Women Kills Husband For Insurance Money With Help Of Boy Friend In Jharkhand - Sakshi
Sakshi News home page

బీమా డబ్బులు కోసం ప్రియుడితో కలిసి ప్లాన్‌.. భర్త ఇంట్లోకి రాగానే

Apr 10 2023 5:58 PM | Updated on Apr 10 2023 9:47 PM

Women Kills Husband For Insurance Money With Help Of Boy Friend Jharkhand - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాంచీ: పెళ్లి మండపంలో వధూవరులు జీవితాంతం ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం చేస్తారు. అయితే కొంత కాలం ప్రయాణం తర్వాత కొన్ని జంటల మధ్య ఏం జరుగుతుందో ఏమో గానీ ఈ ప్రమాణాలను గాలికి వదిలేసి వారి దాంపత్య జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు మందుకేసి తమ భాగస్వాములను హతమారుస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చూస్తునే ఉన్నాం.

తాజాగా బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఇక్కడ మరో విషాదం  ఏంటంటే.. ఈ దంపతులకు ఆరుగురు పిల్లలు. తండ్రి మరణం, తల్లికి జైలు శిక్ష.. ఇప్పుడికి ఆ  పిల్లలు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..  మరియం సురిన్‌ అనే మహిళ ఇటీవల ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన భర్త నుంచి విడిపోయి తన ప్రియడితో కలిసి జీవించాలని అనుకుంది. అయితే వారిద్దరికీ బతకడానికి డబ్బుకు లోటు ఉండకూడదని భావించింది.

ఈ క్రమంలో ఆ మహిళ తన ప్రియుడితో కలిసి దారుణమైన కుట్ర పన్నింది. భర్త వాసిల్ సూరిన్ మరణిస్తే అతని పేరు మీద బీమా సొమ్ము రూ.20 లక్షలు తనకే దక్కుతుందని భావించింది. ప్లాన్‌ ప్రకారం తన భార్త ఇంట్లోకి రాగానే తలుపులు అన్నీ మూసేసింది. తనకీ ఏమాత్రం అనుమానం రాకుండా వినయం నటిస్తూ అతన్ని మాటల్లోకి దింపింది. ఈ క్రమంలో రాడ్‌తో భర్తని కొట్టి చంపింది. ఈ హత్యను ప్రమాదవశాత్తు జరిగిందని ఆ మహిళ నమ్మించాలని ప్రయత్నించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు నుంచి మరియం సురిన్‌ చెప్పే మాటలపై అనుమానం వచ్చింది. చివరికి ఈ ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement