ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మూడు పథకాల్ని ఖాతాదారులకు అందిస్తుంది. వాటిలో ఒకటి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్), ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, వీటిలో ఈడీఎల్‌ఐ పథకంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారుడు మరణిస్తే సదరు ఉద్యోగి నామినీకి రూ.7 లక్షల వరకు ప్రయోజనాల్ని అందిస్తుంది. ఇవి పొందాలంటే ఈ- నామినేషన్ తప్పనిసరి.
ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమ్జద్ ఖాన్ మాట్లాడుతూ, ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా రక్షణగా ఈపీఎఫ్ అందించే ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఉద్యోగుల కోసం 1976లో ప్రారంభించిన ఈ పథకం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా ఈడీఎల్‌ఐ ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటాయని అన్నారు.
ఇక, ఈపీఎస్, ఈపీఎఫ్ స్కీమ్‌లలో ఉద్యోగి కొంత మొత్తాన్ని చెల్లిస్తుండగా.. ఈడీఎల్‌ఐలో మాత్రం ఉద్యోగి తరుపున యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందాలంటే ఏదైనా సంస్థలో ఏడాది పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏడాదిలోపు ఉద్యోగులు ఈ స్కీమ్‌లో అనర్హులు. మరింత సమాచారం కోసం సంబంధిత ఈపీఎఫ్‌వో కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
క్లెయిమ్ ప్రాసెస్ : ఉద్యోగి అకాల మరణంతో నామినీలు తప్పనిసరిగా పీఎఫ్ , పెన్షన్ విత్ డ్రాయిల్, ఈడీఎల్‌ఐలను క్లెయిమ్ ఫారమ్ ద్వారా క్లెయిమ్ చేయాలి. నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. తప్పని సరిగా బ్లాంక్ చెక్‌లు సైతం అందుబాటులో ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment