అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి కొట్టు | Minister Kottu Satyanarayana Sensational Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన వ్యక్తి చంద్రబాబు: మంత్రి కొట్టు

Published Wed, Sep 13 2023 4:38 PM | Last Updated on Wed, Sep 13 2023 5:45 PM

Minister Kottu Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిగూడెం క్యాంప్‌ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, కుట్ర, అవినీతిమయం అంటూ దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు. వ్యవస్థను మేనేజ్‌ చేసి దిగజారిపోయి సైకిల్‌ గుర్తును లాక్కున్నాడు’’ అని మండిపడ్డారు.

‘‘చంద్రబాబుకు ఏనాడు ప్రజలపై మమకారం లేదు. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. తప్పు చేసి ఎంతో కాలం తప్పించుకోలేరు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. ఇక చంద్రబాబు అధ్యాయం ముగిసిపోయింది. కుట్ర, మోసం, దగా, వెన్నుపోటులకు పుట్టిన హైబ్రిడ్ నాయకుడు చంద్రబాబు. కన్నతండ్రి చనిపోతే తలకొరివి కూడా పెట్టని వ్యక్తి చంద్రబాబు’’ అంటూ మంత్రి ధ్వజమెత్తారు.

‘‘రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి జైలు పాలైన వ్యక్తిగా చంద్రబాబు పేరు గాంచాడు. ప్రజలను ఎన్నికల్లో కుక్క బిస్కెట్లు వేసినట్లు డబ్బులు వేసి కొనేయొచ్చని చంద్రబాబు ఆలోచన. ప్రజల్ని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూసాడు. చంద్రబాబు నేను మరిపోయానని ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ స్కిల్ స్కాంకి ఒడిగట్టాడు. చంద్రబాబు నాయుడు కొత్త బిరుదు స్కాం స్టార్ అని సంపాదించాడు. స్కిల్ స్కాం, ఐటీ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి స్కాం, పోలవరం స్కాం, ఇసుక మీద దోపిడీ ఇలా చాలా స్కాంలు ఉన్నాయి.’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు.

‘‘చంద్రబాబుకి ఆనాడు దోపిడీ చేసిన వాళ్లే మిగిలారు తప్ప.. ప్రజలు ఎవరూ అయ్యో పాపం అన్న పాపాన పోలేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు చేసి ఎంతో కాలం తప్పించుకోలేరని ఈ రోజు రుజువు అయింది. ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెరిగింది. ఫైబర్ నెట్‌లో వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, అమరావతి రాజధాని అంటూ వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు దొరికింది చాలా చాలా చిన్నది.’’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
చదవండి: బాబు, పవన్‌ ఫెవికాల్ బంధం.. ఎవరేమైతే మాకేంటి? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement