ధిస్తూ పెద్దచెరువులో దూకి దుర్గాదేవిలో లీనమైపోయింది. పెద్దచెరువులో ప్రతిరూపాలు అదేరోజు రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలో కనిపించి .. తన ప్రతిరూపాలు పెద్దచెరువు పశ్చిమభాగంలో లభ్యమవుతాయని, వాటిని తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని కోరింది. ఆ ప్రకారంగానే రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న పెద్దచెరువులో బెస్తవారి సహాయంతో వెతగ్గా ఆ నీటిలో ఓ మెరుపులా సాక్షాత్కరించి తానిక్కడ ఉన్నాననే సంకేతాన్నిచ్చింది. వెంటనే వారు ఆ ప్రదేశంలో వెతకగా విగ్రహాలు లభ్యమయ్యాయి. అనంతరం అమ్మవారిని ప్రతిష్టించి గుడి నిర్మించారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం కావడంతో వనంగుడి అని పేరువచ్చింది. సిరిమానోత్సవాన్ని చదురు కట్టి నిర్వహించడం, కోటశక్తికి పూజలు చేయడం మూలంగా చదురుగుడి వద్ద సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వనంగుడిలో దుర్గమ్మ, ముత్యాలమ్మ వనంగుడిలో అమ్మవారికి ఇష్టమైన దుర్గాదేవి, ముత్యాలమ్మ అమ్మవార్లు కొలువై పూజలందుకుంటున్నారు. ప్రతి నెలా మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు, అమ్మవారికి చండీహోమం శరన్నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవికి అలంకరణలు, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. అమ్మవారి పాత విగ్రహానికి ఆలయం వెనుక ఉన్న ప్రత్యేక గది కట్టి నిత్యపూజలందిస్తున్నారు. రైల్వేస్టేషన్ ప్రాంతం కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి తరిస్తారు. అమ్మవారికి అద్దాల మంటపం 2008లో వనంగుడిలోనే అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి ఉన్న విధంగానే అద్దాల మంటపం ఏర్పాటుచేశారు. ఈ మంటపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఊయలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊంజల్ సేవలు నిర్వహిస్తారు. రోజూ పంచహారతుల అనంతరం సేవ నిర్వహిస్తారు. భక్తులు అద్దాల మంటపంలోని ఉయ్యాలలో అమ్మవారి చిత్రపటానికి మొక్కి ప్రదక్షిణలు చేస్తారు. అమ్మవెలిసింది ఇక్కడే ఉత్తరాంధ్రుల కొంగుబంగారం పైడితల్లి ఆలయం విశిష్ట చరిత్రకు మారుపేరు. ఇక్కడ బలిహరణ ప్రాంతం వెనుక కూడా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పైడితల్లి అమ్మవారి ఆలయంతో పాటు ఈ ప్రదేశాన్ని కూడా భక్తులు కొలుస్తారు. దీన్ని భక్తిపూర్వకంగా తాకుతూ అమ్మను ప్రార్థిస్తారు. గుడిలో బలిహరణ ప్రదేశం వద్ద భోగం పెట్టడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాడు పైడితల్లి అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశం కావడమే దీనికి కారణం. అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు ఇక్కడే ముందుగా పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. ముందుగా బలిహరణం చేతులతో స్పర్శించి, కళ్లకద్దుకుంటూ అమ్మను చూసేందుకు ముందుకు వెళతారు. అప్పట్లో ఆలయం పెద్ద చెరువుకు ఎదురుగా ఉండేది. కానీ జనసంచారం దృష్ట్యా ఆలయాన్ని దాదాపు 15ఏళ్ల కిందట రైల్వేస్టేషన్ వైపు ముఖ ద్వారం ఉంచి అభివృద్ధి చేశారు. అయితే తొలుత పూజలందుకున్న విగ్రహాలు అవసాన దశకు చేరుకోవడంతో చిన్న తల్లి విగ్రహాలను భీమునిపట్నం సముద్రంలో వేదమంత్రోచ్చారణలతో కలిపేశారని పెద్దలు చెబుతుంటారు. అందులో ఒక విగ్రహం తిరిగి ఒడ్డుకు వచ్చిందని, అదే విగ్రహాన్ని వనంగుడి బాలాలయంలో ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఆలయాన్ని దర్శిస్తే ఈడేరనున్న కోరికలు పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి విశాలమైన ప్రాంతంలో నిర్మించారు. అమ్మవారు ఎక్కడైతే పెద్దచెరువులో పతివాడ అప్పలనాయుడుకు సాక్షాత్కరించారో అదేస్థలంలో వనంగుడి నిర్మించడం, అమ్మవారు లభ్యమైనచోటే విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కులు వెంటనే నెరవేరుతాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో అమ్మవారు భక్తులను పండగరోజు చిన్నపాటి చినుకులతో ఆశీర్వదిస్తూ ఉంటారు. తల్లిని దర్శించి మొక్కులు మొక్కిన వారందరూ కేవలం నెలల వ్యవధిలోనే తిరిగి తమ కోర్కెలు నెరవేరాయని, సత్యమైన తల్లి అంటూ అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో మొక్కుబడులు చెల్లిస్తుంటారు. సిరిమానోత్సావానికి ఉత్తరాంధ్రా నుంచే కాకుండా ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి, ఎన్ఆర్ఐలు, విదేశీయులు వచ్చి ఉత్సవాన్ని తిలకిస్తారు. (క్లిక్ చేయండి: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు) తల్లిసేవలో తరిస్తున్నా.. మా నాన్నగారు నేతేటి శ్రీనివాస్ సిరిమాను అధిరోహించారు. పైడితల్లికి సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మసేవలో తరిస్తున్నాను. ఎందరో భక్తులు అమ్మ మహిమలతో పాటు వారికి కలిగిన మంచి పనుల గురించి నాతో వారి అనుభవాన్ని పంచుకుంటారు. – నేతేటి ప్రశాంత్, వనంగుడి అర్చకుడు, విజయనగరం. -
