రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్ | Online sellers complain of mismanagement by marketplaces, want a regulator | Sakshi
Sakshi News home page

రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్

Published Sat, Jun 18 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్

రెగ్యులేటరీ బాడీ కావాలంటున్న ఈ-కామర్స్

న్యూఢిల్లీ : టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ల మాదిరిగా తమకు ఓ రెగ్యులేటరీ బాడీ కావాలంటున్నారు ఆన్ లైన్ సెల్లర్స్. ఆన్ లైన్ మార్కెట్ ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న నిర్వహణ లోపాలను ఈ రెగ్యులేటరీతో అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కు రెగ్యులేటరీ బాడీ ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఆల్ ఇండియా ఆన్ వెండర్స్ అసోసియేషన్(ఏఐఓవీఏ) ఓ వినతి పత్రం సమర్పించింది. ఈ రెగ్యులేటరీ ఏర్పాటుతో పన్నుల పరంగా వచ్చే ఇబ్బందులను కూడా తొలగించాలని అభ్యర్థించారు.

ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఆఫర్ చేసే కమిషన్ చార్జీలపై కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుందని, దాంతో పాటు వాల్యు యాడెడ్ టాక్స్, సర్వీసు టాక్స్ ల కింద కొరియర్ చార్జీలను వసూలుచేస్తున్నారని, వీటినుంచి ఉపశమనం కలిగించాలని సెల్లర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. అమ్మకాల వాల్యుమ్ పైనా, ఖర్చులపైనా వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నామని, అవి అమ్మక ధరల్లో దాదాపు 25 నుంచి 30 శాతం ఉన్నాయని తెలిపింది.

ప్రభుత్వం ఈ పన్నులను తగ్గిస్తే, ఉత్పత్తులపై కూడా ధరలు తగ్గుతాయని ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్ ఓ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 1000 మధ్యస్త, ఎగువస్థాయి అమ్మకపు ప్రతినిధులు ఈ విషయంపై జయంత్ సిన్హాకు ఫిర్యాదుచేశారు. మార్కెట్ ప్లేస్ ఎగ్జిక్యూటివ్ లు నిర్వహణపూరితంగా ఉందని, పరస్పర సంప్రదింపులతో తమకు న్యాయం జరగడం లేదని చెప్పారు. టెలికాం, ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్స్ కు ఉన్నట్టు తమకు కూడా ఓ ఆన్ లైన్ రెగ్యులేటరీ కావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement