సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలివిడతగా మూడు మణుగుల చందనం (120 కిలోలు) సమర్పిస్తారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్
Comments
Please login to add a commentAdd a comment