Sirimanostavam 2022: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయగవంతంగా నిర్వహించేందుకు మూడువేల మంది పోలీస్ బలగాలతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే తొలేళ్ల ఉత్సవం, 11న జరిగే సిరిమానోత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావుతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిమానోత్సవం రోజున బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు మూడువేల మంది పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డీఎస్పీలు, 63 మంది సీఐ/ఆర్ఐలు, 166 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 11 మంది మహిళా ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా సుమారు మూడువేలమంది పోలీస్ అధికారులను, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. మహిళా పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సీఐ జి.రాంబాబు, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ అమ్మవారి చదురుగుడి ఎదురుగా తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకుని వచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వాటన్నంటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించే సిబ్బంది బైనాక్యూలర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. 200 మందితో ప్రత్యేక నిఘా నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ బృందాలు ఆలయం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంటాయన్నారు. పార్కింగ్ ఇలా.. ట్రాఫిక్ నియంత్రణకు వాహనాల పార్కింగ్‌కి సంబంధించి అయోధ్యా మైదానం, రాజీవ్‌స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, అయ్యకోనేరు గట్టు, పోర్ట్ సిటీ స్కూల్ రోడ్డు, ఎస్వీఎన్ నగర్ రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకూ గల రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు ఏర్పాటుచేశామన్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు బొంకులదిబ్బ, టీటీడీ కల్యాణమండపం, గురజాడ కళాక్షేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్నిచ్చేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిరిమానోత్సవం రోజున ఫోర్ వీలర్స్ వాహనాలు ఎంఆర్ కళాశాల, కేపీ టెంపుల్, గంటస్తంభం, ట్యాక్సీ స్టాండ్, శివాలయం వీధి, ఘోష ఆస్పత్రి, గుమ్చీ రోడ్డు, సింహాచలం మేడ, సత్యా లాడ్జి ప్రాంతాల్లో ప్రవేసించేందుకు అనుమతి ఉండదన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎటువంటి తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించేలా అనుసంధాన రోడ్లలో బాక్స్ సిస్టమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అధికారులు 200 వైర్లెస్ సెట్స్‌ను పోలీసుల వద్ద ఉంచి, ప్రజలకు సూచనలు చేస్తారు. పోలీసు సేవాదళ్ భక్తులకు సేవలందిస్తారు. బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి దిశ మహిళా టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పైడితల్లి అమ్మవారి పండగ శాంతియుతంగా భక్తి వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసుల సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పోలీసులందరూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందించాని ఆదేశించారు. సిరిమానోత్సవం రోజున డైవర్షన్స్ ఇలా.. పట్టణంలోని వాహనాలు సీఎంఆర్ జంక్షన్, గూడ్స్షెడ్ల మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం నుంచి వెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తారు. జేఎన్టీయూ, కలెక్టేరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా పట్టణ బయటకు వాహనాలకు అనుమతిస్తారు. ప్రదీప్‌నగర్ కూడలి, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తారు. -
పైడితల్లి ఉత్సవంలో అశోక్‌గజపతి రాజుకు అవమానం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పి. అశోక్‌గజపతి రాజుకు సొంత ఇలాకా విజయనగరంలో మంగళవారం అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్‌గజపతి రాజు ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. పైడితల్లమ్మవారి తొలేళ్ల ఉత్సవం ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కానుంది. అయితే దాదాపు రెండు శతాబ్దాల చరిత్రలో తొలిసారిగా 144 సెక్షన్ అమల్లో ఉండగా సిరిమానోత్సవం జరుగుతోంది. అయితే విజయనగరంలో పోలీసు ఆంక్షల నేపథ్యంలో గతేడాది కంటే సిరిమానోత్సవానికి హాజరయ్యే భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. -
విజయనగరంలో 144 సెక్షన్ ఎత్తివేయాలి: బొత్స
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి ఏటా నిర్వహించే జాతర మహోత్సవంలో కీలకమైన తొలేళ్లు ఉత్సవం నేడు ప్రారంభమయింది. జాతరలో భాగంగా సంగీత కళాశాల ఆవరణలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పట్టణంలో అమలులో ఉన్న 144 సెక్షన్ ఎత్తివేయాలని అధికారులకు సూచించామని తెలిపారు. పట్టణంలో పక్షం రోజుల క్రితం జరిగిన అల్లర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవ సందడి తగ్గేఅవకాశాలున్నాయని భావిస్తున్నారు.