EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనం | EPFO Members Insurance Benefits Hiked Up To Rs 7 Lakh Of Life Cover, Check More Details | Sakshi
Sakshi News home page

EPFO: కార్మికశాఖ కీలక నిర్ణయం.. పీఎఫ్‌పై మరింత ప్రయోజనం

Published Sat, Oct 19 2024 2:11 PM | Last Updated on Sat, Oct 19 2024 2:55 PM

EPFO members insurance benefits hiked up to Rs 7 lakh Check details

ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెరుగుపరిచిన ఈ పథకం రూ. 7 లక్షల వరకు జీవిత బీమా రక్షణను అందిస్తుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుండి  వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.

1976లో ప్రారంభమైన ఈ పథకం ఈపీఎఫ్‌ఓ ​​సభ్యులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణగా నిలుస్తోంది. ఈ స్కీమ్‌ కింద కనీసంగా  రూ. 1.5 లక్షలు, గరిష్టంగా రూ. 6 లక్షల బీమా కవరేజీని 2018లో ప్రవేశపెట్టారు. ఇది 2021 ఏప్రిల్ వరకు కొనసాగింది. మళ్లీ 2021 ఏప్రిల్ 28 నుంచి పొడిగిస్తూ కనీస బీమా ప్రయోజనాన్ని రూ. 2.5 లక్షలకు, గరిష్ట కవరేజీని రూ.7 లక్షలకు పెంచారు.

ఇదీ చదవండి: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త స్కీమ్‌..

అంతేకాకుండా ఈ లబ్ధి పొందేలంటే చివరి 12 నెలలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సడలించింది. వేర్వేరు కంపెనీల్లో పనిచేసి ఉన్నా సరిపోతుంది. ఈ పథకం చెల్లుబాటు ఈ ఏడాది ఏప్రిల్‌ 27తో ముగియగా ఈ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. ఈ చొరవ ఇప్పుడు 6 కోట్లకు పైగా ఈపీఎఫ్‌ఓ ​​సభ్యులకు రూ. 7 లక్షల వరకు జీవిత బీమాను అందిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement